ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వడోదరకు వెళ్లే మార్గంలో తీసిన సోమనాథ్ ఆలయం ఫోటోను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 11 MAY 2026 5:14PM by PIB Hyderabad

సోమనాథ్ నుంచి వడోదరకు వెళ్లే మార్గంలో తీసిన సోమనాథ్ ఆలయం ఫోటోను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రజలతో పంచుకున్నారు.

భక్తిచరిత్రనాగరిక స్ఫూర్తికి ప్రభాస్ పటాన్ తీరాన కొలువై ఉన్న సోమనాథ్ ఆలయం ప్రకాశవంతమైన ప్రతీకగా సగర్వంగా నిలిచి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారుఅనేక దాడులనుదండయాత్రలనుశతాబ్దాల పాటు ఎదురైన క్లిష్ట పరిస్థితులను తట్టుకుని ఈ ఆలయం అజేయంగా నిలిచిందని శ్రీ మోదీ అన్నారు.

సోమనాథ్ క్షేత్రం ప్రతి భారతీయునికి బలాన్ని, ధైర్యాన్నికొత్త ఆశను ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘సోమనాథ్ నుంచి వడోదర వెళ్లే మార్గంలో ఈ ఫోటో తీశాను.

ప్రభాస్ పటాన్ తీరాన ఉన్న సోమనాథ్ ఆలయం భక్తికిచరిత్రకుమన నాగరికతా స్ఫూర్తికి ప్రకాశవంతమైన ప్రతీకగా సగర్వంగా నిలిచి ఉందిఅనేక దాడులువిదేశీ ఆక్రమణలుశతాబ్దాల తరబడి సవాళ్లను తట్టుకుని ఈ క్షేత్రం అజేయంగా నిలిచిందిఇది శాశ్వతమైనదిసోమనాథ్‌ ప్రతి భారతీయుడికి బలాన్నిధైర్యాన్నికొత్త ఆశను ప్రసాదిస్తుంది.

హర హర మహాదేవ్’’


(रिलीज़ आईडी: 2260158) आगंतुक पटल : 56
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Punjabi , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam