ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏకీకృత వైద్య పరిశోధనలో భారత్ నాయకత్వ సామర్థ్యాన్ని సంతరించుకుంటోందని స్పష్టం చేసిన తొలి ‘ఐసీఎమ్ఆర్ వార్షిక క్లినికల్ పరీక్షల సమావేశం-2026’


భారత్‌లో.. ఒకటో దశ మానవ- క్లినికల్ పరీక్షల్ని బలోపేతం చేసేందుకు ఐసీఎమ్ఆర్ నివేదిక

బహుళ కేంద్రాల్లో నిర్వహిస్తున్న పరిశోధనలపై నైతిక సమీక్షకూ మార్గదర్శక సూత్రాలు

భారత్‌లో క్లినికల్ పరీక్షలతో పాటు నియంత్రణా విస్తారిత అనుబంధ వ్యవస్థను పటిష్ఠ పరచడంపై చర్చించిన నిపుణులు

నాడు పోస్టు చేయడమైనది: 21 MAY 2026 11:35AM by PIB Hyderabad

‘‘అంతర్జాతీయ క్లినికల్ పరీక్షల దినోత్సవంఏకీకృత క్లినికల్ పరీక్షలపై ప్రత్యేక దృష్టి’’ అనే ఇతివృత్తంతో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్ఆర్) 2026 మే నెల 20న నిర్వహించిన ‘‘ఒకటో ఐసీఎమ్ఆర్ వార్షిక క్లినికల్ పరీక్షల సమావేశం-2026’’  విజయవంతమైందిజాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ సమావేశం భారత్‌లో క్లినికల్ పరీక్షల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటుదేశంలో ఫలితాల ఆధారిత ఏకీకృత పరిశోధనల్ని ముందుకు తీసుకుపోయే అంశంపై చర్చించడానికి ఒక కీలక వేదికగా మారింది.


ఈ సమావేశంలో విధాన రూపకర్తలుశాస్త్రవేత్తలువైద్యులుపరిశోధకులునియంత్రణ ప్రాధికార సంస్థలతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారువారు క్లినికల్ పరీక్షలు, పరిశోధనలో సరికొత్త అవకాశాలునైతిక ప్రణాళికలునియంత్రణ ప్రక్రియలతో పాటు నూతన ఆవిష్కరణలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ (డాక్టర్వి.కెపాల్డాక్టర్ రాజీవ్ బహల్శ్రీ వైద్య రాజేశ్ కొటేచాలతో పాటు ఆరోగ్యసంరక్షణశాస్త్రవేత్తల సముదాయానికి చెందిన ప్రఖ్యాత నిపుణులుఆసక్తిదారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రముఖులు ప్రసంగించారువారు ప్రజారోగ్య రంగంలో సరికొత్త సవాళ్లను ఎదుర్కోవడంలో దేశ ఆరోగ్య సేవల యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి దృఢతర వైద్య ప్రయోగాలు, పరిశోధన ప్రణాళికల్నీనైతిక పాలననీఏకీకృత ఆరోగ్య సంరక్షణ కార్యప్రణాళికల్నీ శాస్త్రీయంగా సరి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
మనుషుల్లో ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతపై ఐసీఎమ్ఆర్-సీసీఆర్ఏఎస్ బహుళ కేంద్ర సంబంధిత మూడో దశ ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్ (ఆర్‌సీటీఅధ్యయనాల్లోని విశేషాంశాలను ప్రకటించడం ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా నిలిచిందిరక్తహీనత సమస్య పరిష్కారానికి అనుసరించాల్సిన ఏకీకృత విధానాల్ని ఈ అధ్యయనంలో మదింపు చేశారుభారత్‌లో జనబాహుళ్యానికి ఎదురవుతున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి.
క్లినికల్ పరీక్షల్లో ఆయుర్వేదానికి చెందినపునర్నవాది మండురా- అనే ఔషధం పనితీరును విడిగాద్రాక్షవలేహతో ప్రామాణిక ఐరన్-ఫోలిక్ యాసిడ్‌లను చేర్చగా వెలువడిన ఫలితాల్ని పరిశీలించారురక్తహీనత మధ్యస్థ దశతో బాధపడుతున్న 18-49 ఏళ్ల వయోవర్గంలో సుమారు 4,000 మంది గర్భవతులు కాని మహిళల్ని ఎంపిక చేసుకొని నిర్వహించిన ఈ అధ్యయనంలో 90 రోజుల వ్యవధిలో హీమోగ్లోబిన్ స్థాయుల్నీ, ప్రయోగ ఫలితాల్నీ మదింపు చేశారుఈ రెండు విధాలైన ఆయుర్వే ఔషధులూ చికిత్స పరంగా ప్రామాణిక ఐరన్-ఫోలిక్ యాసిడ్ చికిత్సతో సమాన స్థాయి ఫలితాల్ని అందించినట్లు అధ్యయనంలో వెల్లడి అయింది.
ఈ కార్యక్రమంలో ‘‘భారత్‌లో మొదటి దశకు చెందిన క్లినికల్ పరీక్షలను ముందుకు తీసుకుపోవడంనియంత్రణకు సంబంధించిన ప్రక్రియలతో పాటు అవకాశాలపై డెల్పీ అధ్యయనం’’ పేరిట ఓ నివేదికను కూడా ఆవిష్కరించారుఈ నివేదికను ఔషధ తయారీ పరిశ్రమకాంట్రాక్ట్ రిసర్చ్ సంస్థలు (సీఆర్ఓస్), విద్యారంగంతో పాటు జాతీయ నియంత్రణ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 37 మంది నిపుణులతో రెండు దశల్లో సంప్రదించి రూపొందించారు.
ఈ అధ్యయనంలో భారత్‌లో తొలి దశ ప్రయోగాల పురోగతికి  అడ్డుపడుతున్న ప్రధాన అంశాలను గుర్తించారుదేశంలో నూతన ఆవిష్కరణల ఆధారిత పరిశోధనకు తోడ్పడటానికి నియంత్రణ సామర్థ్యాన్ని బలపరచడంఆమోదాన్ని తెలిపే ప్రక్రియలను సువ్యవస్థీకరించడంతో పాటు ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని పెంచడం సహా వివిధ చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫారసు చేశారు.
‘‘
భారత్‌లో బహుళ కేంద్రాల్లో పరిశోధనలపై ఒకే నైతిక సమీక్షకు ఉద్దేశించిన మార్గదర్శకాల’’ను కూడా ఈ కార్యక్రమంలో ప్రకటించారుదేశ వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో నిర్వహిస్తున్న అధ్యయనాల విషయంలో నైతిక సమీక్షా యంత్రాంగాల్ని బలోపేతం చేయడంతో పాటు వాటి మధ్య సారూప్యతను తీసుకురావడం దీని లక్ష్యం.
కార్యక్రమంలో భాగంగా ‘‘ఏకీకృత పరిశోధన ఫలితాల్ని విధానపరంగా స్వీకరించడం’’ అనే అంశంపై ఒక బృంద చర్చనూ నిర్వహించారుఈ చర్చ.. ప్రజారోగ్య విధానంఆరోగ్యసంరక్షణ సేవల అందజేతలో శాస్త్రీయ ఫలితాల్ని వినియోగించడంపై అర్థవంతమైన సంప్రదింపులకు ఓ అవకాశాన్ని అందించింది.
క్లినికల్ పరీక్షలపై నిర్వహించిన ఈ వార్షిక సమావేశం.. భారత్‌లో క్లినికల్ రిసర్చ్ విస్తారిత అనుబంధ వ్యవస్థలో పరస్పర సహకారాన్ని పెంపొందింప చేయడంనైతికనియంత్రణ ప్రణాళికల్ని బలోపేతం చేయడంతో పాటు శాస్త్రీయ శ్రేష్ఠతను ప్రోత్సహించడం పట్ల ఐసీఎమ్ఆర్‌ కున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది.

***

 

(రిలీజ్ ఐడి: 2264141) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Tamil