భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

రాజ్యసభ, రాష్ట్ర శాసనమండలి ఎన్నికలు-2026 నామినేషన్ల సమర్పణ ప్రక్రియ ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 01 JUN 2026 3:43PM by PIB Hyderabad

1. 27 రాజ్యసభ స్థానాలకుమూడు రాష్ట్రాల్లో శాసనమండలి స్థానాలకు (ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికరెండేళ్లకోసారి జరిగే ఎన్నికలనుఉపఎన్నికలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐప్రకటించింది.

2. వివరాలు దిగువన పేర్కొన్న విధంగా ఉన్నాయి.

 

శాసన వ్యవస్థ

ఎన్నికల విధానం

రాష్ట్రం(లు)

స్థానాలు

రాజ్యసభ

రెండేళ్లకోసారి జరిగే  ఎన్నికలు

10 రాష్ట్రాలు*

24

రాజ్యసభ

ఉపఎన్నిక

మహారాష్ట్ర

1

రాజ్యసభ

ఉపఎన్నిక

తమిళనాడు

1

రాజ్యసభ

ఉపఎన్నిక

ఒడిశా

1

రాష్ట్ర శాసనమండలి (ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక)

రెండేళ్లకోసారి జరిగే  ఎన్నికలు

బీహార్

9

రాష్ట్ర శాసనమండలి (ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక)

రెండేళ్లకోసారి జరిగే  ఎన్నికలు

కర్ణాటక

7

రాష్ట్ర శాసనమండలి (ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక)

ఉపఎన్నిక

బీహార్

1

*రాష్ట్రాలుఆంధ్రప్రదేశ్గుజరాత్జార్ఖండ్మధ్యప్రదేశ్మణిపూర్మేఘాలయరాజస్థాన్అరుణాచల్ ప్రదేశ్కర్ణాటకమిజోరాం

3. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసిరిటర్నింగు అధికారులనుసహాయ రిటర్నింగు అధికారులను (ద్వైవార్షికఉపఎన్నికలు- రెండింటి కోసంఎన్నికల సంఘం నియమించిందినియామ వివరాలు గెజిట్ ఆఫ్ ఇండియా/రాష్ట్రాల గెజిట్లలో ఈ రోజు ప్రచురితమయ్యాయి.

4. దీంతో పైన పేర్కొన్న అన్ని ఎన్నికలకు ఈ రోజు అంటే 2026 జూన్ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందినామినేషన్ల సమర్పణకు తుది గడువు 2026, జూన్ మధ్యాహ్నం గంటలతో ముగుస్తుంది.  

5. ప్రతి ఎన్నికకూ దాఖలైన నామినేషన్ల పరిశీలనను సంబంధిత రిటర్నింగు అధికారులు 2026, జూన్ 9న చేపడతారునామినేషన్ల ఉపసంహరణకు 2026, జూన్ 11ను చివరి తేదీగా నిర్ణయించారు.

6. ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. 2026 జూన్ 18 ఉదయం గంటల నుంచి సాయంత్రం గంటల వరకు పోలింగ్ జరుగుతుందిసాయంత్రం గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2267603) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali