మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ తొలి సన్నాహక సమావేశం
ఆర్థిక వృద్ధి, సుపరిపాలన, సామాజిక పరివర్తనలో మహిళలను కీలక శక్తిగా గుర్తిస్తూ... మహిళా నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించడంలో దేశ నిబద్ధతను మరోసారి చాటిచెప్పిన సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
01 MAY 2026 10:18AM by PIB Hyderabad
బ్రిక్స్ బృందానికి భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 30, 2026న ‘బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్’ మొదటి సన్నాహక సమావేశాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించింది.
ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం, భారత వాణిజ్య, పరిశ్రమల మండలి సమాఖ్య (ఎఫ్‌ఐసీసీఐ) వంటి భాగస్వాములు కూడా ఈ భేటీకి హాజరయ్యారు.
మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి కారోలిన్ ఖోంగ్వార్ దేశ్‌ముఖ్ ప్రతినిధులందరికీ స్వాగతం పలికి, చర్చలకు నాంది పలికారు.
భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ బ్రిక్స్ సమావేశం, ‘స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’ ఇతివృత్తం స్పూర్తితో సాగింది..ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ఉమ్మడి సవాళ్లపై విస్తృత చర్చలు జరిగాయి. వాటిని నాలుగు ప్రాధాన్యత రంగాలుగా విభజించారు. అవి: 1. పాలన, నాయకత్వంలో మహిళలు; 2. ఆర్థిక, డిజిటల్ సమ్మిళిత్వం; 3. మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధి; 4. వాతావరణ చర్యలు, ఆహార భద్రత, పోషకాహారంలో మహిళల పాత్ర.
ఆర్థిక వృద్ధి, సుపరిపాలన, సామాజిక మహిళలను కీలక శక్తిగా గుర్తిస్తూ... మహిళా నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించడంలో దేశ నిబద్ధతను ఈ సమావేశం పునరుద్ఘాటించింది.
బ్రిక్స్ సభ్య దేశాలు తమ ప్రసంగాల్లో... ఈ సమావేశానికి భారత్ అధ్యక్షత వహించడాన్ని అభినందించాయి. సహకారం, అభ్యాస స్ఫూర్తిని చాటుతూ భారత్‌ప్రతిపాదించిన ప్రాధాన్యతా రంగాలకు తమ మద్దతును ప్రకటించాయి.
ఈ చర్చలు కేరళలోని కొచ్చిలో జరగనున్న బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ సమావేశం (6, 7 జూలై 2026), బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశంలో (8, 9 జూలై 2026) రూపుదిద్దుకోనున్న కీలక ఫలితాలకు దోహదపడనున్నాయి.
(రిలీజ్ ఐడి: 2257278)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16