రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

వియత్నాం అధ్యక్షుడికి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఆతిథ్యం


భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలోనూ, ఇండో-పసిఫిక్ దార్శనికతలోనూ ఓ ముఖ్య భాగంగా వియత్నాం: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము

నాడు పోస్టు చేయడమైనది: 06 MAY 2026 9:45PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము.. వియత్నాం అధ్యక్షుడు శ్రీ తో లామ్‌ కు రాష్ట్రపతి భవన్లో ఈ రోజు (2026 మే 6) స్వాగతం పలికారు. ఆయన గౌరవార్థం విందును ఏర్పాటు చేశారు.

అధ్యక్షుడు శ్రీ లామ్ మొదటి సారి భారత్‌లో అధికార పర్యటనకు విచ్చేసిన సందర్భంగా రాష్ట్రపతి ఆయనను స్వాగతిస్తూ, భారత్ వియత్నాం మధ్య మంచి స్నేహం ఉందనీ, దీనికి చరిత్రాత్మక, నాగరికతా ప్రధాన, సాంస్కృతిక సంబంధాలు మూలాధారంగా ఉన్నాయన్నారు.
భారత్ - వియత్నాం ద్వైపాక్షిక సంబంధాలు  ఇటీవల కొన్నేళ్లలో ఉన్నత స్థాయి ఆదాన - ప్రదానాలు,  రక్షణ పరమైన, భద్రత పరమైన సహకారం, అభివృద్ధి ప్రధాన భాగస్వామ్యంతో పాటు వాణిజ్యం, ఆరోగ్యం, సైన్స్ - టెక్నాలజీ, పర్యటన వంటి రంగాలకు విస్తరించాయని రాష్ట్రపతి అన్నారు. ఈ పర్యటన కాలంలో, అరుదైన ఖనిజాలు (రేర్ ఎర్త్ మినరల్స్), డిజిటల్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, సంస్కృతి, విద్య వంటి ముఖ్య రంగాల్లో ఒప్పందాలు కుదరడంతో పాటు కీలక ప్రకటనల వెల్లడి చోటుచేసుకున్న సంగతి తెలిసి తాను సంతోషించానని రాష్ట్రపతి అన్నారు.
భారత్, వియత్నాంలు ‘‘ఇతోధిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన’’ ద్వారా ద్వైపాక్షిక సంబంధాల్ని మరింత బలపరుచుకోవాలని నిర్ణయించుకొన్నట్లు తెలుసుకొని రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.
గత పదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం చెప్పుకోదగిన స్థాయిలో వృద్ధి చెందిందనీ, దీనిని సమతౌల్యమైన, ఉభయ పక్షాలకూ లాభదాయకమైన పద్ధతుల్లో విస్తరించుకోవాలని భారత్ ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.
‘‘
ఆసియాన్‌తో మా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళిక పరిధిలో, వియత్నాంతో మా సంబంధాలు మేం అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానంతో పాటు ఇండో-పసిఫిక్ దార్శనికతలో ముఖ్య భాగంగా ఉన్నాయి’’ అని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. ‘ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనీషియేటివ్‌’లో వియత్నాం భాగస్వామ్యాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు.
భారత్-వియత్నాం ద్వైపాక్షిక సంబంధాలకు  రక్షణ, భద్రత ప్రధానాంశాలుగా ఉన్నాయని రాష్ట్రపతి అన్నారు. ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడంలో, ప్రాంతీయ శాంతినీ, ప్రాంతీయ స్థిరత్వాన్నీ ప్రోత్సహించడంలో వియత్నాంతో కలిసి పనిచేయాలన్నదే భారత్ నిబద్ధత అని శ్రీమతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు.
భారత్, వియత్నాంల మధ్య సన్నిహిత సహకారంతో మన రెండు దేశాల ప్రజలకూ ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయంటూ నేతలిద్దరూ అంగీకారాన్ని వ్యక్తం చేశారు. అధ్యక్షుడు శ్రీ తో లామ్ నాయకత్వంలో భారత్-వియత్నాం సంబంధాలు ఇదివరకటి కన్న ఎక్కువ బలోపేతం కాగలవన్న విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి ప్రసంగం ఇక్కడ-
Please click here to see the President's speech-

 

***


(రిలీజ్ ఐడి: 2258678) సందర్శకుల సూచీ సంఖ్య : : 87
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Malayalam