మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు-2026 (ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్‌లు) కోసం


నామినేషన్లను ఆహ్వానిస్తోన్న విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత విద్యా విభాగం

నాడు పోస్టు చేయడమైనది: 27 MAY 2026 5:06PM by PIB Hyderabad

ఉపాధ్యాయులకు అందించే జాతీయ అవార్డులు-2026 (ఉన్నత విద్యాసంస్థలుపాలిటెక్నిక్‌లుకోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత విద్యా విభాగం ప్రతిపాదనలను ఆహ్వానిస్తోందిఅర్హులైన వారు కేంద్ర ప్రభుత్వ అధికారిక అవార్డుల వేదిక అయిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (www.awards.gov.inద్వారా ప్రతిపాదనలను సమర్పించవచ్చుఈ  అవార్డుల నిర్వహణలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈసంస్థాగత భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

దేశవ్యాప్తంగా ఉన్న సాంకేతికసాంకేతికేతర ఉన్నత విద్యాసంస్థలతో పాటు పాలిటెక్నిక్ కళాశాలల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులకు ఈ జాతీయ పురస్కారాలను అందజేస్తారు.

అవార్డుల విభాగాలు

విభాగం Iఉన్నత విద్యా సంస్థల అధ్యాపకులు

ఈ విభాగానికి సంబంధించిన ప్రధాన సబ్జెక్టులను మూడు ఉప విభాగాలుగా వర్గీకరించారు అవి..

ఉప-విభాగం (i) : ఇంజనీరింగ్సాంకేతిక విద్యఆర్కిటెక్చర్ మొదలైనవి.

ఉప-విభాగం (ii) : గణితంభౌతిక శాస్త్రాలుజీవ శాస్త్రాలురసాయన శాస్త్రాలువైద్యంఔషధం మొదలైనవి.

ఉప-విభాగం (iii): కళలుసామాజిక శాస్త్రాలుమానవీయ శాస్త్రాలుభాషలున్యాయ విద్యవాణిజ్య శాస్త్రంమేనేజ్‌మెంట్ మొదలైనవి.

పై జాబితాలో పేర్కొన్న సబ్జెక్టులు కేవలం సూచనాత్మకమైనవి మాత్రమేఉన్నత విద్యా రంగానికి సంబంధించిన ఇతర సబ్జెక్టులువిభాగాలు లేదా కొత్తగా అభివృద్ధి చెందుతున్న  విజ్ఞాన విభాగాలు  కూడా ఈ అవార్డుల పరిధిలోకి వస్తాయి.

 

విభాగం II: పాలిటెక్నిక్ సంస్థల అధ్యాపకులు

ఈ అవార్డును పాలిటెక్నిక్ కళాశాలల్లో అద్భుత ప్రతిభ కనబరిచిఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులకు అందజేస్తారు.

దేశంలోని వివిధ కళాశాలలువిశ్వవిద్యాలయాలుఉన్నత విద్యా సంస్థలుపాలిటెక్నిక్‌ కళాశాల్లో అధ్యాపకులుగా పనిచేస్తూనిర్దేశిత అర్హతల కలిగిన వారు ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  దరఖాస్తుదారులకు డిగ్రీపోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కనీసం అయిదు సంవత్సరాల పూర్తికాల బోధనానుభవం కలిగి ఉండాలిప్రతిపాదనల సమర్పణకు చివరి తేదీ నాటికి 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదువైస్-ఛాన్సలర్లుడైరెక్టర్లుప్రిన్సిపాల్‌లు శాశ్వత ఉద్యోగులు అయినా లేదా తాత్కాలికమైనా దరఖాస్తు చేయడానికి అర్హులు కారుఒకవేళ గతంలో అటువంటి పదవులను నిర్వహించి 55 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ప్రస్తుతం క్రియాశీల సేవల్లో కొనసాగుతున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

నామినేషన్ విధానాలు (ప్రజా భాగస్వామ్యం ప్రాతిపదికన కేవలం ఆన్‌లైన్ ద్వారా నామినేషన్లు స్వీకరిస్తారు)

·       స్వీయ ప్రతిపాదన

·       సంస్థాగత ప్రతిపాదనఉన్నత విద్యాసంస్థలు లేదా పాలిటెక్నిక్ అధినేతలు (డైరెక్టర్ప్రిన్సిపాల్ లేదా వైస్ ఛాన్సలర్తమ పరిధిలోని ఉత్తమ అధ్యాపకులను నామినేట్ చేయడం.

·       సహోద్యోగుల ప్రతిపాదనఒక అధ్యాపకుడు శాశ్వతంగా పనిచేస్తున్న విశ్వవిద్యాలయంసంస్థకళాశాలపాలిటెక్నిక్‌కు చెందిన తోటి సహోద్యోగులు వారి పేరును ప్రతిపాదించడం.

అన్ని నామినేషన్లను నిర్ణీత విధానంలో కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ రాష్ట్రీయ పురస్కార్ వేదిక (awards.gov.inద్వారానే సమర్పించాల్సి ఉంటుంది.

నామినేషన్లు సమర్పించడానికి చివరి తేదీ05.07.2026

ఈ అవార్డులకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కింది వివరాల ద్వారా సంప్రదించవచ్చు

ఇమెయిల్: helpdesknataward26@aicte-india.org

ఫోన్ నంబర్లు011-29581051 / 011-295811236

(ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య మాత్రమే ఫోన్ చేయాలి)

***


(రిలీజ్ ఐడి: 2266293) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , Marathi , हिन्दी