కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మే 7న దేశవ్యాప్తంగా వార్షిక ఆరోగ్య పరీక్షల ఉచిత పథకాన్ని ప్రారంభించనున్న కేంద్రమంత్రి డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయ


నూతన కార్మిక చట్టాల అమలు: ఈఎస్‌ఐసీ ఆధ్వర్యంలో కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 06 MAY 2026 1:42PM by PIB Hyderabad

నూతన కార్మిక చట్టాల ప్రకారం.. 40 ఏళ్లు పైబడిన కార్మికుల కోసం దేశవ్యాప్తంగా వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని మే 7న కేంద్ర కార్మికఉపాధియువజన వ్యవహారాలుక్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయ ప్రారంభించనున్నారుఈ కార్యక్రమం న్యూఢిల్లీలోని బసైదారాపూర్‌ ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీమెడికల్ కాలేజీఆస్పత్రిలో అధికారికంగా ప్రారంభం కానుందిదేశవ్యాప్తంగా మరో 11 ఈఎస్‌ఐసీ ఆస్పత్రుల్లోనూ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయిఈ కార్యక్రమాలకు ఆయా రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులుపార్లమెంటు సభ్యులుశాసనసభ్యులుఇతర ప్రముఖులు హాజరవుతారు.

 

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా కార్మికుల గౌరవాన్ని పెంపొందించటంసామాజిక భద్రతను బలోపేతం చేయటమే లక్ష్యంగా చేపట్టిన "శ్రమయేవ జయతేవ్యవస్థలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారుఈ అమలు ప్రక్రియ 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు సమగ్ర విభాగాలుగా ఏకీకృతం చేస్తూ తీసుకువచ్చిన నాలుగు నూతన కార్మిక చట్టాల విప్లవాత్మక సంస్కరణలపై ఆధారపడి ఉందినిబంధనల అమలును సులభతరం చేయటంఉపాధిని వ్యవస్థీకృతం చేయటంసామాజిక భద్రతా పరిధిని మరింత విస్తరించటం ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశం.

 

అసంఘటిత రంగ కార్మికులుగిగ్వివిధ రంగాల్లోని కార్మికులకు సామాజిక భద్రతను విస్తరించడమే కాకసామాజిక భద్రతా నిధిని సామాజిక భద్రత కోడ్-2020 ఏర్పాటు చేస్తుందిఈఎస్‌ఐసీ ప్రయోజనాల పరిధిని పెంచుతుందికొత్త కార్మిక చట్టాల నిబంధనల ప్రకారం.. 40 ఏళ్లు పైబడిన కార్మికులకు వార్షిక ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారువ్యాధులను ముందుగానే గుర్తించటంనివారణ చర్యలు చేపట్టటంనిరంతర ఆరోగ్య పర్యవేక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

 

రసాయనాలువిషపూరిత పదార్థాలుభారీ యంత్రాల నిర్వహణ వంటి ప్రమాదకరమైన పనులు చేసే కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించటం తప్పనిసరికార్మికుల దీర్ఘకాలిక ఆరోగ్యంసంక్షేమం కోసం ఆరోగ్య రికార్డుల నిర్వహణనిర్ణీత కాలవ్యవధిలో పర్యవేక్షణ కూడా ఈ కార్యక్రమంలో భాగం.

 

ఈ దేశవ్యాప్త కార్యక్రమం.. వృత్తిపరంగా ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయటంలోభారతదేశ శ్రామిక శక్తికి సమగ్ర ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావటమే కాకవికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలోనూ కీలక ముందడుగుగా నిలుస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2258377) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Gujarati , Kannada