ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరప్రదేశ్‌లోని హర్‌దోయిలో గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవ వేళ తన ప్రసంగం ముఖ్యాంశాల్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
29 APR 2026 11:43PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లోని హర్‌దోయిలో గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవం సందర్భంగా తాను ఇచ్చిన ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. రాష్ట్రం మార్పు దిశగా దూసుకుపోతోందని ఆయన చెబుతూ, మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు పారిశ్రామిక వృద్ధిలో కూడా ఇంతకు ముందు ఎన్నడూ లేనంత జోరు ప్రస్తుతం ఒక కొత్త ఉత్తరప్రదేశ్‌కు గుర్తింపుగా మారుతోందన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ అనేక సందేశాలను పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు..:
‘‘రెండు ఇంజన్ల ప్రభుత్వంలో శంకుస్థాపనతో పాటు, అనుకున్న కాలం లోపలే ఆ యా ప్రాజెక్టులను దేశ ప్రజలకు అంకితమివ్వాలన్న సంకల్పం కూడా పూర్తవుతోంది. ఇందువల్ల ప్రస్తుత యూపీలోని ఎక్స్‌ప్రెస్‌వే కన్నా వేగంగా ఇక్కడి అభివృద్ధి దూసుకుపోతోంది.’’
‘‘గంగా ఎక్స్‌ప్రెస్‌వే కేవలం ఒక హైస్పీడ్ రహదారి కాదు, అది కొత్త అవకాశాలకో గేట్‌వే కూడా. దీంతో రాష్ట్రంలో రైతు సోదరీ, సోదరులకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.’’
‘‘గత కొన్ని సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు ఈ రాష్ట్రాన్ని తయారీ కూడలిగా తీర్చిదిద్దడానికి నిరంతర ప్రయత్నాలు జరిగాయి. దీనికి ఒకటి కాదు, అనేక ఉదాహరణలు ఉన్నాయి...’’
***
(రిలీజ్ ఐడి: 2256862)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam