ప్రధాన మంత్రి కార్యాలయం
యూఏఈపై జరిగిన దాడిని ఖండిస్తూ.. శాంతి, ప్రాంతీయ స్థిరత్వానికి మద్దతును పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
05 MAY 2026 1:11PM by PIB Hyderabad
యూఏఈపై జరిగిన దాడులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు.
పౌరులను, ప్రజా మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు.
యూఏఈకి సంఘీభావంగా భారత్ దృఢంగా నిలబడుతుందనీ, చర్చలు, దౌత్యం ద్వారా అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకొనేందుకు తను మద్దతును పునరుద్ఘాటిస్తుందనీ శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ప్రాంతీయంగా శాంతిని, స్థిరత్వాన్ని, అంతర్జాతీయ ఇంధన భద్రతను కొనసాగించేందుకు హర్మూజ్ జలసంధి ద్వారా సురక్షితమైన, నిరాటంకమైన నౌకాయానానికి భరోసా ఇవ్వడమే కీలకమని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా పోస్టు చేశారు:
‘‘యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. పౌరులను, మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు.
యూఏఈకి సంఘీభావంగా భారత్ దృఢంగా నిలబడుతుంది. చర్చలు, దౌత్యం ద్వారా అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకొనేందుకు తన మద్దతును పునరుద్ఘాటిస్తోంది.
ప్రాంతీయంగా శాంతిని, స్థిరత్వాన్ని, అంతర్జాతీయ ఇంధన భద్రతను కొనసాగించేందుకు హర్మూజ్ జలసంధి ద్వారా సురక్షితమైన, నిరాటంకమైన నౌకాయానానికి భరోసా ఇవ్వడం కీలకం’’
***
(రిలీజ్ ఐడి: 2258004)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam