ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్-నార్డిక్ మూడో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఐస్‌లాండ్ ప్రధానితో సమావేశమైన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 19 MAY 2026 6:44PM by PIB Hyderabad

భారత్-నార్డిక్ మూడో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓస్లో వేదికగా ఐస్‌లాండ్ ప్రధానమంత్రి శ్రీమతి క్రిస్ట్రన్ ఫ్రోస్టాడోట్టిర్‌తో సమావేశమయ్యారు.

ఐస్‌లాండ్ ప్రధానమంత్రిగా ఫ్రోస్టాడోట్టిర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత... ఈ ఇరువురు నేతల మధ్య ఇది మొదటి సమావేశం. ఐస్‌లాండ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రిగా ఘనత సాధించిన ఫ్రోస్టాడోట్టిర్‌కు ప్రధాననమంత్రి శ్రీ మోదీ అభినందనలు తెలిపారు.

భారత్-యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఈఎఫ్‌టీఏ)... వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టీఈపీఏ) అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, తయారీ రంగ సహకారంలో ఇరు దేశాల అసలైన సామర్థ్యాన్ని వెలికితీయడానికి టీఈపీఏ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుందని ఇరువురు నేతలూ అభిప్రాయపడ్డారు.

జియోథర్మల్ ఎనర్జీ, మత్స్య పరిశ్రమ, వినూత్న సాంకేతికతలు, సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, పర్యాటకం, రవాణా, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పురోగతిని వారు సమీక్షించారు. ఆర్కిటిక్ పరిశోధనలో సహకారాన్ని పెంపొందించే మార్గాలను ఇరువురు ప్రధానమంత్రులు చర్చించారు.

పరస్పర అనుకూల సమయంలో భారత్‌ను సందర్శించాలని ఐస్‌లాండ్ ప్రధానమంత్రిని... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు.

 

****


(रिलीज़ आईडी: 2263260) आगंतुक पटल : 61
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Kannada , Manipuri , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Malayalam