వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లాజిస్టిక్స్, ఆవిష్కరణల్లో ప్రతిభ... లీప్స్-2025లోని 13 విభాగాల విజేతలను సత్కరించిన


కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా లాజిస్టిక్స్ పనితీరును అంచనా వేసే లీడ్స్-2025 నివేదిక విడుదల
ప్రపంచ వాణిజ్యంలో మూడింట రెండొంతులు విస్తరించిన భారత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు)
12 నెలల్లోగా అమల్లోకి మరో ఐదు ఒప్పందాలు

జీసీసీ, కెనడా, చిలీ, మెక్సికో సహా ఇతర కీలక ప్రాంతాలతో వాణిజ్య చర్చలను ముందుకు తీసుకెళ్తున్న భారత్
ప్రపంచ ప్రతికూలతల్లోనూ రికార్డు స్థాయిలో 863 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించిన భారత్

ప్రస్తుత సంవత్సరానికి 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యం

లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపుతో మౌలిక సదుపాయాల వృద్ధి, సజావుగా సరుకు రవాణా, ప్రపంచస్థాయి సామర్థ్యాలకు ఊతం: శ్రీ పీయూష్ గోయల్

प्रविष्टि तिथि: 13 MAY 2026 8:33PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన లీప్స్ పురస్కారాలు-2025 ప్రదానోత్సవంలీడ్స్ నివేదిక-2025 విడుదల కార్యక్రమంలో కీలక లాజిస్టిక్స్ఎంఎస్ఎంఈలుఅంకురసంస్థలుపలు రకాల సంస్థలుప్రత్యేక కేటగిరీలు సహా మొత్తం 13 విభాగాల విజేతలను కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ లీప్స్ పురస్కారాలతో సత్కరించారు.

లీప్స్ పురస్కారాలు-2025 వేడుకలో భాగంగా లీడ్స్-2025 నివేదికనూ శ్రీ గోయల్ విడుదల చేశారుసీనియర్ ప్రభుత్వ అధికారులుపరిశ్రమల సంఘాలులాజిస్టిక్స్ భాగస్వాములుఅంకురసంస్థలుఎంఎస్‌ఎంఈలువిద్యాసంస్థలుమూల్యాంకన కమిటీల సభ్యులులాజిస్టిక్స్ రంగ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

లీప్స్ పురస్కారాలు-2025 ప్రధానోత్సవంలీడ్స్ నివేదిక-2025 విడుదల కార్యక్రమాల సందర్భంగా శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ... గత మూడున్నరేళ్ల కాలంలో భారత్ తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏలద్వారా 38 అభివృద్ధి చెందినసంపన్న ఆర్థిక వ్యవస్థలతో ఒప్పందాలు చేసుకుందన్నారువాటిలో నాలుగు ఇప్పటికే అమలులో ఉన్నాయనీమరో ఐదు రాబోయే 12 నెలల్లో అమల్లోకి వస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారుజపాన్కొరియాఏషియాన్ దేశాలతో గతంలో కుదుర్చుకున్న ఎఫ్‌టీఏలతో పాటు... ఇప్పుడు ప్రపంచ వాణిజ్యఆర్థిక వ్యవస్థల్లో మూడింట రెండొంతులకు పైగా ఈ ఒప్పందాలు విస్తరించాయని కేంద్ర మంత్రి తెలిపారు.

చిలీమాల్దీవులు సహా పలు దేశాలుప్రాంతాలతో భారత్ చురుగ్గా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందనీఈ రెండు ఒప్పందాలు ఈ ఏడాది చివరి నాటికి ఖరారయ్యే అవకాశం ఉందనీ శ్రీ గోయల్ తెలిపారుఒమన్యూఏఈలతో పాటు ఖతార్కువైట్బహ్రెయిన్సౌదీ అరేబియా వంటి ఆరు గల్ఫ్ దేశాల కూటమి అయిన గల్ఫ్ సహకార మండలి (జీసీసీ)తోనూ చర్చలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారువాణిజ్య సంబంధాలుమార్కెట్ ప్రవేశ అనుమతులకు అవకాశాలను విస్తరించేందుకు గానూ కెనడాయూరేషియామెక్సికోఎస్ఏసీయూమెర్కోసూర్‌లతో భారత్ చురుగ్గా చర్చలు జరుపుతోందనీ కేంద్ర మంత్రి వివరించారు.

అధిక సుంకాలుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్ వివాదంపశ్చిమాసియా సంక్షోభం వంటి ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ... 2026 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 863 బిలియన్ డాలర్ల అత్యధిక ఎగుమతులను భారత్ సాధించిందని కేంద్ర మంత్రి శ్రీ గోయల్ తెలిపారుప్రపంచ వృద్ధి మందగించినప్పటికీ... భారత ఎగుమతులు వృద్ధి చెందుతూనే ఉన్నాయనీసేవల ఎగుమతులు సుమారు 8.5-9 శాతం వృద్ధిని నమోదు చేయగామొత్తం ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే దాదాపు శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారుపలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టిఏలఅమలుమెరుగైన మార్కెట్ ప్రవేశ అనుమతుల అవకాశాల మద్దతుతో... ప్రస్తుత సంవత్సరానికి ప్రభుత్వం ట్రిలియన్ డాలర్ల ఆకాంక్షాత్మక ఎగుమతి లక్ష్యాన్ని నిర్దేశించుకుందని ఆయన అన్నారు.

పశ్చిమాసియా సంక్షోభంమందగిస్తున్న ప్రపంచ వృద్ధిఇతర అంతర్జాతీయ అంతరాయాలనూ... తన సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికిరవాణా ఖర్చులను తగ్గించుకోవడానికిపోటీతత్వాన్ని బలోపేతం చేసుకోవడానికిఎగుమతి మార్కెట్లను విస్తరించుకోవడానికి అవకాశాలుగా భారత్ చూడాలని శ్రీ గోయల్ అన్నారులాజిస్టిక్స్సాంకేతిక పరిజ్ఞాన వినియోగంవ్యాపార ప్రక్రియల్లో నిరంతర మెరుగుదల వంటివి భారత్ తన ఎగుమతి సామర్థ్యాన్నివిదేశీ మారక ద్రవ్య ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి సహాయపడతాయని ఆయన స్పష్టం చేశారు.

భారత్‌ను ప్రపంచంతో పోటీపడేలా చేయడానికి లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడాన్ని తక్షణ జాతీయ కర్తవ్యంగా స్వీకరించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని శ్రీ పీయూష్ గోయల్ అన్నారుమౌలిక సదుపాయాల్లో పెట్టుబడులునిరాటంకమైన లాజిస్టిక్స్ వ్యవస్థలువేగవంతమైన రవాణామెరుగైన డెలివరీ యంత్రాంగాలు మన సామర్థ్యాలనుఉత్పాదకతనుపోటీతత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయని ఆయన తెలిపారులాజిస్టిక్స్ రంగ బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వాలుప్రైవేట్ కంపెనీలు రెండూ గణనీయ తోడ్పాటునందించాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారునిరంతర పెట్టుబడులుఆవిష్కరణలుఅంకురసంస్థల-ఆధారిత పరిష్కారాలుమెరుగైన సామర్థ్యాల ద్వారా భారత్ లాజిస్టిక్స్ ఖర్చులను మరింత తగ్గించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారుజీఎస్టీఅనేక చట్టాలను నేరరహితం చేయడంనిబంధనల సంబంధిత భారాన్ని తగ్గించడంవ్యాపార ప్రక్రియలను సరళీకరించడం వంటి కార్యక్రమాలు దేశంలో మరింత నిరాటంకమైన లాజిస్టిక్స్వ్యాపార నిర్వహణ వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతున్నాయనీ ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థఅధిక దేశీయ డిమాండ్యువ జనాభావిభిన్న ఉత్పత్తులు-సేవల లభ్యతపటిష్ఠమైన డిజిటల్ మౌలిక సదుపాయాలునైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి భారత్ బలాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారుభారత్ ఏటా 14 లక్షల మంది ఎస్‌టీఈఎమ్ గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోందనీగ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు (జీసీసీలకుకీలక గమ్యస్థానంగా మారిందన్నారు. ఇప్పటికే దాదాపు 1,700-1,800 జీసీసీలు పనిచేస్తున్నాయనీమరో 500 ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయని శ్రీ గోయల్ తెలిపారు.

ఆవిష్కరణలుపరిశోధన-అభివృద్ధిసమర్థమైన తయారీసేవల కోసం ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందని ఆయన అన్నారుబహుళజాతి కంపెనీలు తమ ప్రపంచవ్యాప్త కార్యకలాపాలను విస్తరించుకోవడానికి భారత్‌లోని ప్రతిభావంతుల లభ్యతనుతక్కువ నిర్వహణ ఖర్చులనుపటిష్ఠమైన డిజిటల్ వ్యవస్థను సద్వినియోగం చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.

వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ... జన్ విశ్వాస్ బిల్లు ద్వారా ప్రభుత్వం దాదాపు 1,000 చట్టాలను నేరరహితం చేసిందనీ, తద్వారా సుమారు 42,000 నిబంధనల సంబంధిత భారాలను తగ్గించిందని శ్రీ గోయల్ అన్నారువిధానాలను సరళీకరించడానికిడేటాబేస్‌లను ఏకీకృతం చేయడానికిమరిన్ని ప్రక్రియలను ఆన్‌లైన్‌కు మార్చడానికీ తదుపరి పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

అధికారిక సంప్రదింపులుచర్చల్లో భౌతిక సమావేశాలు సహా డిజిటల్ సాంకేతికతలనూ సమతుల్యం చేసుకోవాల్సిన ప్రాముఖ్యతను కేంద్ర మంత్రి స్పష్టం చేశారుసామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం వాణిజ్య చర్చలుపాలనా ప్రక్రియల్లో భారత్ వీడియో అనుసంధానండిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఎక్కువగా వినియోగించుకుంటోందని శ్రీ గోయల్ అన్నారు.

దేశ నిర్మాణానికిప్రపంచంతో పోటీపడేలా భారత్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి సంబంధిత వర్గాలన్నీ సమిష్టిగా కృషి చేయాలని కేంద్ర మంత్రి కోరారుసామర్థ్యాన్ని మెరుగుపరచడానికిఖర్చులను తగ్గించడానికిఉత్పాదకతను పెంచడానికి చేసే ప్రతి ప్రయత్నం దేశాన్ని మరింత బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో దోహదపడుతుందని ఆయన అన్నారు.

వాణిజ్యపరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహకఅంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ)... లాజిస్టిక్స్ వ్యవస్థ అంతటా శ్రేష్ఠతఆవిష్కరణలుఅత్యుత్తమ పద్ధతులను గుర్తించే ప్రధాన జాతీయ కార్యక్రమమైన లీప్స్-2025 (లాజిస్టిక్స్ ఎక్సలెన్స్అడ్వాన్స్‌మెంట్ అండ్ పెర్ఫార్మెన్స్ షీల్డ్పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించింది.

లాజిస్టిక్స్సరుకు రవాణా వ్యవస్థ నిర్వహణలో నాయకత్వంకార్యాచరణ నైపుణ్యంఆవిష్కరణలుసుస్థిరతను ప్రదర్శించిన సంస్థలను గుర్తించేలా ఈ కార్యక్రమ నాల్గో ఎడిషన్ లీప్స్-2025ను రూపొందించారుఈ కార్యక్రమం మల్టీమొడాలిటీసామర్థ్యాల పెంపుసాంకేతిక పరిజ్ఞాన వినియోగంసుస్థిర లాజిస్టిక్స్ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా పీఎం గతిశక్తిజాతీయ లాజిస్టిక్స్ విధాన దార్శనికతలకు అనుగుణంగా ఉంది.

ఈ సందర్భంగా డీపీఐఐటీ కార్యదర్శి శ్రీ అమర్‌దీప్ సింగ్ భాటియా మాట్లాడుతూ... ప్రపంచంతో పోటీపడేలా భారత్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలోలాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడంలో సమర్థమైనపటిష్ఠమైన లాజిస్టిక్స్ వ్యవస్థ ప్రాముఖ్యతను స్పష్టం చేశారుఆవిష్కరణడిజిటలైజేషన్సుస్థిరతకార్యాచరణ నైపుణ్యం ద్వారా లాజిస్టిక్స్ రంగంలో పరివర్తనను నడిపిస్తున్న సంస్థలను గుర్తించడానికి లీప్స్ (ఎల్ఈఏపీఎస్ఒక ముఖ్యమైన వేదికను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

లీప్స్-2025 మూల్యాంకన ప్రక్రియను ఒక క్రమబద్ధమైనపారదర్శక విధానం ద్వారా నిర్వహించారుఎమ్‌హెచ్ఏ పురస్కార పోర్టల్ (https://awards.gov.in/ద్వారా 2025 అక్టోబర్ 13 నుంచి డిసెంబర్ 26 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు.

డీపీఐఐటీలాజిస్టిక్స్ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన 2026 ఫిబ్రవరి 11, 12 తేదీల్లో లీప్స్-2025 కోసం నిపుణుల కమిటీ సమావేశం జరిగిందిఅనంతరం డీపీఐఐటీ కార్యదర్శి అధ్యక్షతన 2026 మార్చి 17న పురస్కార కమిటీ సమావేశం జరిగింది.

కీలక లాజిస్టిక్స్ఎంఎస్ఎంఈలుసంస్థలుఅంకురసంస్థలుప్రత్యేక కేటగిరీలు సహా మొత్తం 13 కేటగిరీల్లో అందిన దరఖాస్తులను మూల్యాంకనం చేసి నిపుణుల కమిటీ ముందు ప్రవేశపెట్టారుషార్ట్‌లిస్ట్ చేసిన దరఖాస్తుదారులను పురస్కార కమిటీ మరింతగా మూల్యాంకనం చేసింది.

సాంకేతిక ఆవిష్కరణపర్యావరణ-సామాజిక-పరిపాలన (ఈఎస్‌జీపద్ధతులుబహుళ రవాణా విధానాలుజాతీయ లాజిస్టిక్స్ విధానానికి అనుగుణంగా ఉండటంకార్యాచరణ సామర్థ్యంభద్రతపరిశోధన-అభివృద్ధిలింగ వైవిధ్యంఉపాధి కల్పననైపుణ్యాభివృద్ధికి సహకారం వంటి పారామితుల ఆధారంగా దరఖాస్తులను మదింపు చేశారు.

'లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ (లీడ్స్)-2025నివేదికనూ శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు విడుదల చేశారుఇది రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో లాజిస్టిక్స్ పనితీరుపై డీపీఐఐటీ చేపట్టిన ఒక ప్రధాన మదింపు నివేదికఇది దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఒక కీలకమైన ప్రామాణికసంస్కరణ సాధనంగా ఉపయోగపడుతుంది.

ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్జాతీయ లాజిస్టిక్స్ పాలసీ కింద సమీకృతడేటా ఆధారిత లాజిస్టిక్స్ సంస్కరణలపై ప్రభుత్వం కొనసాగిస్తున్న దృష్టిని లీడ్స్-2025 ప్రతిబింబిస్తుందిరాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు తమ పనితీరును అంచనా వేసుకోవడానికిలోపాలను గుర్తించడానికిలక్షిత లాజిస్టిక్స్ చర్యలకు ప్రాధాన్యమివ్వడానికి వీలు కల్పించడం ద్వారా ఈ విధాన ప్రణాళిక సహకారపోటీ సమాఖ్యవాదానికి మద్దతునిస్తుంది.

లీడ్స్ ఏడో ఎడిషన్ అయిన లీడ్స్-2025... గత సంవత్సరాలతో పోలిస్తే మరింత కఠినమైనమెరుగైన మూల్యాంకన పద్ధతిని అనుసరిస్తూ... భారత లాజిస్టిక్స్ రంగ పనితీరు అంచనాలో కీలక పరిణామాన్ని సూచిస్తుందిలీడ్స్-2025 అంచనాలు పటిష్ఠతనుఅమలు పర్యవేక్షణను బలోపేతం చేయడం కోసం కొలవగలఆధారాల ఆధారితమైన సూచికలకు అధిక ప్రాధాన్యమిస్తుంది. ఇందులో లక్ష్యాత్మక సూచికలకు దాదాపు 59 శాతం వెయిటేజీని కేటాయించారు.

దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ వ్యవస్థల పరిణామ పురోగతిని మరింత మెరుగ్గా ప్రతిబింబించేందుకు లీడ్స్-2025 విధాన ప్రణాళిక తన మునుపటి మూడు-స్థాయిల వర్గీకరణ నుంచి మరింత సమగ్రమైన నాలుగు-స్థాయిల విధాన ప్రణాళికకు మారిందిఈ సవరించిన విధాన ప్రణాళిక... లాజిస్టిక్స్ పనితీరును మరింత సూక్ష్మంగా అంచనా వేయడానికి వీలు కల్పిస్తుందిలాజిస్టిక్స్ వ్యవస్థ అభివృద్ధిలోని వివిధ దశల్లో లక్ష్యాత్మక మెరుగుదల మార్గాలకు మద్దతునిస్తుంది.

కొత్త నాలుగు-స్థాయిల వర్గీకరణ

కొత్త నాలుగు-స్థాయిల వర్గీకరణ కింది విధంగా ఉంది:

  • ఆదర్శంగా నిలిచేవివిధానంమౌలిక సదుపాయాలుసేవల పంపిణీనియంత్రణ అంశాల్లో నిరంతర శ్రేష్ఠతను ప్రదర్శిస్తూ... అత్యుత్తమ పనితీరు కనబరిచే రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలను ఆదర్శంగా నిలిచేవిగా పరగిణిస్తారు.

  • తీరప్రాంత రాష్ట్రాలు: తమిళనాడు

  • భూపరివేష్టిత రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్

  • ఈశాన్య రాష్ట్రాలు: మిజోరం

  • కేంద్రపాలిత ప్రాంతాలు: ఢిల్లీ

• అత్యుత్తమ పనితీరు కనబరిచేవి: అత్యుత్తమ పనితీరు సూచికల్లో బలమైనస్థిరమైన ఫలితాలను ప్రదర్శించే రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు అత్యుత్తమ పనితీరు కనబరిచేవిగా ఉంటాయి.

తీరప్రాంత రాష్ట్రాలు: గుజరాత్కేరళమహారాష్ట్ర

భూపరివేష్టిత రాష్ట్రాలు: హర్యానాతెలంగాణఛత్తీస్‌గఢ్బీహార్

ఈశాన్య రాష్ట్రాలు: త్రిపురమేఘాలయ

కేంద్రపాలిత ప్రాంతాలు: జమ్మూ కాశ్మీర్పుదుచ్చేరి

• వృద్ధిని వేగవంతం చేసేవి: ఇటీవలి సంవత్సరాల్లో గణనీయ అభివృద్ధి వేగాన్నిస్పష్టమైన సంస్కరణల ధోరణిని ప్రదర్శించిన రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలను వృద్ధిని వేగవంతం చేసేవిగా సూచిస్తారు.

    • తీరప్రాంత రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్ఒడిశాగోవాకర్ణాటక

    • భూపరివేష్టిత రాష్ట్రాలు: పంజాబ్జార్ఖండ్మధ్యప్రదేశ్ఉత్తరాఖండ్హిమాచల్ ప్రదేశ్

    • ఈశాన్య రాష్ట్రాలు: నాగాలాండ్అరుణాచల్ ప్రదేశ్మణిపూర్అస్సాం

    • కేంద్రపాలిత ప్రాంతాలు: దాద్రా నగర్ హవేలీడామన్ డయ్యూచండీగఢ్లదాఖ్లక్షద్వీప్

  • వృద్ధిని కోరుకునేవి: లాజిస్టిక్స్ వ్యవస్థ అభివృద్ధిసంస్థాగత బలోపేతం ప్రాథమిక దశలో ఉన్న రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలను వృద్ధిని కోరుకునేవిగా సూచిస్తారు.

• తీరప్రాంత రాష్ట్రాలు: పశ్చిమ బెంగాల్

• భూపరివేష్టిత రాష్ట్రాలు: రాజస్థాన్

• ఈశాన్య రాష్ట్రాలు: సిక్కిం

• కేంద్రపాలిత ప్రాంతాలు: అండమాన్-నికోబార్ దీవులు

లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడంభారత సామర్థ్యాల బలోపేతం లక్ష్యంగా గల సంస్కరణలకు మద్దతుగా రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా ఆధారాల ఆధారిత లాజిస్టిక్స్ ప్రణాళికపనితీరు పర్యవేక్షణ బలోపేతం దిశగా లీడ్స్ ఒక కీలక ముందడుగును సూచిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2260920) आगंतुक पटल : 56
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil