ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పెరుగుతున్న భారతదేశ శక్తికి ప్రజల సంకల్పం, అంకితభావమే కీలకమని స్పష్టం చేసే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 15 MAY 2026 2:25PM by PIB Hyderabad

అంతర్జాతీయ స్థాయిలో భారత్ సాధిస్తున్న నిరంతర పురోగతికి దేశ ప్రజల అంకితభావం, శ్రమ, ఉమ్మడి స్ఫూర్తే ప్రధాన కారణమని చెబుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు.

ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత శ్లోకం-

"యథాశక్తి చికిర్షన్తి యథాశక్తి చ కుర్వతే

న కిఞ‌్చిదవమన్యన్తే నరా: పండిత్‌బుద్ధయః"

సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"మన దేశ ప్రజల ఈ గుణాల వల్లే నేడు భారతదేశం నిరంతరం బలాన్ని పెంచుకుంటోంది.

జ్ఞానులు సామర్థ్యానికి తగినట్లుగా పనులు చేయాలని కోరుకుంటారు. ఏ చిన్న పనిని కూడా తక్కువ చేసి చూడరు".

***


(రిలీజ్ ఐడి: 2261375) సందర్శకుల సూచీ సంఖ్య : : 87