ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలోని షాదారా జిల్లాలో అగ్నిప్రమాద ఘటన... మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి నష్టపరిహారం
నాడు పోస్టు చేయడమైనది:
03 MAY 2026 7:06PM by PIB Hyderabad
ఢిల్లీలోని షాదారా జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ఘోర ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందజేస్తామని శ్రీ మోదీ ప్రకటించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“ఢిల్లీలోని షాదారా జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం అత్యంత బాధాకరం. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం.
మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని అందిస్తాం. గాయపడిన వారికి రూ. 50,000 అందిస్తాం.”
***
(రిలీజ్ ఐడి: 2257793)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam