యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ప్రజాభిప్రాయాల కోసం వ్యవస్థీకృత డోపింగ్ కార్యకలాపాలను నేరంగా పరిగణించేలా ప్రతిపాదించిన డోపింగ్ నిరోధక చట్ట సవరణలు
ప్రతిపాదిత చట్టం ప్రకారం క్రీడాకారులకు నేర విచారణ నుంచి పూర్తి రక్షణ
ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భాగస్వాముల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్న యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
డోపింగ్‌లో నిమగ్నమైన స్మగ్లర్లు, అక్రమ సరఫరాదారులు, వ్యవస్థీకృత ముఠాలు, మోసపూరిత సహాయక సిబ్బందిని లక్ష్యంగా ప్రతిపాదిత నిబంధనలు
प्रविष्टि तिथि:
21 MAY 2026 12:36PM by PIB Hyderabad
క్రీడల్లో డోపింగ్ కార్యకలాపాలను నేరంగా పరిగణించేలా ప్రతిపాదించిన చట్ట సవరణలను భాగస్వాముల సంప్రదింపులు, ప్రజాభిప్రాయ సేకరణ కోసం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ బహిరంగంగా ప్రచురించింది.
క్రీడల్లో నిషేధించిన, సామర్థ్యాన్ని పెంచే ఉత్ప్రేరకాలు, అక్రమ రవాణా, చట్టవిరుద్ద సరఫరా, పంపిణీ, వాణిజ్య పరమైన విక్రయాల్లో నిమగ్నమై, రోజురోజుకూ విస్తరిస్తున్న వ్యవస్థీకృత కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదిత చట్టాన్ని రూపొందించారు.
ఈ ప్రతిపాదిత సవరణల ప్రకారం నిషేధిత ఉత్ప్రేరకాల అక్రమ రవాణా, అనధికార విక్రయాలు, పంపిణీ, డోపింగ్ ప్రయోజనాల కోసం క్రీడాకారులకు నిషేధిత పదార్థాలను అందించడం, మైనర్లకు నిషేధిత పదార్థాలను సరఫరా చేయడం, డోపింగ్‌తో ముడిపడి ఉన్న వ్యవస్థీకృత నేరాలు, వాణిజ్య కార్యకలాపాలు,నిర్దేశిత లేబులింగ్ లేకుండా నిషేధిత పదార్థాలను విక్రయించడం, డోపింగ్‌ను ప్రోత్సహించే ప్రకటనలు లేదా చెల్లింపు ప్రమోషన్లు చేయడం వంటి కార్యకలాపాలను క్రిమినల్ నేరాలుగా పరిగణిస్తారు.
డోపింగ్ వ్యవస్థలో భాగస్వాములైన అక్రమ రవాణాదారులు, అక్రమ సరఫరాదారులు, వ్యవస్థీకృత ముఠాలు, క్రీడాకారులను మోసగించే సహాయక సిబ్బందిని కఠినంగా శిక్షించడమే ఈ ప్రతిపాదిత నిబంధనల ముఖ్య ఉద్దేశం.
ముఖ్యంగా అక్రమ రవాణా, వ్యవస్థీకృత ముఠాలు వంటి ప్రతిపాదిత నేరపూరిత కార్యకలాపాల్లో ప్రమేయం లేదని తేలిన క్రీడాకారులను, కేవలం డోపింగ్ నిరోధక నియమాలను ఉల్లంఘించినందుకో లేదా వారి డోపింగ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినందుకో నేరస్థులుగా పరిగణించరు. క్రీడాకారులు పాల్పడే యాంటీ-డోపింగ్ నిబంధనల ఉల్లంఘనలను ప్రస్తుతం అమలులో ఉన్న డోపింగ్ నిరోధక నిబంధనావళి ప్రకారమే యథావిధిగా కొనసాగిస్తారు.
*****
(रिलीज़ आईडी: 2263966)
आगंतुक पटल : 47