ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 51,000 మందికి పైగా యువతకు రోజ్‌గార్‌ మేళా ద్వారా మే 23న నియామక పత్రాలను అందించనున్న ప్రధాని

प्रविष्टि तिथि: 22 MAY 2026 3:00PM by PIB Hyderabad

వివిధ ప్రభుత్వ విభాగాలుసంస్థల్లో నియామకాలు పొందిన 51,000 మందికి పైగా యువతకు 19వ రోజ్‌గార్ మేళాలో ప్రధానమంత్రి నియామక పత్రాలు అందిస్తారువీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2026 మే 23 ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందిఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తారు.

ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలనే ప్రధానమంత్రి దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడమే లక్ష్యంగా చేపడుతున్న ప్రధాన కార్యక్రమమే రోజ్‌గార్ మేళాఇది ప్రారంభమైన నాటి నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించిన 18 రోజ్‌గార్ మేళాల ద్వారా దాదాపు 12 లక్షల నియామక పత్రాలను అందించారు.

దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో 19 వ రోజ్‌గార్ మేళా నిర్వహిస్తారుదేశం నలుమూలల నుంచి కొత్తగా నియామకాలు పొందిన అభ్యర్థులు వివిధ మంత్రిత్వ శాఖలుప్రభుత్వ విభాగాల్లో చేరతారువాటిలో రైల్వేలుహోం వ్యవహారాలుఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలుఆర్థిక సేవలుఉన్నత విద్య తదితర విభాగాలున్నాయి.

***


(रिलीज़ आईडी: 2264190) आगंतुक पटल : 62
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali-TR , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam