ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ ప్రాంగణంలో శ్రీశ్రీ రవిశంకర్‌తో ప్రధానమంత్రి సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 10 MAY 2026 7:05PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బెంగళూరులోని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ ప్రాంగణంలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌తో సమావేశమయ్యారు.

 

ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయనతో చర్చ... ప్రత్యేకించి ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై అత్యంత అద్భుతంగా సాగిందని శ్రీ మోదీ చెప్పారు.

 

సామాజిక శ్రేయస్సు దిశగా శ్రీశ్రీ రవిశంకర్‌ ఆర్ద్రతను, దృక్కోణాన్ని ప్రధానమంత్రి ఎంతగానో ప్రశంసించారు. అలాగే వివిధ కార్యక్రమాల ద్వారా సంస్థ కొనసాగిస్తున్న సామాజిక సేవను ఆయన కొనియాడారు.

 

దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా ప్రజలతో పంచుకున్న సందేశంలో:

 

“ఆర్ట్ ఆఫ్ లివింగ్‌’ ప్రాంగణంలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌తో సమావేశమయ్యాను. ఈ సందర్భంగా మా ఇద్దరి మధ్య అనేక అంశాలపై... ముఖ్యంగా సంస్థ కార్యకలాపాలపై విస్తృతం సాగిన చర్చ ఎంతో అద్భుతమైన అనుభూతినిచ్చింది. సామాజిక శ్రేయస్సు దిశగా గురువుగారి తపన అత్యంత ప్రశంసనీయం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

****


(రిలీజ్ ఐడి: 2259635) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam