రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

అధునాతన కాన్సర్ చికిత్సకు ఆర్మీ ఆస్పత్రిలో (ఆర్‌ అండ్ ఆర్‌) అత్యాధునిక రేడియో థెరపీ సాంకేతికత ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 25 MAY 2026 12:00PM by PIB Hyderabad

ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రి (రీసెర్చ్ అండ్ రెఫరల్)లోని రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో రింగ్ గాంట్రీ-ఆధారిత లీనియర్ యాక్సిలరేటర్‌ను మే 25, 2026న రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్‌ కుమార్ సింగ్ సమక్షంలో ప్రారంభించారుఆర్మీ ఆస్పత్రిలో (ఆర్ అండ్‌ ఆర్)లో క్యాన్సర్ సేవలను ఈ అధునాతన సాంకేతికత బలోపేతం చేస్తుందిసేవలందిస్తున్న సైనికులుమాజీ సైనికులువారి కుటుంబ సభ్యులకు అధునాతన రేడియోథెరపీని అందుబాటులోకి తీసుకువస్తుందిఆస్పత్రిలోని రోగుల సంఖ్యకు అనుగుణంగా ఇది అంతర్గత చికిత్సా సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.

వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీఇంటెన్సిటీ-మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీఇమేజ్-గైడెడ్ రేడియేషన్ థెరపీస్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీస్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ వంటి అత్యాధునిక రేడియో థెరపీ విధానాలను అందించగల సామర్థ్యం ఈ లీనియర్ యాక్సిలరేటర్‌కు ఉందిఇది క్యాన్సర్ గడ్డలున్న భాగాలకు అత్యంత ఖచ్చితత్వంతో రేడియేషన్‌ను అందిస్తూనేదాని చుట్టూ ఉండే ఆరోగ్యకరమైన కణజాలాలపై ప్రభావం పడకుండా చూస్తుందితద్వారా రోగులకు మెరుగైన చికిత్సనుఅత్యుత్తమ సంరక్షణను అందించటంలో సహాయపడుతుంది.

సాయుధ దళాల వైద్య సేవల(ఏఎఫ్‌ఎంఎస్‌పరిధిలో ఆధునిక క్యాన్సర్‌ చికిత్సా పరికరం.. లీనియర్ యాక్సిలరేటర్‌ను కొనుగోలు చేశారుపనిచేయని పాత పరికరానికి బదులుగా ఈ కొత్త పరికరాన్ని తీసుకొచ్చారు.

ఏఎఫ్‌ఎంఎస్‌లో దీన్ని చేర్చటం... ఆంకాలజీ సేవల ఆధునీకరణ దిశగా ముందడుగుఏఎఫ్‌ఎంఎస్‌ పరిధిలోని ఇతర ఆంకాలజీ కేంద్రాలను కూడా దశలవారీగా ఆధునీకరిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో డీజీ ఏఎఫ్‌ఎంఎస్‌ సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆర్తి సారిన్ఆర్మీ ఆస్పత్రి (ఆర్‌ అండ్‌ ఆర్‌కమాండెంట్‌ లెఫ్టినెంట్‌ జనరల్ అవినాశ్‌ దాస్ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

(రిలీజ్ ఐడి: 2265218) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Punjabi , Gujarati , Tamil