ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సైప్రస్ అధ్యక్షుడితో సంయుక్త మీడియా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 22 MAY 2026 3:14PM by PIB Hyderabad

గౌరవనీయులైన సైప్రస్ అధ్యక్షుడు,

ఇరుదేశాల ప్రతినిధులు,

మీడియా మిత్రులారా,

నమస్కారం!

శుభోదయం

సైప్రస్ అధ్యక్షుడువారి ప్రతినిధి బృందానికి భారతదేశానికి స్వాగతం పలకటం ఎంతో సంతోషంగా ఉందిగౌరవ అధ్యక్షుడు గతేడాది సైప్రస్‌లో మాకు ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికారుభారతదేశం పట్ల మీకున్న ప్రత్యేకమైన స్నేహపూర్వక భావనకు ప్రతీకగా సైప్రస్ దేశ అత్యున్నత పురస్కారంతో నన్ను గౌరవించారు.

పర్యటన సందర్భంగా మీ ఆప్యాయతస్నేహంభారతదేశంతో మీకున్న బలమైన అనుబంధాన్ని మేం మనస్ఫూర్తిగా అనుభూతి చెందాంనేడు మీ భారత పర్యటన.. మన ఉమ్మడి ప్రయాణంలో మరో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.

మిత్రులారా,

భారత్‌సైప్రస్‌ మధ్య స్నేహం ఎంతో బలమైనదిభవిష్యత్‌ దృష్టితో కూడినదిప్రజాస్వామ్యంచట్టబద్ధమైన పాలన వంటి విలువలతో ఉమ్మడి విశ్వాసమే భాగస్వామ్యానికి ఆధారంమేం అన్ని దేశాల సార్వభౌమత్వాన్నిప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాంఈ సూత్రాలకు భారత్‌ పూర్తిగా కట్టుబడి ఉందిభవిష్యత్తులోనూ అలాగే ఉంటుంది.

భారత్యూరప్‌ సంబంధాలు నేడు నూతన స్వర్ణయుగంలోకి అడుగుపెడుతున్న తరుణంలో సైప్రస్‌ కేవలం కౌన్సిల్‌ ఆఫ్‌ ది యూరోపియన్‌ యూనియన్‌ అధ్యక్ష దేశంగా మాత్రమే కాకయూరప్‌ను భారత్‌తో అనుసంధానించే పెట్టుబడి ద్వారంగా ఆవిర్భవిస్తోంది.

మిత్రులారా,

భారతదేశంలో పెట్టుబడులు పెట్టే అగ్ర 10 దేశాల్లో సైప్రస్ ఒకటిగత దశాబ్ద కాలంలో సైప్రస్ నుంచి భారత్‌లోకి పెట్టుబడులు దాదాపు రెట్టింపయ్యాయిఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం మరింత బలపడిందిభారత్‌-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా ఎన్నో కొత్త అవకాశాలను సృష్టించిందిఈ ఉత్సాహంతో రాబోయే ఐదేళ్లలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాంఈ ఉమ్మడి దార్శనికతను సాకారం చేసేందుకు నేడు మన విశ్వసనీయ సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్తున్నాం.

మిత్రులారా,

ఇరుదేశాల ఆర్థికసేవా రంగ కేంద్రాలను అనుసంధానించటం ద్వారా భారత్‌సైప్రస్ మధ్య ఏర్పడిన ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం.. వాణిజ్యంపెట్టుబడులకు సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందిఇది సైప్రస్‌లోని మౌలిక సదుపాయాలుఇంధనంవ్యవసాయ రంగాల్లో భారతీయ కంపెనీలకు నూతన అవకాశాలను కల్పిస్తుందిభారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న షిప్పింగ్సముద్ర రవాణా పరిశ్రమల్లో మరింత పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది.

ప్రపంచ ఆర్థికసేవల కేంద్రంగా గిఫ్ట్‌ సిటీని మార్చాలనే ఆలోచనను సైప్రస్‌తో కలిసి మేం మరింత వేగవంతం చేస్తాంఇరుదేశాల ఆవిష్కరణలుఅంకుర సంస్థల వ్యవస్థల మధ్య అనుసంధానాన్ని పెంపొందిస్తాం.

మిత్రులారా,

మన సంబంధాల్లో రక్షణభద్రతా సహకారం కీలకమైనదిఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య సైనిక మార్పిడులుశిక్షణా సహకారం పెరగటం సంతోషకరంసైబర్సముద్ర భద్రతఉగ్రవాద నిరోధక రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇవాళ మేం నిర్ణయించాంఅంతేకాక ఇండో-పసిఫిక్ మహాసముద్రాలుభారత్‌-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ వంటి కీలక కార్యక్రమాల ద్వారా పరస్పర అనుసంధానానికి మేం కలిసి పనిచేస్తాం.

మిత్రులారా,

సైప్రస్‌లో నివసిస్తున్న భారత నిపుణులువిద్యార్థులు ఇరుదేశాల మధ్య ప్రజల సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నారుఈ సంబంధాలను మరింత పటిష్ఠం చేసేందుకు త్వరలోనే సమగ్ర వలసగమనశీలత భాగస్వామ్యంతో పాటు సామాజిక భద్రతా ఒప్పందంపై కలిసి పనిచేసేందుకు మేం అంగీకరించాం.

సంస్కృతిఉన్నత విద్యా రంగాల్లోనూ ఒప్పందాలపై నేడు మనం సంతకాలు చేస్తున్నాంఇవి ఇరుదేశాల మధ్య సాంస్కృతిక మార్పిడినిపరిశోధన సహకారాన్ని మరింత బలపరుస్తాయి.

మిత్రులారా,

ముఖ్యమైన ప్రపంచ సమస్యలపై ఇవాళ మనం చర్చించాంఉక్రెయిన్పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు జరిగే ప్రయత్నాలకుఘర్షణలు త్వరగా ముగిసేందుకు మా మద్దతును కొనసాగిస్తాంప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తీసుకురావటం అత్యవసరంఆవశ్యకమని మేం భావిస్తున్నాం.

గౌరవనీయులారా,

భారత్‌సైప్రస్ మధ్య బంధం కాలపరీక్షకు నిలిచి పటిష్ఠంగా కొనసాగుతోందిభారత్‌-సైప్రస్ వ్యూహాత్మక భాగస్వామ్య ఏర్పాటుతో నూతనోత్తేజంఆశయాలువేగంతో మన సంబంధాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.

మన మధ్య సహకారాన్ని ఉమ్మడి సృజనాత్మకతగాభాగస్వామ్యాన్ని పరస్పర సంక్షేమంగా మార్చుకునేందుకు కలిసి పనిచేద్దాం.

భారత్‌సైప్రస్ కలిసికట్టుగా సురక్షితసంపన్నమెరుగైన భవిష్యత్తును నిర్మిస్తాయి.

ధన్యవాదాలు.

గమనికప్రధానమంత్రి ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదంఅసలు ప్రసంగం హిందీలో ఇచ్చారు.

 

****


(రిలీజ్ ఐడి: 2264729) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia