ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని ప్రభాస్ పటన్‌ వద్ద జరిగిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్‌లో ప్రధాని ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 11 MAY 2026 3:26PM by PIB Hyderabad

జై సోమనాథ్!

జై సోమనాథ్!

హర హర మహాదేవ్!

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ గారుఉప ముఖ్యమంత్రి భాయ్ హర్ష్ సంఘ్వి గారు.. గుజరాత్ ప్రభుత్వ మంత్రులుపార్లమెంటు సభ్యులుశాసనసభ్యులువిచ్చేసిన విశిష్ట అతిథులూ... ఇక్కడికి విచ్చేసిన వారందరూ…

నేడు ప్రభాస్ పటన్ పుణ్యభూమి దివ్యమైన తేజస్సుతో విరాజిల్లుతోందిసాక్షాత్తూ ఆ మహాదేవుని దర్శనంఈ నయనానందకరమైన సౌందర్యంభూమ్యాకాశాల నుంచి కురుస్తున్న పుష్పాల జల్లురెపరెపలాడుతున్న కాషాయ జెండాల కాంతి.. కళలుసంగీతంనృత్యం... అద్భుత ప్రదర్శనలు.. వేద మంత్రోచ్చారణలుగర్భాలయంలో నిరంతరాయంగా మారుమోగుతున్న శివ పంచాక్షరీ మంత్రం.. వీటితో పాటు సముద్ర కెరటాల గంభీర ఘోష.. ఇవన్నీ చూస్తుంటే సృష్టి అంతా ఏకకంఠంతో ఇలా పలుకుతున్నట్లు అనిపిస్తోందిజై సోమనాథ్ జై జై సోమనాథ్!

మిత్రులారా

ఎవరి సంకల్పం వల్ల కాలమే ఆవిర్భవిస్తుందోఎవరు నిత్యుడోఎవరు సాక్షాత్తూ కాలస్వరూపుడో... ఆ మహాదేవుని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు మనం ఉత్సవం నిర్వహించుకుంటున్నాంఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారోచివరికి ఎవరిలో లీనమవుతుందో ఆ సర్వేశ్వరుని గురించి ఇలా అంటారు:

యతో జాయతే పాల్యతే యేన విశ్వంతమీశం భజే లీయతే యత్ర విశ్వం”

నేడు మనం ఆ మహాదేవుని పవిత్ర నివాస పునర్నిర్మాణ వేడుకలను చేసుకుంటున్నాంఎవరైతే హాలాహలాన్ని సేవించి 'నీలకంఠుడి'గా మారారో ఆ స్వామి చరణాల చెంతనే నేడు ఈ 'సోమనాథ్ అమృత్ మహోత్సవంఘనంగా జరుగుతోందిఇదంతా ఆ సదాశివుని దివ్య లీలావిలాసం మాత్రమే.

మిత్రులారా

సోమనాథ్ పరమ భక్తుడిగా నేను ఇక్కడికి లెక్కలేనన్ని సార్లు వచ్చాను.. ఎన్నోసార్లు ఆయన ముందు శిరస్సు వంచానుకానీ ఈ రోజు ఇక్కడికి వస్తున్నప్పుడు ఈ 'కాల ప్రయాణంనాకు ఒక విశిష్టమైనఆనందదాయకమైన అనుభూతిని కలిగించిందికేవలం కొన్ని నెలల క్రితమే మనం 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్'ను నిర్వహించినపుడు నేను ఇక్కడికి వచ్చానుసోమనాథ్ ఆలయం మొదటిసారి ధ్వంసమైన వెయ్యి ఏళ్ల తర్వాత కూడా ఈ క్షేత్రం అమరత్వంఆత్మగౌరవాన్ని మనం చాటి చెప్పాంఈ రోజు ఈ ఆధునిక రూపంలోని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాంమనం కేవలం రెండు ఉత్సవాల్లో పాల్గొనడం లేదుఆ పరమశివుడు మనకు వెయ్యేళ్ల అమరత్వ ప్రయాణాన్ని అనుభూతి చెందే అదృష్టాన్ని ప్రసాదించాడు.

మిత్రులారా

డెబ్బై ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరగటం ఒక సామాన్యమైన ఘట్టం కాదు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. 1951లో జరిగిన ఈ సోమనాథ్ ప్రతిష్ఠాపన భారతదేశ స్వతంత్ర స్ఫూర్తిని మేల్కొల్పిందిస్వాతంత్ర్యం వచ్చినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 500 కంటే ఎక్కువ సంస్థానాలను ఏకం చేసి ఆధునిక భారతావనికి రూపునిచ్చారుఅదే సమయంలో సోమనాథ్ పునర్నిర్మాణం ద్వారా ఆయన ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చారు.. భారతదేశానికి కేవలం స్వేచ్ఛ మాత్రమే రాలేదు... భారత్ ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించే దిశగా కూడా అడుగులు వేసిందని ఆయన చెప్పారు

మిత్రులారా

అందుకే ఇప్పుడు నేను కేవలం 75 ఏళ్ల కాలాన్ని మాత్రమే చూడటం లేదుఇక్కడ నేను విధ్వంసం మధ్య కూడా సృష్టికి ఉన్న సంకల్పాన్ని చూస్తున్నానుదీనికి సోమనాథ్ క్షేత్రమే నిదర్శనంఇక్కడ నేను అసత్యంపై సత్యం సాధించిన విజయాన్ని చూస్తున్నానుదీనిని ప్రభాస్ పటన్ పదేపదే చూసిందిఇక్కడ వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చైతన్యాన్ని నేను చూస్తున్నానుఇది ప్రపంచానికి సర్వ మానవాళి సంక్షేమాన్ని బోధించిందిశతాబ్దాల పాటు దుష్ట శక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చెరిపివేయలేనిఓడించలేని భారతదేశ అమర స్ఫూర్తిని నేను ఇక్కడ చూస్తున్నానుఈ 'సోమనాథ్ అమృత్ మహోత్సవంకేవలం గతానికి సంబంధించిన వేడుక మాత్రమే కాదుఇది రాబోయే వెయ్యేళ్ల భారతదేశానికి ఒక గొప్ప స్ఫూర్తి ఉత్సవం అని నేను భావిస్తున్నానుఈ సందర్భంగా దేశ ప్రజలందరికీసోమనాథునికి ఉన్న కోట్లమంది భక్తులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా

మరొక కారణం వల్ల కూడా ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనదిసరిగ్గా ఇదే రోజున 1998 మే 11న  భారతదేశం పోఖ్రాన్‌లో అణు పరీక్షలు నిర్వహించిందిమే 11వ తేదీన దేశం మొదటి మూడు అణు పరీక్షలను చేపట్టిందిమన శాస్త్రవేత్తలు భారతదేశ శక్తిసామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారుఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించిందిప్రపంచ దేశాలు ఆగ్రహంతో ప్రతిస్పందించాయిభారత్ అణు పరీక్షలు నిర్వహించే ధైర్యం ఎలా చేస్తుందని ప్రశ్నించాయిప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలన్నీ భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకు వచ్చాయి.. రకరకాల ఆంక్షలు విధించాయిమన ఆర్థిక స్థిరత్వపు మార్గాలన్నింటినీ అడ్డుకున్నాయిఅటువంటి తీవ్రమైన ఒత్తిడికి ఎవరైనా సరే వణికిపోయే వారుకానీ మనం వేరే మట్టితో తయారయ్యాంమే 11 తర్వాత ప్రపంచమంతా మనకు వ్యతిరేకంగా మారిందిమే 11న శాస్త్రవేత్తలు తమ పనిని పూర్తి చేశారుకానీ మే 13న మరో రెండు అణు పరీక్షలు నిర్వహించి భారత రాజకీయ సంకల్పం ఎంత దృఢమైనదో ప్రపంచానికి నిరూపించాంప్రపంచ దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ అటల్ గారి నాయకత్వంలోని భాజపా ప్రభుత్వం మనకు 'దేశమే ప్రథమంఅని నిరూపించిందిప్రపంచంలోని ఏ శక్తి కూడా భారతదేశాన్ని లొంగదీసుకోలేదని లేదా తలవంచేలా చేయలేదని మేం చాటిచెప్పాం.

మిత్రులారా

పోఖ్రాన్ అణు పరీక్షలను 'ఆపరేషన్ శక్తిఅని పేరుతో నిర్వహించాంఎందుకంటే శివుడితో పాటు శక్తిని ఆరాధించడం మన సంప్రదాయంలో ఎప్పుడూ ఒక భాగంస్వయంగా ఆ అర్ధనారీశ్వరుడు కూడా శక్తితో కలిసినప్పుడే సంపూర్ణమవుతాడుభారతదేశపు చంద్రయాన్ మిషన్ విజయవంతమైనప్పుడు.. చంద్రునిపై రోవర్ దిగిన ప్రదేశానికి మనం 'శివ శక్తి పాయింట్అని పేరు పెట్టిన విషయం మీకు గుర్తుండి ఉంటుందిమన విశ్వాసంలో చంద్రుడు శివుడితో అనుసంధానమై ఉంటేశివుడు శక్తితో ముడిపడి ఉన్నాడుఈ జ్యోతిర్లింగాన్ని స్వయంగా 'సోమనాథ్అని పిలవడం ఎంత అద్భుతమైనదో కదా!. సోమ అంటే చంద్రుడు.. ఆ చంద్రునితో ముడిపడి ఉన్నవాడు సోమనాథుడు.

మిత్రులారా

శివ-శక్తి ఆరాధనలోని మన తత్త్వం ఇప్పుడు దేశ శాస్త్ర సాంకేతిక పురోగతికి కూడా ఒక గొప్ప స్ఫూర్తిగా మారిందిఈ పవిత్రమైన సందర్భంలో సోమనాథుని పాద పద్మాల సాక్షిగా 'ఆపరేషన్ శక్తివార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా

నేను గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను.. తన పేరులోనే 'సోమఅంటే అమృతాన్నిఅమరత్వాన్ని ధరించిన క్షేత్రం ఎప్పుడైనా ఎలా అంతమవుతుందిచరిత్ర మొత్తంగా ఈ ఆలయం ఎన్నో దాడులను ఎదుర్కొందిమహమ్మద్ గజనీఅలావుద్దీన్ ఖిల్జీ వంటి దురాక్రమణదారులు సోమనాథుని వైభవాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నించారువారు సోమనాథుడిని కేవలం ఒక భౌతిక కట్టడంగా మాత్రమే చూసి పదేపదే దాడులు చేశారుప్రతిసారీ ఆలయం ధ్వంసం అయింది కానీ ప్రతిసారీ అది తిరిగి సగర్వంగా నిలబడిందిదీనిని నాశనం చేయాలని చూసిన వారు మన నాగరికత సైద్ధాంతిక బలాన్ని అర్థం చేసుకోలేకపోయారుమనం భౌతిక దేహాన్ని నశించిపోయేదిగా భావిస్తాం కానీ లోపల ఉన్న ఆత్మ అమరమని మనకు తెలుసుఆ శివుడు సాక్షాత్తూ విశ్వానికే ఆత్మఅందుకే వివిధ యుగాలలో వేర్వేరు వ్యక్తుల సంకల్పంలో శివుడు ఆవిర్భవించాడుభోజరాజు మొదటి భీమ్ దేవ్కుమారపాలమొదటి మహిపాలరావు ఖంగార్ వంటి రాజులు సోమనాథ్ ఆలయాన్ని పదేపదే పునర్నిర్మించారులకులీశసోమ శర్మ వంటి గొప్ప చింతనాపరులు ప్రభాస్ పటన్ వారసత్వాన్ని కాపాడటమే కాకుండా దీనిని శైవ తత్త్వానికిఆధ్యాత్మిక సాధనకు గొప్ప కేంద్రంగా తీర్చిదిద్దారుభావ బృహస్పతిపాశుపత ఆచార్యులుఅనేకమంది పండితులు ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక సంప్రదాయాలను సజీవంగా ఉంచారువిశాల్ దేవ్త్రిపురాంతక వంటి వ్యక్తులు ఈ ప్రాంత మేధో చైతన్యాన్ని రక్షించారు.

మిత్రులారా,

వీర హమీర్ జీ గోహిల్వీర వేగడ్ జీ భిల్పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్బరోడా గైక్వాడ్లు జామ్ సాహెబ్ మహారాజా దిగ్విజయ్ సింగ్ జీ  వంటి ఎందరో మహానుభావులు సోమనాథుని సేవలో సర్వస్వాన్ని అర్పించారునేడు నేను సర్దార్ వల్లభాయ్ పటేల్డాక్టర్ రాజేంద్ర ప్రసాద్శ్రీ కె.ఎంమున్షీలతో పాటు తెలిసినతెలియని పుణ్యాత్ములందరికీ భక్తితో ప్రణమిల్లుతున్నానువారి స్మృతి మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ అభివృద్ధి చేయడమే కాకుండాఆ బాధ్యతను రాబోయే తరాలకు అందించడానికి మనకు స్ఫూర్తినిస్తుంది.

మిత్రులారా

వేల ఏళ్లుగా మన సాంస్కృతిక ప్రదేశాలే భారతీయతకు గుర్తింపుగా నిలిచాయిమనకు ఎంతో గొప్ప వారసత్వం లభించినప్పటికీదశాబ్దాల తరబడి దాని ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమయ్యాంప్రపంచవ్యాప్తంగా విదేశీ దురాక్రమణదారులు జాతీయ అస్తిత్వంతో ముడిపడి ఉన్న ప్రదేశాలను ధ్వంసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయికానీ ఆయా దేశాల ప్రజలకు అవకాశం లభించినప్పుడువారు ఏకమై ఆ చిహ్నాలను పునరుద్ధరించి మళ్ళీ గౌరవించుకున్నారుమన దేశంలో మాత్రం జాతీయ గౌరవానికి సంబంధించిన అంశాలు కూడా రాజకీయాలకు వేదికలుగా మారాయిదీనికి సోమనాథ్ అతిపెద్ద ఉదాహరణస్వాతంత్ర్యం వచ్చిన వెంటనే చేపట్టాల్సిన మొదటి బాధ్యతల్లో సోమనాథ దేవాలయ పునరుద్ధరణ ఒకటిఅందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దీని కోసం ఎంతో దృఢ నిశ్చయంతో కృషి చేశారుకానీ నెహ్రూ నుంచి వారు ఎంతటి వ్యతిరేకతను ఎదుర్కొన్నారో మనందరికీ తెలుసునేను ఆ వివరాల్లోకి వెళ్ళను గానీఎన్ని అడ్డంకులు ఎదురైనా సర్దార్ పటేల్ తన పట్టుదలను వీడలేదుసోమనాథ ఆలయం పునర్నిర్మితమైంది.  దేశం శతాబ్దాల అవమానాన్ని చెరిపివేసింది.

మిత్రులారా,

దురదృష్టవశాత్తునేటికీ దేశంలో జాతీయ గౌరవం కంటే బుజ్జగింపు రాజకీయాలే ముఖ్యమని భావించే శక్తులు ఉన్నాయిరామమందిర నిర్మాణ సమయంలో కూడా దీనిని చూశాం.  అప్పుడు కూడా వ్యతిరేకత ఎదురైందిఇలాంటి మనస్తత్వాల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలిమనం ఇటువంటి సంకుచిత రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాలిఅభివృద్ధినివారసత్వాన్ని రెండింటినీ కలిపి తీసుకుంటూ మనం పురోగమించాలి.

మిత్రులారా,

ఇటీవలి కాలంలో సోమనాథ్ ట్రస్ట్ అధ్యక్షునిగా సోమనాథునికి సేవ చేసే అవకాశం నాకు లభించిందిఈ ఆలయంఈ ప్రాంత అభివృద్ధి కోసం జరిగిన చారిత్రాత్మక పనులు నేడు మనందరికీ కనిపిస్తున్నాయిఅదే సమయంలోఈ సేవ వల్ల నాకు వ్యక్తిగతంగా కూడా ఎంతో మేలు జరిగిందిప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేసే అవకాశం నాకు లభించడమే ఆ సోమనాథుని అనుగ్రహం.

మిత్రులారా,

శతాబ్దాల తర్వాత నేడు కాశీ విశ్వనాథ ధామం ఒక అద్భుతమైన విస్తరణకు సాక్ష్యంగా నిలిచిందిఉజ్జయినిలో అత్యంత వైభవంగా వెలుగొందుతున్న మహాకాల్ మహాలోక్‌ను నేడు మనం చూస్తున్నాంకేదార్‌నాథ్ ధామం కూడా పునర్నిర్మితమైందినేను ముందే చెప్పినట్లుగాఅయోధ్యలో ఐదువందల ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసిందిఇప్పుడు రామ్ లల్లా అక్కడ ఒక భవ్యమైన మందిరంలో కొలువై ఉన్నాడు.

మిత్రులారా,

మన పురాణాల్లో కేవలం కథలుగా విన్న ఎన్నో పుణ్యక్షేత్రాలుమఠాలుఆలయాలుఆధ్యాత్మిక ప్రాంతాల వైభవాన్ని నేడు మనం కళ్లారా చూస్తున్నాంఈ గొప్ప సంప్రదాయ పునరుద్ధరణ కేవలం పది పన్నెండేళ్ల కాలంలోనే సాధ్యమైంది.

మిత్రులారా,

మన సాంస్కృతిక కేంద్రాల పట్ల నిర్లక్ష్యం దేశాభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారిందిమన పుణ్యక్షేత్రాలు భారత ఆధ్యాత్మికసామాజిక వ్యవస్థకే కాకుండా ఆర్థిక పురోగతికి కూడా మూలాధారాలునేడు చార్ ధామ్ హైవే ప్రాజెక్టుగోవింద్‌ఘాట్ నుంచి నహేమకుండ్ సాహిబ్ వరకు రోప్‌వేకర్తార్‌పూర్ కారిడార్బుద్ధ సర్క్యూట్ అభివృద్ధి వంటి పనులు పుణ్యక్షేత్రాల ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను పెంచాయిసోమనాథ్ క్షేత్రమే దీనికి ఒక బలమైన నిదర్శనంనేడు వందలాది కుటుంబాలు సోమనాథ్ ఆలయ ట్రస్టుతో ముడిపడి ఉన్నాయివేలాది మంది జీవనోపాధి ఈ ప్రాంతంతో అనుసంధానమై ఉందిభారతదేశం నుంచిప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే ప్రజలు గుజరాత్‌లోని ఇతర ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారుఇది రాష్ట్రానికిదేశానికి పురోగతికి సంబంధించిన కొత్త అవకాశాలను అందిస్తోంది

మిత్రులారా,

మన విశ్వాసం మనకు జీవన విధానాన్ని కూడా నేర్పింది.

సర్వం ఖల్విదం బ్రహ్మ” అని మనం నమ్ముతాం.

అంటేసృష్టిలోని ప్రతి అణువుప్రకృతి అంతా దైవస్వరూపమేఅందుకే మనకు నదుల పట్లచెట్ల పట్ల భక్తి ఉంటుందిమనం అడవులను గౌరవంగా చూస్తాంపర్వతాలలో కూడా పవిత్రతను దర్శిస్తాంనేడు ప్రపంచం మళ్ళీ ప్రకృతిసిద్ధమైన జీవనశైలి వైపు మళ్లుతున్న వేళమనం కూడా మన ఈ బలాన్ని గుర్తించాలిమన పుణ్యక్షేత్రాలనుఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటువాటి గౌరవాన్ని కాపాడటంపై కూడా మనం స్పృహతో ఉండాలిప్రకృతినిపర్యావరణాన్ని రక్షించే జీవనశైలిని మనం అలవర్చుకోవాలిఅదే సమయంలోమన పవిత్ర స్థలాలను ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలిమనం ఈ సంకల్పాలను మన విశ్వాసంతో ముడిపెట్టి ఆచరించాలి.

మిత్రులారా,

కొత్త తరాలు తమ చరిత్రవిశ్వాసంసాంస్కృతిక విలువలతో అనుసంధానమైనప్పుడు దేశ ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుందిభారత్ నేడు ఏ నమ్మకంతో ముందుకు సాగుతోందో అది ఈ సాంస్కృతిక నిరంతరాయతతోనే పెనవేసుకుని ఉందిమన దేశంలో ఆధునికతవారసత్వం పరస్పర విరుద్ధమైనవి కావు.  అవి రెండూ కలిసే పయనిస్తాయిఒకదానికొకటి బలాన్ని ఇస్తాయిఒక దేశం తన మూలాలతో అనుసంధానమై ఉన్నప్పుడుతన వారసత్వాన్ని అదే విశ్వాసంతోభక్తితో రాబోయే తరాలకు అందించినప్పుడే ఎక్కువ కాలం దృఢంగా ఉంటుందని సోమనాథుడు మనకు గుర్తుచేస్తారుడెబ్బై ఐదు ఏళ్ల క్రితం పునర్నిర్మించిన సోమనాథ ఆలయ ప్రతిష్ఠ జరిగినప్పుడుభారత్ ఒక కొత్త చైతన్య యాత్రను ప్రారంభించిందినేడు 75 ఏళ్ల తర్వాతఅదే ప్రయాణం మన ముందు మరింత విస్తృత రూపంలో నిలిచి ఉందిమనం దీనిని ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలిమన సంకల్పాల సిద్ధీకరణలో ఆ సోమనాథుని ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ ఉండాలిమరొకసారి పౌరులందరికీవారసత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరికీఈ సందర్భాన్ని పురస్కరించుకుని నా హృదయపూర్వక శుభాకాంక్షలు.  

నాతో కలిసి పలకండి 

సోమనాథునికి జై!

సోమనాథునికి జై!

హర హర మహాదేవ్!

గమనికఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.  

 

***


(రిలీజ్ ఐడి: 2260156) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam