పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియాలోని ఇటీవల పరిణామాలపై అంతర్ మంత్రిత్వ శాఖల వివరణ


పరిశ్రమ వ్యాప్తంగా నిన్న దాదాపు 99 శాతం పెరిగిన ఆన్‌లైన్‌ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్స్‌

గడచిన రెండు రోజుల్లో సుమారు 87.66 లక్షల సిలిండర్ల బుకింగ్స్‌కు గానూ, 97 లక్షలకు పైగా ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ

07.05.2026 నాటికి ఎంవైపీఎన్‌జీడీ.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఎల్పీజీ కనెక్షన్లను స్వచ్ఛందంగా వదులుకున్న 50,400 మందికి పైగా పీఎన్‌జీ వినియోగదారులు

గడచిన 48 గంటల్లో గల్ఫ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి స్వదేశానికి చేరుకున్న 20 మందితో కలిపి ఇప్పటివరకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న 3,019 మందికి పైగా భారత నావికులు

ప్రధానమంత్రి ఆదేశాల మేరకు గల్ఫ్‌ దేశాలతో కొనసాగుతున్న సంబంధాలు.. మే 7, 2026న యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌లో అధికారికంగా పర్యటించిన విదేశాంగ కార్యదర్శి

నాడు పోస్టు చేయడమైనది: 08 MAY 2026 6:30PM by PIB Hyderabad

పశ్చిమాసియాలోని పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ పౌరులను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ నేషనల్ మీడియా సెంటర్‌లో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు, నౌకాయానం, జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంధన లభ్యత, సముద్రయాన కార్యకలాపాలు కీలక రంగాల్లో స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు తీసుకుంటున్న చర్యలపై తాజా సమాచారాన్ని అందించారు.

ఇంధన సరఫరా, ఇంధన లభ్యత

పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతరం అందుబాటులో ఉండేలా తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. అందులోని ముఖ్యాంశాలు:

బహిరంగ ప్రకటన, పౌరులకు అవగాహన

·  పెట్రోల్, డీజిల్, ఎల్పీజీల లభ్యత కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నందున పౌరులు భయాందోళనలతో ముందస్తుగా నిల్వ చేసుకోవద్దని సూచించారు.

·  వదంతుల పట్ల జాగ్రత్త వహించండి. సరైన సమాచారం కోసం అధికారిక వనరులను మాత్రమే నమ్మండి.

·  ఎల్పీజీ వినియోగదారులు డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాలకు వెళ్లకుండా, డిజిటల్ బుకింగ్ వేదికలను వినియోగించాలని కోరారు.

·  పీఎన్‌జీ, ఎలక్ట్రిక్, ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించేలా పౌరులను ప్రోత్సహిస్తున్నారు.

·  ప్రస్తుత పరిస్థితుల్లో పౌరులందరూ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేసేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలని కోరారు.

ప్రభుత్వ సన్నద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు

·  ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దేశీయ ఎల్పీజీ, పీఎన్‌జీ, సీఎన్‌జీ (రవాణా)లకు 100 శాతం సరఫరాకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.

·  వాణిజ్య ఎల్పీజీ విషయంలో ఆసుపత్రులు, విద్యా సంస్థలకు తొలి ప్రాధాన్యతనిచ్చారు. వీటితో పాటు ఫార్మా, ఉక్కు, ఆటోమొబైల్, విత్తనాలు, వ్యవసాయం మొదలైన రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. అదనంగా వలస కార్మికులకు అందించే 5 కేజీల ఎఫ్‌టీఎల్ సరఫరాను 2026 మార్చి 2, 3 తేదీల నాటి సగటు సరఫరా ఆధారంగా రెట్టింపు చేశారు.

·  డిమాండ్, సరఫరాను సమన్వయం చేసేందుకు రిఫైనరీ ఉత్పత్తిని పెంచారు. గ్యాస్ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచటం ద్వారా సరఫరాను క్రమబద్ధీకరించారు.

·  ఎల్పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చారు.

·  చిన్న, మధ్య తరహా వినియోగదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని బొగ్గు మంత్రిత్వ శాఖ కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌ను ఆదేశించారు.

·  గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం కొత్త పీఎన్‌జీ కనెక్షన్లను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.

 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయ ప్రయత్నాలు, సంస్థాగత వ్యవస్థలు

·  నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వు-2000 ప్రకారం సరఫరాను పర్యవేక్షించేందుకు నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.

·  పెట్రోల్, డీజిల్, ఎల్పీజీతో సహా నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించటం, నియంత్రించటంలో రాష్ట్రాలు, యూటీ ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాలి. అన్ని రాష్ట్రాలు, యూటీలకు పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా భారత ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

·  భారత ప్రభుత్వ 27.03.2026, 02.04.2026 నాటి లేఖల ద్వారా తగినంత ఇంధన లభ్యత గురించి పౌరులకు భరోసా ఇవ్వటానికి క్రియాశీల ప్రజా సమాచార ప్రసార ఆవశ్యకతను తెలియజేసింది. రాష్ట్రాలు, యూటీలతో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 02.04.2026న (ఎంఏపీఎన్‌జీ కార్యదర్శి అధ్యక్షతన), 06.04.2026న (ఎంఏపీఎన్‌జీ కార్యదర్శి, ఐ అండ్‌ బీ వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శుల అధ్యక్షతన) సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లోని ప్రధాన అంశాలు:

 

·  రోజువారీ పత్రికా ప్రకటనలను విడుదల చేయటం, క్రమం తప్పకుండా ప్రజలకు సలహాలు జారీ చేయటం.

·  సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని పర్యవేక్షించి, వాటిని అరికట్టటం.

·  జిల్లా పాలన వ్యవస్థ ద్వారా రోజువారీ అమలు చర్యలను ముమ్మరం చేయటం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) సమన్వయంతో దాడులు, తనిఖీలను కొనసాగించటం.

·  ఆయా రాష్ట్రాలు, యూటీల్లో వాణిజ్య ఎల్పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయటం.

·  రాష్ట్రాలు, యూటీలకు కేటాయించిన అదనపు ఎస్‌కేఓల కోసం ఎస్‌కేఓ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయటం.

·  పీఎన్‌జీ, ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించటం.

·  ముఖ్యంగా గృహ అవసరాలకు ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యతనివ్వటం, సరఫరా స్థిరత్వానికి 5 కేజీల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్ల పంపిణీని చేపట్టటం.

·  నిల్వలను, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు, యూటీలు కంట్రోల్‌ రూంలను, జిల్లా పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.

·  అనేక రాష్ట్రాలు, యూటీలు పత్రికా సమావేశాలను నిర్వహిస్తున్నాయి.

అమలు, పర్యవేక్షణ చర్యలు

·  దేశవ్యాప్తంగా ఎల్పీజీ నిల్వలను, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2,000లకు పైగా దాడులు జరిగాయి.

·  పీఎస్‌యూ ఎంఓసీలు ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు 378 ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌లపై జరిమానాలు విధించగా, నిన్నటి వరకు 76 డిస్ట్రిబ్యూటర్‌షిప్‌లు సస్పెండ్ అయ్యాయి.

ఎల్పీజీ సరఫరా

గృహావసర ఎల్పీజీ సరఫరా వివరాలు:

·  ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.

·  గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా చేసేందుకు తొలి ప్రాధాన్యతనిచ్చారు.

·  ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద నిల్వలు అయిపోయినట్లు నివేదికలు అందలేదు.

·  నిన్నటి లెక్కల ప్రకారం.. పరిశ్రమ వ్యాప్తంగా ఆన్‌లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్స్‌ దాదాపు 99 శాతానికి పెరిగాయి.

·  డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత డెలివరీలు సుమారు 95 శాతానికి పెరిగాయి. ఈ డీఏసీ కోడ్ వినియోగదారులు నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు వస్తుంది.

·  గడిచిన రెండు రోజుల్లో సుమారు 87.66 లక్షల సిలిండర్ల బుకింగ్స్ అవగా, 97 లక్షలకు పైగా ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ అయ్యాయి.

వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు

·  వాణిజ్య ఎల్పీజీ మొత్తం కేటాయింపులను సుమారు 70 శాతానికి పెంచారు. ఇందులో 10 శాతం కేటాయింపులు సంస్కరణలకు అనుగుణంగా చేపట్టారు.

·  కేంద్ర ప్రభుత్వ 06.04.2026 నాటి లేఖ ద్వారా కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. వలస కూలీల కోసం 5 కేజీల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్ల రోజువారీ సంఖ్యను రెట్టింపు చేశారు. 2026 మార్చి 2, 3 తేదీల్లో జరిగిన సగటు సరఫరా ఆధారంగా గతంలో నిర్ణయించిన 20 శాతం పరిమితి కంటే ఎక్కువగా వీటిని పంపిణీ చేయనున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీల) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సిలిండర్లను కేవలం వలస కూలీలకు మాత్రమే అందజేస్తాయి.

·  గత రెండు రోజుల్లోనే 1.11 లక్షలకు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.

·  ఏప్రిల్ 3, 2026 నుంచి పీఎస్‌యూ ఓఎంసీలు దేశవ్యాప్తంగా 10,700లకు పైగా అవగాహన సదస్సులను నిర్వహించాయి. ఈ సదస్సుల ద్వారా సుమారు 1,89,500.. 5 కేజీల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్లను విక్రయించారు.

·  రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ఆయా రాష్ట్రాలు, యూటీల్లో కమర్షియల్ ఎల్పీజీ విక్రయ ప్రణాళికను ఖరారు చేసేందుకు ఐఓసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.

·  గత రెండు రోజుల్లో మొత్తం 15,493 మెట్రిక్ టన్నుల (19 కిలోల బరువున్న సుమారు 8.15 లక్షల సిలిండర్లతో సమానం) వాణిజ్య ఎల్పీజీ అమ్ముడైంది.

·  గత రెండు రోజుల్లో పీఎస్‌యూ ఎంఓసీలు మొత్తం 613 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్‌పీజీని విక్రయించాయి.

·         సహజవాయు సరఫరాపీఎన్జీ విస్తరణ చర్యలు

·         ·        డీ- పీఎన్‌జీ, సీఎన్‌జీలకు 100 శాతం సరఫరా ద్వారా వినియోగదారులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది.

·         ·        ఎరువుల కర్మాగారాలకు ఇచ్చే మొత్తం గ్యాస్ కేటాయింపులను... వాటి గత ఆరు నెలల సగటు వినియోగంలో దాదాపు 98 శాతానికి పెంచారు.

·         ·        అంతేకాకుండా సీజీడీ వ్యవస్థల ద్వారా సరఫరా సహా... ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకూ పెంచారు.

·         ·        వాణిజ్యపరంగా ఎల్‌పీజీ లభ్యతపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించడం కోసం... తమ భౌగోళిక పరిధిలో ప్రాంతాలన్నింటిలో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటిన్లకు వాణిజ్యపరమైన పీఎన్‌జీ కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రాధాన్యమివ్వాలని సీజీడీ సంస్థలకు ప్రభుత్వం సూచించింది.

·         ·        గృహ, వాణిజ్యపరమైన పీఎన్‌జీ కనెక్షన్లకు ఐజీఎల్‌, ఎంజీఎల్‌, జీఏఐఎల్ గ్యాస్‌, బీపీసీఎల్‌ వంటి సీజీడీ కంపెనీలు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.

·         ·        సీజీడీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను భారత ప్రభుత్వం కోరింది.

·         ·        దీర్ఘకాలంలో ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీ దిశగా మార్పునకు సహకరించగలిగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్యపరమైన ఎల్‌పీజీ కేటాయింపులో 10 శాతం అదనంగా ఇవ్వనున్నట్లు 2026 మార్చి 18 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రకటించింది.

·         ·        పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలతో ముడిపడి ఉన్న అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పొందుతున్నాయి.

·         ·        2026 మార్చి 24న జారీ చేసిన లేఖ ద్వారా సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన ఆమోద ప్రక్రియను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్య ప్రాతిపదికన పరిశీలించడానికి మూడు నెలలపాటు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

·         ·        నిత్యావసర వస్తువుల చట్టం- 1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్లు, ఇతర సదుపాయాల నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వు- 2026ను భారత .ప్రభుత్వం 2026 మార్చి 24 నాటి గెజిట్ ద్వారా ప్రకటించింది. దేశవ్యాప్తంగా పైప్‌లైన్ల నిర్మాణం, విస్తరణ కోసం ఒక సరళీకృత, కాలపరిమితితో కూడిన విధానాన్ని ఈ ఉత్తర్వు నిర్దేశిస్తుంది. భూసేకరణ, అనుమతుల్లో జాప్యాన్ని నివారిస్తూ.. నివాస ప్రాంతాలు సహా అన్ని చోట్లా సహజ వాయు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడుతుంది.

·         ·        దీనివల్ల పీఎన్‌జీ వ్యవస్థ పురోగమనం వేగవంతమవడంతోపాటు.. మారుమూల ప్రాంతాలకు కూడా అనుసంధానం పెరుగుతుంది. ఇది శుద్ధ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ.. భారత ఇంధన భద్రతను, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

·         ·        డీ-పీఎన్‌జీ కనెక్షన్లను వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్బీ ఆదేశించింది. అలాగే, పీఎన్‌జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడం కోసం జాతీయ పీఎన్‌జీ కార్యక్రమం 2.0ను 2026 జూన్ 30 వరకు పొడిగించింది.

·         ·        పర్యావరణానికి మేలు చేసే, సురక్షితమైన, స్వావలంబన కలిగిన ఇంధన వనరులను పెంచేలా... రాష్ట్రాల కోసం ఒక నమూనా సీబీజీ విధాన ముసాయిదాను భారత ప్రభుత్వం రూపొందించింది. పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలు ప్రాతిపదికన వ్యవస్థలను రాష్ట్రాలు సొంతంగా రూపొందించుకునేలా ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శకంగా ఈ నమూనా విధానం ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని అమలు చేసే రాష్ట్రాలకు.. వాణిజ్యపరమైన ఎల్‌పీజీ కోటా అదనపు కేటాయింపుల తదుపరి విడతలో ప్రాధాన్యమిస్తారు.

·         ·        సీజీడీ వ్యవస్థ, మౌలిక సదుపాయాలను నెలకొల్పేందుకు లేదా వాటి నిర్వహణకు 15 రోజుల్లోగా అనుమతి మంజూరు చేయడం కోసం ఎస్‌పీసీబీ, పీసీసీలకు తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా... 2026 ఏప్రిల్ 7 నాటి ఉత్తర్వుల ద్వారా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)ని ఆదేశించింది.

·         ·        2026 మార్చి నుంచి దాదాపు 6.50 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా మొదలైంది. మరో 2.66 లక్షల కనెక్షన్లకు మౌలిక సదుపాయాలను కల్పిచారు. దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 9.16 లక్షలకు చేరింది. అంతేకాకుండా దాదాపు 7.08 లక్షల వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారు.

·         ·        2026 మే 7 నాటికి 50,400కు పైగా పీఎన్‌జీ వినియోగదారులు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా తమ ఎల్‌పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.

·          

·         ముడి చమురు లభ్యతరిఫైనరీ కార్యకలాపాలు:

·         ·        అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, డీజిలు నిల్వలు సరిపడా ఉన్నాయి.

·         ·        గృహ వినియోగానికి అనుగుణంగా రిఫైనరీల నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని పెంచారు.

·         ·        దేశీయ మార్కెట్‌కు అవసరమైన పెట్రోకెమికల్ ముడిసరుకు సరఫరా నిరంతరాయంగా అందేలా చూడడం కోసం వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన ఒక సంయుక్త కార్యవర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్‌టీ) నిర్దేశించిన విధంగా దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు, పెట్రోకెమికల్ కాంప్లెక్సులు తమ వద్ద ఉండే సీ3, సీ4 గ్యాస్ నిల్వలను నిర్ణీత పరిమాణంలో కీలక రంగాలకు అందుబాటులో ఉంచేందుకు 2026 ఏప్రిల్ 1 నాటి ఉత్తర్వుల ద్వారా భారత ప్రభుత్వం అనుమతించింది.

·         ·        ఔషధ విభాగం, రసాయనాలు - పెట్రో కెమికల్స్ విభాగం (డీసీపీసీ), పరిశ్రమలు - అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం అభ్యర్థనల మేరకు.. ఔషధ, రసాయన, పెయింట్ రంగ కంపెనీల కోసం మొత్తం ఎల్పీజీ నిల్వల (ఎల్‌పీజీ పూల్) నుంచి రోజుకు 1120 మెట్రిక్ టన్నులను కేటాయించారు.

·         ·        2026 ఏప్రిల్ 9 నుంచి ముంబయి, కొచ్చి, వైజాగ్, చెన్నై, మథుర, గుజరాత్ రిఫైనరీలు... రసాయన, ఫార్మా, పెయింట్ పరిశ్రమలకు దాదాపు 13,150 మెట్రిక్ టన్నుల ప్రొపైలిన్‌ను, 1970 మెట్రిక్ టన్నులకు పైగా బ్యూటిల్ అక్రిలేట్‌ను విక్రయించాయి.

·          

·         రిటైల్ ఇంధన లభ్యతధరల నియంత్రణ చర్యలు

·         ·        దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోలు బంకులు యథావిధిగా నడుస్తున్నాయి.

·         ·        మధ్యప్రాచ్యంలో సంక్షోభం వల్ల ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. అయినప్పటికీ వినియోగదారులపై భారం పడకుండా భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిలుపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 తగ్గించింది.

·         ·        దేశంలోని అన్ని పెట్రోల్ పంపుల్లో పెట్రోలు, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయి. పెట్రోలు, డీజిల్ సాధారణ చిల్లర ధరల్లో మార్పు లేదు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల రిటైల్ అవుట్‌ లెట్లలో ధరలు పెరగలేదు.

·          

·         సముద్ర భద్రతనౌకా రవాణా కార్యకలాపాలు

·         పర్షియన్ గల్ఫ్‌లో ప్రస్తుత సముద్ర పరిస్థితులతోపాటు, ఈ ప్రాంతంలోని భారతీయ నౌకలు, సిబ్బంది రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ వివరించింది:

·         ·        నావికుల సంక్షేమం, సముద్ర కార్యకలాపాల్లో అంతరాయాలను తొలగించడం లక్ష్యంగా.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సముద్ర రంగ భాగస్వాములతో సమన్వయాన్ని మంత్రిత్వ శాఖ కొనసాగిస్తోంది.

·         ·        ఆ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 48 గంటల్లో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.

·         ·        గత 48 గంటల్లో భారతీయ నౌకలకు గానీ, భారతీయ నావికులతో కూడిన విదేశీ నౌకలకు గానీ సంబంధమున్న ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.

·         ·        డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూం కార్యకలాపాలను మొదలుపెట్టినప్పటి నుంచి కంట్రోల్ రూం 8,737 కాల్స్, 19,314కు పైగా ఈమెయిళ్లకు జవాబిచ్చింది. గత 48 గంటల్లో 167 కాల్స్, 582 ఈమెయిళ్లు వచ్చాయి.

·         ·        డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) ద్వారా ఇప్పటివరకు గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి 3,019 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో మంత్రిత్వ శాఖ సహాయపడింది. గత 48 గంటల్లో 20 మంది సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు.

·         ·        దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఎలాంటి రద్దీ నమోదవలేదు.

·          

·         ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత

·         గల్ఫ్,  పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాంతంలోని భారతీయుల భద్రత, సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది:

·         ·        ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు గల్ఫ్ ప్రాంతంలోని దేశాలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

·         ·        భారత విదేశాంగ కార్యదర్శి శ్రీ విక్రమ్ మిశ్రీ 2026 మే 7న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అధికారికంగా పర్యటించారు. అంతకుముందు 2026 ఏప్రిల్ 11-12 తేదీల్లో విదేశాంగ మంత్రి యూఏఈలో పర్యటించగా.. జాతీయ భద్రతా సలహాదారు 2026 ఏప్రిల్ 25-26 తేదీల్లో యూఏఈలో పర్యటించారు. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి కూడా 2026 ఏప్రిల్ 9-10 తేదీల్లో ఖతార్‌ను సందర్శించారు. 2026 ఏప్రిల్ 19న జాతీయ భద్రతా సలహాదారు సౌదీ అరేబియాను సందర్శించారు.

·         ·        ఈ పర్యటన సందర్భంగా గౌరవ సహాయ మంత్రి, భారత్‌కు ప్రత్యేక రాయబారి అయిన రీమ్ అల్ హాషిమీని, ముబాదాలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ గౌరవ ఎండీ, సీఈవో ఖల్దూన్ అల్ ముబారక్‌ను భారత విదేశాంగ కార్యదర్శి కలిశారు.

·         ·        గౌరవ సహాయ మంత్రి, భారత్‌కు ప్రత్యేక రాయబారి అయిన రీమ్ అల్ హాషిమీతో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలపైనా భారత విదేశాంగ కార్యదర్శి సవివరంగా సమీక్షించారు. వాణిజ్యం, పెట్టుబడి, ఆర్థిక సహకారం, ఇంధనం, రవాణా, రక్షణ - భద్రత, ఫిన్‌టెక్, ఆరోగ్యం, విద్య, సంస్కృతి - ప్రజా సంబంధాల వంటి రంగాల్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని వారు సమీక్షించారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న పరిస్థితి, ఉమ్మడి ప్రయోజనాలున్న ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరుపక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయి.

·         ·        భారత్ - ఫ్రాన్స్ - యూఏఈ ఫ్రేంవర్క్ కింద గౌరవ రీమ్ అల్ హషీమీ, ఫ్రాన్స్ దేశ ఐరోపా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రెటరీ జనరల్ గౌరవ మార్టిన్ బ్రియెన్స్‌తో జరిగిన త్రైపాక్షిక సమావేశంలో కూడా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి పాల్గొన్నారు. త్రైపాక్షిక భాగస్వామ్యంపై మూడు పక్షాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. నిర్దిష్ట కాలపరిమితులతో కూడిన నిర్మాణాత్మక కార్యాచరణ ప్రణాళికపై అంగీకారానికి వచ్చాయి.

·         ·        పరస్పర సమాచార మార్పిడి, మరింత మెరుగైన చర్యల కోసం... రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.

·         ·        విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కంట్రోల్ రూములు పనిచేస్తున్నాయి. భారతీయ పౌరులు, వారి కుటుంబాల సందేహాలను నివృత్తి చేస్తున్నాయి.

·         ·          భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు 24x7 హెల్ప్‌లైన్లను నిర్వహిస్తున్నాయి. భారత పౌరులకు సకాలంలో, చురుగ్గా సేవలందిస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాలతోనూ అవి నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.

·         ·        స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన ప్రయాణ పరిస్థితులు, కాన్సులర్ సేవలు, భారతీయులకు సాయమందించేలా తీసుకుంటున్న వివిధ చర్యలకు సంబంధించిన సమాచారంతో కూడిన తాజా సూచనలను క్రమం తప్పకుండా జారీ చేస్తున్నారు.

·         ·        స్థానిక భారతీయులతో భారతీయ రాయబార కార్యాలయాలు చురుగ్గా మమేకమై ఉన్నాయి. ఈ ప్రాంతంలోని వివిధ భారతీయ సమాజ సంఘాలు, సంస్థలు, వృత్తిపరమైన బృందాలు, భారతీయ కంపెనీలతో ఈ ఆందోళనలను పరిష్కరించడం కోసం నిరంతరం చర్చిస్తున్నాయి.

·         ·        ఈ ప్రాంతంలోని భారతీయ నావికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. రాయబార కార్యాలయాలు వారికి పూర్తి సహాయాన్ని అందిస్తున్నాయి. స్థానిక అధికారులు, సంస్థలతో సమన్వయం, కాన్సులర్ సాయాన్ని అందించడం, వారు భారత్‌కు తిరిగి రావాలన్న అభ్యర్థనలకు సాయమందించడం వంటివి చేస్తున్నారు.

·         ·        ఈ ప్రాంతం నుంచి భారత్‌లోని వివిధ ప్రదేశాలకు అదనపు విమానాలు నడుస్తుండటంతో, మొత్తంగా విమానయాన పరిస్థితి మెరుగుపడుతోంది.

·         ·        యూఏఈ గగనతలం తెరిచి ఉంది. భారత్, యూఏఈ విమానయాన సంస్థలు అక్కడి నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు విమానాలను నడుపుతున్నాయి.

·         ·        సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు విమాన సేవలు కొనసాగుతున్నాయి.

·         ·        ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, ఖతార్ ఎయిర్‌వేస్ సంస్థలు ఖతార్ నుంచి భారత్‌లోని వివిధ ప్రదేశాలకు విమాన సర్వీసులను నడుపుతున్నాయి.

·         ·        కువైట్ గగనతలం తెరిచి ఉంది. కువైట్ నుంచి భారత్‌కు జజీరా ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్ విమానాలను నడుపుతున్నాయి.

·         ·          బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, గల్ఫ్ ఎయిర్ సంస్థలు బహ్రెయిన్ నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు విమానాలను నడుపుతున్నాయి.

          ·        ఇరాక్ గగనతలం తెరిచి ఉంది. వివిధ ప్రాంతాలకు పరిమిత విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. భారత్‌కు తదుపరి ప్రయాణం కోసం దీనిని ఉపయోగించవచ్చు.

      ·        ఇరాన్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. భారత పౌరులు ఇరాన్‌కు ప్రయాణించవద్దని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు భారతీయ రాయబార కార్యాలయం సహాయంతో వెనక్కి రావాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఇప్పటివరకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం.. భూ సరిహద్దు మార్గాల ద్వారా 2,546 మంది భారత పౌరులు ఇరాన్ నుంచి బయటకు వెళ్లేందుకు సౌకర్యం కల్పించింది.

***

·         ·        ఇజ్రాయెల్ గగనతలం తెరిచి ఉంది. ఈ ప్రాంతం నుంచి గమ్యస్థానాలకు పరిమిత విమాన కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. భారత్‌కు తదుపరి ప్రయాణం కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు.  


(రిలీజ్ ఐడి: 2259248) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Marathi , हिन्दी , Assamese , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam