ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయ విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి


మన నాగరిక ధైర్యాన్ని, అచంచలమైన భక్తిని సోమనాథ్‌ ఆలయం ప్రతిబింబిస్తోందన్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 11 MAY 2026 5:04PM by PIB Hyderabad

సోమనాథ్ అమృత్ మహోత్సవానికి సంబంధించిన పలు విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రజలతో పంచుకున్నారు.

పవిత్రమైన సోమనాథ్ ఆలయపు ఎత్తయిన శిఖరంపై సగర్వంగా ఎగురుతున్న ధర్మధ్వజాన్ని చూస్తుంటే.. దేశ అచంచల విజయానికి సంకేతంగానుకోట్లాది మంది భారతీయుల సామూహిక చైతన్యానికి దివ్య ప్రకటనగాను కనిపిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారుసోమనాథ్ శిఖరాగ్రాన ఉన్న ఆ కాషాయ పతాకం అచంచల భక్తికి సజీవ విజయగాథ అనిఅది శాశ్వతంగా భారత కీర్తిని గానం చేస్తూ ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు.

ఆలయ చరిత్రను గుర్తుచేస్తూవెయ్యేళ్ల కిందట సోమనాథ్‌ ఆలయంపై తొలి దాడి జరిగిందని ప్రధానమంత్రి గుర్తు చేశారుఈ నేల సంస్కృతిని నాశనం చేయగలమని భావించిన దురాక్రమణదారులు సోమనాథ్‌పై అనేక దాడులకు పాల్పడ్డారని ప్రస్తావించారుభరతమాత అత్యంత ధైర్యవంతులైన బిడ్డల కృషి వల్లే సోమనాథ్ ఆలయం పదేపదే పునర్నిర్మాణం అవుతూనే వచ్చిందని ఆయన కొనియాడారుసరిగ్గా 75 ఏళ్ల క్రితం ఇదే రోజున అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో... పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయని ప్రధాని శ్రీ మోదీ గుర్తు చేశారుఆక్రమణదారులు చరిత్ర గర్భంలో కలిసిపోయారనికానీ భారత్ ఆత్మ మాత్రం అజరామరమని ఆ రోజే ప్రపంచానికి చాటిచెప్పినట్లు తెలిపారునాగరికత ధైర్యానికివిడదీయలేని భక్తికి నిదర్శనంగా సోమనాథ్ నేడు సగర్వంగా నిలిచి ఉందని పేర్కొంటూ.. మహాదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ఆయన ప్రార్థించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘పవిత్రమైన సోమనాథ ఆలయపు ఎత్తయిన శిఖరంపై సగర్వంగా రెపరెపలాడుతున్న పవిత్ర ధర్మధ్వజం దేశ అచంచల విజయానికి ప్రతీకఇది కోట్లాది మంది భారతీయుల సమష్టి చైతన్యంగాదైవిక ప్రకటనగా కూడా కనిపిస్తోందిసోమనాథ్ శిఖరాగ్రాన ఉన్న ఈ కాషాయ పతాకం మన విడదీయలేని భక్తికి సజీవ విజయగాథఇది పత్రి భారతీయుడికి నిరంతరం స్ఫూర్తినిస్తూ.. దేశ కీర్తిని శాశ్వతంగా ఆలపిస్తూనే ఉంటుంది’’

‘‘వెయ్యేళ్ల క్రితం సోమనాథ్‌ ఆలయంపై తొలి దాడి జరిగిందిమన నేల స్వరూపాన్ని నాశనం చేయగలమని భావించిన వారు అప్పట్లో పదేపదే దాడులకు తెగబడ్డారుకానీ వారి నమ్మకం తప్పయిందిభరతమాత అత్యంత పరాక్రమవంతులైన బిడ్డల పుణ్యమా అని సోమనాథ్ పదేపదే పునర్నిర్మాణం అవుతూనే వచ్చింది.

సరిగ్గా 75 ఏళ్ల క్రితం ఇదే రోజున అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో సోమనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయిదాడులు చేసిన వారు చరిత్ర గర్భంలో కలిసిపోయారుకానీ భారత్‌ ఆత్మ మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంది.

నేడు సోమనాథ్ మన నాగరికత ధైర్యానికిమన అచంచలమైన భక్తికి నిదర్శనంగా సమున్నతంగాశాశ్వతంగా నిలిచి ఉందిఆ మహాదేవుని ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను’’

‘‘నేడు తీసిన సోమనాథ్ దేవాలయ దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు’’

***


(రిలీజ్ ఐడి: 2260159) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam