యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
భారత్ క్రీడారంగ భవిత కోసం ఏకీకృత, అథ్లెట్-కేంద్రిత దృష్టికోణాన్ని రూపొందించే ఉద్దేశంతో ‘శ్రీనగర్ ఖేల్ సంకల్ప్’ను ఆవిష్కరించిన
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవియా
అథ్లెట్-కేంద్రిత, సహకార పూర్వక క్రీడా అనుబంధ విస్తారిత వ్యవస్థ పట్ల ఒక్కుమ్మడి నిబద్దతను చాటిన ‘శ్రీనగర్ ఖేల్ సంకల్ప్’
శ్రీనగర్‌లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రుల చింతన శిబిరం రెండో రోజున
క్రీడా పరిపాలనా సంస్కరణలు, తయారీ అనుబంధ విస్తారిత వ్యవస్థలతో పాటు యువత భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టి
భారత క్రీడా అనుబంధ విస్తారిత వ్యవస్థను బలోపేతం చేయడానికి
కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉమ్మడి సంకల్పానికి ప్రతీకే ‘శ్రీనగర్ ఖేల్ సంకల్ప్’
క్రీడా పరిపాలన, తయారీ, యువత భాగస్వామ్యంపై చింతన శివిర్ ముగింపు సదస్సుల్లో కీలక చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
26 APR 2026 4:59PM by PIB Hyderabad
శ్రీనగర్‌లో మూడు రోజుల చింతన శిబిరంలో భాగంగా చివరి రోజు ఈ నెల 26న ‘శ్రీనగర్ ఖేల్ సంకల్ప్’ డాక్యుమెంటును కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవియా రాష్ట్రాల క్రీడా మంత్రులు, ప్రముఖ క్రీడాకారులతో కలసి విడుదల చేశారు.
సహకార సమాఖ్యవాదం ద్వారా క్రీడా సంస్కృతిని బలోపేతం చేయడానికి ఒక ఉమ్మడి దేశీయ దృష్టికోణం రూపురేఖలను ఈ డాక్యుమెంటులో ఆవిష్కరించారు. దీనిలో అథ్లెట్-కేంద్రిత అభివృద్ధి, క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రతిభావంతుల్ని గుర్తించడం, ప్రాంతీయ స్పోర్ట్‌స్ క్లస్టర్లను తీర్చిదిద్దడం, ఐక్యత సాధన, యువతకు సాధికారత కల్పన, ఆరోగ్య, పర్యటన, ఆర్థిక రంగాల అభివృద్ధికి క్రీడల సాయాన్ని తీసుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. భారత ప్రముఖ గ్లోబల్ స్పోర్టింగ్ ఈవెంట్లకు ఆతిథ్యాన్ని ఇవ్వాలన్న భారత్ ఆకాంక్షను కూడా దీనిలో పునరుద్ఘాటించారు.
‘శ్రీనగర్ ఖేల్ సంకల్ప్’ కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉమ్మడి సంకల్పాన్ని చాటిచెబుతోంది. దీనిలో క్రీడలను దేశ నిర్మాణానికి కీలకంగా పరిగణించారు. సామాజిక ఏకతను ప్రోత్సహించడంలో, సముదాయాలను పటిష్ఠపరచడంలో, ఆరోగ్యవంతమైన, అధిక సాధికారత కలిగిన తరాన్ని రూపొందించడంలో దీని పాత్రకున్న ప్రాధాన్యాన్ని గుర్తించారు. ఇది సహకారాత్మక, క్రీడాకారులను కేంద్ర స్థానంలో నిలిపే దృష్టికోణం ఎంతైనా అవసరమని స్పష్టం చేస్తోంది. ప్రభుత్వాలూ, క్రీడా సంస్థలు సామరస్యంతో, సద్భావన తో పని చేయడంతో పాటు దేశం నలుమూలలా క్రీడాకారుల కోసం సహజమైన, సహాయక అనుబంధ విస్తారిత వ్యవస్థ (ఇకోసిస్టమ్)ను నెలకొల్పడానికి చేసే ప్రయత్నాల్ని, వనరుల్ని సమన్వయపరచడం కూడా అవసరమేనని ఈ డాక్యుమెంటు చెబుతోంది.

భారత్‌లోని వైవిధ్యాన్ని ఒక శక్తిగా ఉపయోగించుకోవాలనే అంశానికి సంకల్ప్ పత్రంలో ప్రాధాన్యాన్నిచ్చారు. అలాగే రాష్ట్రాలను మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరిచేటట్లుగా, ప్రతిభావంతులను గుర్తించేటట్లుగా, వారి వారి విశిష్ట ప్రాంతాలకీ, సంస్కృతులకీ సరిపడేటట్లు క్రీడా అనుబంధ విస్తారిత వ్యవస్థలను నిర్మించేటట్లుగా ప్రోత్సహించాలని తెలిపారు. క్రీడలను సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ఒక చోదక శక్తిగా వినియోగించాలని కూడా ప్రస్తావించారు. పర్యటన రంగాన్ని ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రాంతీయ పరిశ్రమలకు వెన్నుదన్నుగా నిలవడంతో పాటు ఒలింపిక్స్, ప్రపంచ కప్పులు వంటివి సహా ప్రధాన గ్లోబల్ స్పోర్టింగ్ ఈవెంట్లకు ఆతిథ్యాన్ని ఇవ్వడానికి అనువైందిగా భారత్‌ను మలచే సామర్థ్యం గురించి కూడా దీనిలో పేర్కొన్నారు.
ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో ‘‘సండేస్ ఆన్ సైకిల్’’ పేరిట సైక్లోథాన్‌ను నిర్వహించడంతో చింతన్ శిబిరం ముగింపు రోజును మొదలు పెట్టారు. ఈ సైక్లోథాన్‌కు కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవియా, సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్‌సే నాయకత్వం వహించారు. ఫిట్‌నెస్, క్రమశిక్షణ, ప్రజాభాగస్వామ్యం సందేశాల్ని ఈ కార్యక్రమం దృఢతరం చేసింది.
దీని తరువాత.. క్రీడా పరిపాలన, క్రీడా సామగ్రి తయారీ, ఎమ్‌వై భారత్ మాధ్యమం ద్వారా యువత భాగస్వామ్యంపై దృష్టిని కేంద్రీకరించిన సదస్సుల్ని నిర్వహించారు. సంస్థాగత ప్రణాళికల (ఇనిస్టిట్యూషనల్ ఫ్రేంవర్క్‌స్)ను బలోపేతం చేయడం, ఆసక్తిదారుల (స్టేక్‌హోల్డర్స్) మధ్య పారదర్శకత్వాన్ని, సమన్వయాన్ని పెంచడం, క్రీడా పరిపాలన ప్రక్రియను వృత్తినైపుణ్యం కలిగిందిగా తీర్చిదిద్దడం ముఖ్యమని ఈ సదస్సుల్లో స్పష్టం చేశారు. భారత్‌ను క్రీడా వస్తువుల తయారీకి ప్రపంచ కూడలి (గ్లోబల్ హబ్)గా రూపొందించాల్సిన అవసరం ఉందనీ, ఇందుకోసం క్లస్టర్-ఆధారిత అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, దేశీయ పరిశ్రమకు ప్రోత్సాహం అందించాలని చర్చోపచర్చల్లో సూచనలు చేశారు. వీటికి అదనంగా, యువత భాగస్వామ్యాన్ని, నాయకత్వాన్ని పెంపొందించేందుకు తగిన వేదికలను సిద్ధం చేయడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని కూడా తెలిపారు.
కేంద్రం, రాష్ట్రాలు సహా ఆసక్తిదారులందరినీ కలుపుకొని ముందుకు పోతూ ఏకీకృత, సమన్వయపూర్వక వైఖరిని అవలంబించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ముగింపు రోజున చేపట్టిన చర్చలు పునరుద్ఘాటించాయి. భారత్‌లో బలమైన, సమ్మిళితమైన, రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అందుకు సన్నద్ధం అయిన యువతని, క్రీడా అనుబంధ విస్తారిత వ్యవస్థను మలచుకొనే దిశలో చర్చలు, తదనుగుణంగా సామూహిక కార్యాచరణకు గాను ఈ చింతన శిబిరం ఓ కీలక వేదికగా తన వంతు పాత్రను పోషించింది.
***
(రిలీజ్ ఐడి: 2255970)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7