ఆయుష్
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ యోగా దినోత్సవం…25 రోజుల కౌంట్‌డౌన్ కార్యక్రమానికి ప్రపంచ వారసత్వ ప్రదేశం ఖజురహోలో సర్వం సిద్ధం


ఖజురహోలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేంద్ర మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్

“భారతీయ వైజ్ఞానిక వారసత్వం, ఆధునిక ఆరోగ్య విధానం నడుమ సామరస్యానికి ఖజురహో ప్రతిబింబం’’: శ్రీ ప్రతాపరావు జాదవ్

ఖజురాహో పశ్చిమ ఆలయ సముదాయంలో ఒక్కచోట చేరుకోనున్న యోగా ఔత్సాహికులు

ఖజురహోలో యోగా మహోత్సవంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026కు దేశవ్యాప్తంగా నవోత్తేజం

నాడు పోస్టు చేయడమైనది: 26 MAY 2026 4:33PM by PIB Hyderabad

ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ (ఎండీఎన్ఐవై).. ‘యోగా మహోత్సవ్ – అంతర్జాతీయ యోగా దినోత్సవం – 2026కు 25 రోజుల కౌంట్‌డౌన్’ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా ఖజురహోలోని పశ్చిమ ఆలయ సమూహంలో రేపు నిర్వహించనున్నది.

ఈ కార్యక్రమానికి సన్నాహకంగా ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆయుష్ శాఖ సహాయ (స్వతంత్ర హోదా), ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ మాట్లాడారుఖజురహో ఎంపీ శ్రీ విష్ణుదత్త శర్మరాజ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీ అరవింద్ పటేరియా కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

 

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం దేశవ్యాప్త సన్నాహాల్లో భాగంగా ‘యోగా మహోత్సవ్ – 2026’ ఒక ముఖ్య ఘట్టంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ అన్నారుదేశవ్యాప్తంగా యోగాను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారుప్రజల్లో అవగాహనను పెంచడంతోపాటు ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే దిశగా.. 100 ప్రాంతాల్లోని 100 సంస్థలతో సమన్వయంతో ఒక వంద రోజుల దేశవ్యాప్త కౌంట్‌డౌన్ కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందని ఆయన తెలిపారు.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చొరవతో 2014లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించిన అనంతరం.. భారత సాంస్కృతికఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగమైన యోగా సంపూర్ణ ఆరోగ్యాన్నీశ్రేయస్సునూ అందించే అంతర్జాతీయ ఉద్యమంగా మారిందని మంత్రి వ్యాఖ్యానించారుఅలాగే ‘365 రోజులూ యోగా’ కార్యక్రమం కింద ఆయుష్గృహనిర్మాణ మంత్రిత్వ శాఖల సహకారంతో.. జూన్ 21 వరకు 100 రోజుల ఉచిత యోగా శిక్షణ కార్యక్రమాన్ని ఎండీఎన్ఐవై నిర్వహిస్తోందనిఇప్పటికే రెండు లక్షల మందికి పైగా ‘యోగా మిత్ర’లుగా నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు.

 

ఈ కార్యక్రమ ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. ‘‘భారత ప్రాచీన వైజ్ఞానిక సంప్రదాయం అందించిన అమూల్యమైన వరం యోగాసమతౌల్యసంపూర్ణఆరోగ్యకరమైన జీవనశైలీ మార్గాన్ని ఇది ప్రపంచానికి చూపిందిజీవనశైలి సంబంధిత సమస్యలు పెరుగుతున్న ఈ తరుణంలో.. ఒక ప్రభావవంతమైనశాస్త్రీయంగా నిరూపితమైన పరిష్కార మార్గంగా యోగా నిలుస్తోందిసుసంపన్నమైన భారత సాంస్కృతిక వారసత్వానికి ఒక సజీవ తార్కాణం ఖజురహోఈ చరిత్రాత్మక ప్రదేశంలో 25 రోజుల యోగా ఉత్సవాన్ని నిర్వహించడమన్నది.. భారతీయ వైజ్ఞానిక వారసత్వమూఆధునిక ఆరోగ్య విధానాల మధ్య సామరస్యాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుందియోగా పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆదరణను మరింత పెంచడంలోనూదానిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ ఈ ఉత్సవం కీలక పాత్ర పోషిస్తుందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను’’ అని కేంద్ర మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్ పేర్కొన్నారు.

 

యోగా మహోత్సవ్: అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు 25 రోజుల కౌంట్‌డౌన్

 

దేశవ్యాప్తంగా యోగా ప్రదర్శనలు, అవగాహన సదస్సులుసామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించడానికివారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికిదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక ముఖ్యమైన కార్యక్రమంగా.. అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఏటా ఈ 25 రోజుల కౌంట్‌డౌన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

 

ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందిదేశవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక యోగసాధకులువిద్యార్థులుఅధికారులుఆరోగ్యాభిలాషులు పాల్గొని.. అంతా కలిసి దైనందిన యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.

 

కేంద్ర మంత్రి శ్రీ ప్రతాపరావు జాదవ్మధ్యప్రదేశ్ ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదాశ్రీ ఇందర్ సింగ్ పర్మార్ ఈ కార్యక్రమానికి హాజరవుతారుఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి మోనాలిసా దాష్మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్కాశీనాథ్ సమగండిమంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులుయోగా నిపుణులుఆయుష్ వ్యవస్థలుఆధునిక వైద్య ప్రతినిధులుదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యోగాభ్యాసకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

 

ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి ‘ఆయుష్ ఆహారా’న్ని కూడా పంపిణీ చేస్తారు.

అత్యద్భుతమైన ఆలయ వాస్తుశిల్పం, ప్రసన్నమైన పరిసర వాతావరణంతో ప్రపంచవ్యాప్త ఖ్యాతి గడించిన ఖజురహో.. యోగా మహోత్సవ్ 2026కు అత్యంత సముచితమైన వేదికభారత ప్రాచీన సంప్రదాయాలుసంపూర్ణ ఆరోగ్యం నడుమ అనుసంధానాన్ని ఈ కార్యక్రమం బలంగా చాటుతుందిఅలాగే 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం దిశగా దేశవ్యాప్తంగా మరింత ఉత్తేజాన్ని నింపుతుంది.

 


***


(రిలీజ్ ఐడి: 2265626) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil , Kannada , Malayalam