ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్-నార్వే వాణిజ్య, పరిశోధన సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 18 MAY 2026 10:26PM by PIB Hyderabad

ఓస్లోలో జరిగిన భారత్-నార్వే వాణిజ్యపరిశోధన సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారుగౌరవ రాజు హాకాన్‌నార్వే ప్రధానమంత్రి గౌరవ జోనాస్ గార్‌ స్టోర్‌ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.

ఈ సదస్సుకు 50కి పైగా కంపెనీల సీఈలు.. నార్వేభారత్‌లోని వాణిజ్యపరిశోధన సంస్థలకు సంబంధించి 250 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారుభారత్-ఈఎఫ్‌టీఏ వాణిజ్యఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చాక పెరుగుతున్న ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని ఈ సదస్సు స్పష్టం చేసింది.

ఉన్నత స్థాయి వాణిజ్యపరిశోధన సదస్సుకు ముందుగా ఓస్లోలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు రౌండ్‌టేబుల్‌ సమావేశాలను నిర్వహించారుఈ సమావేశాలు ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలునౌకాయాన సహకారంబ్యాటరీలుఇంధన నిల్వ వ్యవస్థలుడిజిటలైజేషన్‌విద్యుద్దీకరణపవన విద్యుత్‌ అంశాలపై దృష్టి సారించాయి.

ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. టీఈపీఏ ఒప్పందం అమల్లోకి వచ్చాక ద్వైపాక్షిక వాణిజ్యంపెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని అభినందించారుటీఈపీఏ ఒప్పందం ద్వారా 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని సాధించేందుకుభారత్‌లో ఒక మిలియన్ ఉద్యోగాలను సృష్టించేందుకు ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలని స్పష్టం చేశారుభారతదేశ బలమైన వృద్ధిజనాభా ప్రయోజనాలుప్రతిభఉన్నత ఆశయాలు గల యువతపటిష్ఠమైన వ్యాపార పద్ధతులుపెట్టుబడిదారులకు అనుకూలమైన నియంత్రణ వ్యవస్థపోటీతత్వ సమాఖ్యవాద స్ఫూర్తి గురించి వివరించారునీలి ఆర్థిక వ్యవస్థనౌకా నిర్మాణంపర్యావరణహిత మార్పుపునరుత్పాదక ఇంధనంహెల్త్-టెక్కీలక ఖనిజాలుఅంకుర సంస్థల వంటి కీలక రంగాల్లో భారతదేశంలో నార్వే పెట్టుబడులను పెంచాలని ప్రోత్సహించారు.

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పర్యావరణహిత మార్పు అజెండా గురించి ప్రధానమంత్రి మాట్లాడారువిస్తృతమైన దేశంపెరుగుతున్న ఇంధన అవసరాలువాతావరణ మార్పుల పట్ల ఉన్న నిబద్ధతపునరుత్పాదక ఇంధనంగ్రిడ్‌ మౌలిక సదుపాయాలుగ్రీన్ హైడ్రోజన్‌స్వచ‌్ఛ ఇంధన రంగాల్లోని వేగవంతమైన వృద్ధిని ఆయన ప్రస్తావించారుస్వచ్ఛ ఇంధన రంగంలో పెట్టుబడులుసముద్రయాన రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించటంసుస్థిరత నెలకొల్పటంవాతావరణ రంగంలో ఆర్థిక సహాయం వంటి అంశాల్లో ప్రపంచ నాయకత్వ పాత్రను పోషిస్తున్న నార్వేను అభినందించారుఇరుదేశాల వాణిజ్య వర్గాలు నూతన భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలనిఅభివృద్ధి చెందుతున్న సహకార రంగాలను గుర్తించిఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

ఈ సదస్సు సందర్భంగా భారత్నార్వే కంపెనీలుసంస్థల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి

*** 


(రిలీజ్ ఐడి: 2262653) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam