కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజిటల్ ప్లాట్ఫామ్ ఏపిటీ 2.0 పై సమీక్ష నిర్వహించిన కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్


సాంప్రదాయ పద్దతుల నుంచి లాజిస్టిక్స్ హబ్ వరకు: ఇండియా పోస్ట్ ఏపిటీ 2.0 తో రియల్ టైమ్, ఏఐ ఆధారిత పాలనలోకి ప్రవేశిస్తుంది

కార్పొరేట్ తరహా సామర్థ్యం దిశగా ఇండియా పోస్ట్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది

నాడు పోస్టు చేయడమైనది: 12 MAY 2026 2:07PM by PIB Vijayawada

ఇండియా పోస్ట్  తదుపరి తరం డిజిటల్ ప్లాట్ఫామ్ ఏపిటీ 2.0 పై కేంద్ర సమాచార, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని సమగ్ర సమీక్షా నిర్వహించారు. ఇండియా పోస్ట్ను ఆధునిక లాజిస్టిక్స్, సేవల కేంద్రంగా మార్చడంలో ఈ ప్లాట్ ఫామ్ పోషించనున్న  ప్రాముఖ్యతను ఆయన తెలియజేశారు.

ఏపిటీ 2.0 బ్రాంచ్ కార్యాలయాలకు రియల్-టైమ్ ఇంటెలిజెన్స్ను ఎలా అందిస్తుందో, తద్వారా అవి స్థానిక డిమాండ్ను విశ్లేషించేందుకు, పనితీరును పర్యవేక్షించేందుకు, క్షేత్ర స్థాయిలో వేగవంతమైన, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేందుకు ఎలా వీలు కల్పిస్తుందో మంత్రి వివరించారు. ఏఐతో అనుసంధానించడం ద్వారా భారీ పరిమాణంలోని కార్యాచరణ సమాచారాన్ని విశ్లేషించేందుకు, ఫలితాల అంచనాకు, సాధారణ విధులు స్వయంచాలకంగా జరిగేందుకు, పోస్టల్ నెట్వర్క్ అంతటా మెరుగైన సేవలను అందించేందుకు సహాయపడుతోందని తెలిపారు.

ఈ సామర్థ్యాలు ఇండియా పోస్ట్కు వేగవంతమైన సేవలను అందించడం, మానవ ప్రమేయాన్ని తగ్గించడం, మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, వినియోగదారుల సంతృప్తిని పెంచడం సహా..  మరింత విశ్వసనీయ, సమర్థవంతమైన కార్యకలాపాలతో స్పష్టమైన, కొలవదగిన ప్రయోజనాలను అందిస్తున్నాయని మంత్రి డాక్టర్ పెమ్మసాని పేర్కొన్నారు.

వెనుకబడిన గ్రామీణ, సెమీ అర్బన్ మార్కెట్లలో వినియోగదారుల్ని మెరుగ్గా చేరుకోవడానికి, బ్రాంచ్ ఆఫీస్ స్థాయిలో సేవల వినియోగాన్ని పెంచడానికి, డేటా ఆధారిత సమాచారంతో సకాలంలో కొత్త ఆదాయ అవకాశాలను సృష్టించడానికి ఈ ప్లాట్ఫారమ్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలియజేశారుబ్రాంచ్ స్థాయి డేటాను కార్యాచరణకు అవసరమైన సమాచారంగా మార్చడం ద్వారా, మారుతున్న లాజిస్టిక్స్ రంగంలో ఇండియా పోస్ట్ పోటీతత్వాన్ని ఏపిటీ 2.0 బలోపేతం చేస్తోందని వివరించారు.

డిజిటల్గా సాధికారత పొందిన, సేవా ఆధారిత సంస్థగా ఎదగాలనే లక్ష్యానికి అనుగుణంగా, ఇండియా పోస్ట్ దేశీయ లాజిస్టిక్స్ వెన్నెముకగా రూపాంతరం చెందడానికి ఈ మార్పు అత్యంత కీలకమని కేంద్ర సహాయ మంత్రి అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా, భారత ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి దీని అమలును నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ క్రియాశీలక పాలనా విధానానికి నిదర్శనమని, దీనివల్ల సంస్థలో స్పష్టమైన మార్పు వస్తోందని తెలిపారు. తద్వారా ఇండియా పోస్ట్ ఒక సంప్రదాయ వ్యవస్థ నుంచి అత్యంత వేగవంతమైన, కార్పొరేట్ తరహా సాంకేతికత ఆధారిత సంస్థగా రూపాంతరం చెందుతోందని వివరించారు.

ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ప్రోత్సాహం. డేటా సమగ్రతను కాపాడడంతో పాటు సైబర్ భద్రతను పటిష్టపరచడం, సురక్షితమైన వ్యవస్థను నిర్ధారిస్తుందని డాక్టర్ పెమ్మసాని అన్నారు. తద్వారా విశ్వసనీయమైన, పటిష్టమైన, భవిష్యత్త్ అవసరాలకు సిద్ధంగా ఉండే డిజిటల్ ప్రజా సేవల పంపిణీకి వీలు కల్పిస్తుందని చెప్పారు. భారతదేశంలో విస్తరిస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఇది నమ్మకాన్ని మరింత పెంచుతుందని, ఇక్కడ విస్తృతితో పాటు భద్రత, విశ్వసనీయత కూడా సమానంగా ఉంటాయని పేర్కొన్నారు.

కేంద్ర సమాచార శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా నాయకత్వంలో, ఇండియా పోస్ట్ 'వికసిత భారత్' దార్శనికతకు అనుగుణంగా, చిట్టచివరి ప్రాంతం వరకు తన సేవలను అందిచేందుకు, జాతీయ అనుసంధానాన్ని బలోపేతం చేసేందుకు సాంకేతికతను వినియోగించుకుంటూ స్థిరమైన పరివర్తనను కొనసాగిస్తోంది.

****


(రిలీజ్ ఐడి: 2260338) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Telugu