గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పత్రికా ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 14 MAY 2026 3:54PM by PIB Hyderabad

‘‘జేజీ బిల్డింగ్ గ్రూపు’’ పేరిట కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఒక సంస్థ కొన్ని మోసకారి పనులకు పాల్పడుతోందని ప్రభుత్వం దృష్టికి వచ్చింది.. గృహనిర్మాణ- పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్‌యూఏ)తో అనుబంధం ఉందనే తప్పుడు వాదనతో  నియామకాలకు సంబంధించిన నకిలీ కార్యకలాపాలను ఆ సంస్థ చేపడుతున్నట్లు తెలిసింది. 
2.    పైన ప్రస్తావించిన సంస్థ.. ఈ కింద పేర్కొన్న పనులకు ఒడిగడుతోంది..:
(i).        గృహనిర్మాణ- పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్‌యూఏ) పేరును ఉపయోగించుకుంటూ ఉద్యోగ ఖాళీలపై మోసకారి నోటీసుల్ని జారీ చేస్తున్నది;
(ii).       మంత్రిత్వ శాఖ అధికార పత్రాన్ని ఇచ్చిందని, మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తున్నామని చెప్పుకొంటూ అభ్యర్థులకు భ్రమలను కల్పిస్తోంది;
(iii).      ఉద్యోగాలు వేయిస్తామనే సాకుతో దరఖాస్తుదారుల వద్ద నుంచి ఆర్థిక ప్రతిఫలం కోరుతున్నట్లుగా వినవస్తోంది;
 (iv).      అలాంటి తప్పుడు వాదనలను బలపరుచుకునేలా ఆన్‌లైన్‌లో ఓ వేదిక/వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది.
3.         ఈ సందర్భంగా, ఈ కింది విషయాలను విడమరచి చెప్పేదేమిటంటే:
(a).       అలాంటి ఏ నియామక నోటీసునూ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేయనేలేదు;

(b).       మంత్రిత్వ శాఖ తన తరఫున నియామకం చేపట్టవలసిందంటూ ఏ ప్రయివేటు ఏజెన్సీకి, లేదా సంస్థకీ అధికారాన్ని ధారదత్తం చేయలేదు;
(c).       దీనికి భిన్నంగా వాదిస్తూ ఎలాంటి కమ్యూనికేషన్‌ను అందించినా సరే, దానిని దగాకోరు వర్తమానంగానూ, తప్పుదోవ పట్టించే సమాచారంగానూ భావించాలి.;
4.    ప్రజలకు, మరీ ముఖ్యంగా ఉద్యోగార్థులకు ఈ కింద పేర్కొన్న విధంగా సలహాలను ఇస్తున్నాం:
(i).        ఈ విధమైన నకిలీ నియామక ఆఫర్లకు ప్రతిస్పందించకండి;
(ii).       ఇలాంటి సంస్థలతో వ్యక్తిగత సమాచారాన్ని గానీ, లేదా ఆర్థిక వివరాలను గానీ పంచుకోకూడదు;
(iii).      ఇలాంటి ఆఫర్లను లెక్క లోకి తీసుకొని ఎలాంటి చెల్లింపులూ జరపకూడదు;
(iv).     ఇలాంటి ఘటనలను జాతీయ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్‌కు గానీ, లేదా స్థానిక నేర నియంత్రణ అధికారులకు గానీ తెలియజేయాలి.
5.        అమాయక పౌరులు నష్టపోకుండా, వారిలో చైతన్యాన్ని కలిగించడానికి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరీ ఈ ప్రకటనను జారీ చేస్తున్నాం.

 

***


(రిలీజ్ ఐడి: 2261234) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Tamil