ప్రధాన మంత్రి కార్యాలయం
వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
28 MAY 2026 9:52AM by PIB Hyderabad
నేడు వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన్ను స్మరించుకున్నారు. సావర్కర్ అసాధారణ ధైర్యసాహసాలకు, దేశభక్తికి, సమాజ సంస్కరణలకు ఆయన చేసిన కృషికి ఈ సందర్భంగా నివాళులు అర్పించారు.
గొప్ప విప్లవకారుడు, ప్రముఖ జాతీయవాద మేధావి అయిన వీర సావర్కర్ ధైర్యం, మేధస్సు, దేశభక్తి స్ఫూర్తితో దేశంలోని ప్రతి తరాన్ని నిరంతరం ముందుకు నడిపిస్తూనే ఉంటారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ప్రధానమంత్రి ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు.
‘‘అనన్తోద్భూతభూతౌఘసంకులే భూతలేఖిలే।
శాస్త్రే శాస్త్రే త్రిచతురాశ్చతురా యది మాదృశాః । ’’
ఈ ప్రపంచంలో చాలామంది కేవలం జ్ఞానం తెలివితేటలు ఉన్నవారిగానో లేదా కేవలం బలం ఉన్నవారిగానో గుర్తింపు పొందుతారని.. కానీ వివేకం, శౌర్యం రెండూ కలిగి ఉండే ప్రశాంతమైన, మహోన్నతమైన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని ఒక సుభాషితం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటున్నాను. ఆయన ధైర్యం, దేశభక్తి ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఆయన మేధస్సు, సాంఘిక సంస్కరణలపై ఆయన చూపిన శ్రద్ధ కూడా ప్రశంసనీయం’’.
‘‘గొప్ప విప్లవకారుడు, జాతీయవాద మేధావి వీర సావర్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు నా గౌరవపూర్వక నివాళులు. ధైర్యసాహసాలు, అద్భుతమైన మేధస్సుతో కూడిన ఆయన వ్యక్తిత్వం దేశంలోని ప్రతి తరాన్ని నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’’.
‘‘అనన్తోద్భూతభూతౌఘసంకులే భూతలేఖిలే।
శాస్త్రే శాస్త్రే త్రిచతురాశ్చతురా యది మాదృశాః । ’’
(రిలీజ్ ఐడి: 2266313)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam