ప్రధాన మంత్రి కార్యాలయం
మార్పు తెచ్చే శక్తి వాస్తవిక జ్ఞానానికి ఉందని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
26 MAY 2026 9:20AM by PIB Hyderabad
సిసలైన జ్ఞానం దేశం, సమాజంతో పాటు పూర్తి మానవజాతి సంక్షేమానికి కూడా బాటను వేస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మన జ్ఞానం, మనం చేసే పనులు యావత్తు మానవాళికి స్ఫూర్తిని అందించేవిగా ఉండడం ముఖ్యమని ఆయన అన్నారు.
సంస్కృత భాషలో ఉన్న ఈ కింది సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు..
‘‘ఆత్మా శుద్ధః సదా నిత్యః సుఖరూపః స్వయంప్రభః
అజ్ఞానాన్మలినో భాతి జ్ఞానాచ్ఛుద్ధో భవత్యయమ్’’.
‘ఆత్మ స్వభావసిద్ధంగానే శుద్ధంగా, శాశ్వతం, ఆనందమయం, స్వయంప్రకాశంతో కూడుకొని ఉంటుంది. అయితే అజ్ఞానం వల్ల అది శుద్ధత్వాన్ని కోల్పోయినట్లుగా కనిపిస్తుంది. యథార్థ జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా శుద్ధ స్వరూపాన్ని తిరిగి ప్రకటించగలుగుతుంది’ అని మనకు ఈ సుభాషితం బోధిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘నిజమైన జ్ఞానం దేశానికి, సమాజానికి, సమస్త మానవజాతి సంక్షేమానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. అందువల్ల మన జ్ఞానం, మన పనులూ పూర్తి మానవాళికి ప్రేరణను అందించాల్సిన అవసరం ఉంది.
‘‘ఆత్మా శుద్ధః సదా నిత్యః సుఖరూపః స్వయంప్రభః
అజ్ఞానాన్మలినో భాతి జ్ఞానాచ్ఛుద్ధో భవత్యయమ్’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2265351)
आगंतुक पटल : 60
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam