ప్రధాన మంత్రి కార్యాలయం
హైదరాబాద్‌లో సింధు ఆస్పత్రిని ప్రారంభించిన ప్రధానమంత్రి
అధునాతన సాంకేతికత-ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తున్న యాజమాన్యానికి ప్రశంసలు
प्रविष्टि तिथि:
10 MAY 2026 7:07PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హైదరాబాద్‌లో సింధు ఆస్పత్రిని ప్రారంభించారు. నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల మెరుగుకు ఈ ఆస్పత్రి చేస్తున్న కృషి అభినందనీయమని ప్రధానమంత్రి ఈ సందర్భంగా అన్నారు.
అంతేకాకుండా అధునాతన సాంకేతికతలు, ఆవిష్కరణల ప్రాధాన్యమిస్తూ వైద్య విధానాల్లో వాటిని అంతర్భాగం చేయడంపై యాజమాన్యాన్ని ప్రశంసించారు.
దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ప్రజలతో పంచుకున్న సందేశంలో:
“హైదరాబాద్‌లో ఇవాళ సింధు ఆసుపత్రిని ప్రారంభించాను. ఈ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల మెరుగుదల దిశగా ఇదొక ప్రశంసనీయ ప్రయత్నం. అత్యాధునిక సాంకేతికత-ఆవిష్కరణల అనుసంధానానికి ప్రాధాన్యంపై ఆస్పత్రి యాజమాన్యం శ్రద్ధ ఎంతయినా అభినందనీయం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
****
(रिलीज़ आईडी: 2259633)
आगंतुक पटल : 62
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam