ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాని అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం: జీవన సౌలభ్యం, వాణిజ్య సౌలభ్యాలను పెంపొందించడంపై చర్చ
నాడు పోస్టు చేయడమైనది:
22 MAY 2026 12:04PM by PIB Hyderabad
నిన్న ఫలప్రదంగా నిర్వహించిన మంత్రిమండలి సమావేశానికి సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.
‘జీవన సౌలభ్యం’, ‘వాణిజ్య సౌలభ్యా’లను పెంపొందించడానికి సంబంధించి విలువైన ఆలోచనలు, అత్యుత్తమ పద్ధతులపై మంత్రిమండలి చర్చించిందని ప్రధానమంత్రి తెలిపారు. మనందరి స్వప్నమైన వికసిత భారత్‌ను విజయవంతంగా సాకారం చేసుకునే దిశగా.. ప్రభావవంతంగా సంస్కరణలను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయమై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించినట్టు ప్రధానమంత్రి పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘నిన్న మంత్రివర్గ సమావేశం ఫలప్రదంగా జరిగింది. ‘జీవన సౌలభ్యం’, ‘వాణిజ్య సౌలభ్యా’లను పెంపొందించడానికి సంబంధించి వివిధ ఆలోచనలను, అత్యుత్తమ విధానాలతోపాటు.. మనందరి స్వప్నమైన వికసిత భారత్‌ను సాకారం చేసుకునే దిశగా సంస్కరణలను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయంపై మేం చర్చించాం.’’
****
(రిలీజ్ ఐడి: 2264143)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam