పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియా పరిణామాల దృష్ట్యా కీలక రంగాలపై తాజా సమాచారం
సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టేందుకు 94.5 శాతానికి పైగా పెరిగిన డీఏసీ ఆధారిత సిలిండర్ల పంపిణీ
5 కిలోల ఎఫ్‌టీల్ సిలిండర్ల కోసం 8,770కి పైగా అవగాహన శిబిరాలు నిర్వహించిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు
ఏప్రిల్ 3, 2026 నుంచి ఇప్పటివరకు 1,38,000కు పైగా 5 కిలోల ఎఫ్‌టీల్ సిలిండర్లు విక్రయం
9 ఏప్రిల్ 2026 నుంచి రసాయనాలు, ఫార్మా పరిశ్రమలకు 7000 మెట్రిక్ టన్నులకు పైగా ప్రొపైలిన్‌ను విక్రయించిన ముంబయి, కొచ్చి, వైజాగ్, చెన్నై, మధుర రిఫైనరీలు
ఈ ప్రాంతంలోని భారతీయ నావికులంతా క్షేమం
గత 24 గంటల్లో భారత జెండా కలిగిన నౌకలకు సంబంధించి ఎటువంటి ఘటనలూ నమోదు కాలేదు
భారత పౌరులు ఇరాన్‌కు ప్రయాణించడం మానుకోవాలని... ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్నవారు భారత రాయబార కార్యాలయ సహకారంతో భూ సరిహద్దు మార్గాల ద్వారా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచన
ఇప్పటివరకు 2,443 మంది భారతీయ పౌరులను భూ సరిహద్దు మార్గాల ద్వారా ఇరాన్ నుంచి తరలించడానికి సహకరించిన టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం
నాడు పోస్టు చేయడమైనది:
25 APR 2026 6:03PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, భారత ప్రభుత్వం సమన్వయ ప్రతిస్పందన చర్యల ద్వారా కీలక రంగాల్లో సంసిద్ధతను, కొనసాగింపును నిర్ధారించడంలో చురుగ్గా నిమగ్నమై ఉంది. ఈ ప్రాంతంలోని ఇంధన సరఫరా, నౌకా వాణిజ్య కార్యకలాపాలు, భారత పౌరులకు మద్దతునందించుటకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం తెలియజేసింది:
ఇంధన సరఫరా, ఇంధన లభ్యత
హార్మూజ్ జలసంధికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ నిరంతరాయంగా లభించేలా చూసేందుకు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని తెలియజేసింది:
ప్రజలకు సూచనలు, పౌరులకు అవగాహన
పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీల లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నందున, పౌరులు వీటిని భయాందోళనతో కొనుగోలు చేయడం మానుకోవాలి.
వదంతుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, సరైన సమాచారం కోసం అధికారిక వనరులపై ఆధారపడాలి.
ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవాలని, పంపిణీదారుల వద్దకు వెళ్లడం మానుకోవాలని విజ్ఞప్తి.
పీఎన్‌జీ, విద్యుత్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాల్సిందిగా పౌరులను ప్రోత్సహిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో, పౌరులంతా తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయాలని కోరడమైనది.
ప్రభుత్వ సంసిద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో గృహావసరాల కోసం ఎల్‌పీజీ, పీఎన్‌జీ, సీఎన్‌జీ (రవాణా)లకు 100 శాతం సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాలో ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఔషధ, ఉక్కు, ఆటోమొబైల్, విత్తన, వ్యవసాయ రంగాలకూ ప్రాధాన్యత కొనసాగిస్తున్నారు. 2026 మార్చి 2, 3 తేదీల్లో నమోదైన సగటు దైనందిన సరఫరా ఆధారంగా వలస కార్మికులకు అందించే 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేశారు.
సరఫరా, డిమాండ్ రెండు వైపులా ప్రభుత్వం ఇప్పటికే అనేక హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. వీటిలో రిఫైనరీ ఉత్పత్తి పెంపుదల... పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ విరామాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకూ పెంచడం... సరఫరా విషయంలో నిర్దిష్ట రంగాలకు ప్రాధాన్యమివ్వడం వంటి చర్యలు ఉన్నాయి.
ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు అందుబాటులో ఉంచుతున్నారు.
చిన్న, మధ్య తరహా వినియోగదారులకు పంపిణీ చేసే నిమిత్తం రాష్ట్రాలకు అదనపు బొగ్గును కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ 'కోల్ ఇండియా', 'సింగరేణి కాలరీస్'లను ఆదేశించింది.
గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్‌జీ కనెక్షన్లను సమకూర్చాలని రాష్ట్రాలకు సూచించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వులు-2000 ప్రకారం సరఫరాను పర్యవేక్షించడం... అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు లేఖలు, వీడియో అనుసంధానాల ద్వారా పునరుద్ఘాటించింది.
తగినంత ఇంధన లభ్యతపై పౌరులకు భరోసా కల్పించేందుకు, ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సిన ఆవశ్యకతను భారత ప్రభుత్వం 27.03.2026, 02.04.2026 తేదీల నాటి లేఖల ద్వారా స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతర సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. 02.04.2026న (ఎమ్‌వోపీఎన్‌జీ కార్యదర్శి అధ్యక్షతన), 06.04.2026న (ఎమ్‌వోపీఎన్‌జీ కార్యదర్శితో పాటు సమాచార-ప్రసార శాఖ, వినియోగదారుల వ్యవహారాల శాఖల కార్యదర్శుల అధ్యక్షతన) సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు:
రోజువారీ పత్రికా సమావేశాలను నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజలకు సూచనలు జారీ చేయడం.
సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, తిప్పికొట్టడం.
జిల్లా యంత్రాంగం ద్వారా రోజువారీ అమలు చర్యలను ముమ్మరం చేయడం, ఓఎమ్‌సీలతో సమన్వయం ద్వారా సోదాలు, తనిఖీలను కొనసాగించడం.
తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన అదనపు ఎస్‌కేవో కోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
పీఎన్‌జీ వినియోగాన్ని, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
ముఖ్యంగా గృహావసరాల కోసం ఎల్‌పీజీ సరఫరాకు ప్రాధాన్యమివ్వడం. సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించడానికి లక్ష్యానికి అనుగుణంగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల పంపిణీని అమలు చేయడం.
అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూమ్‌లను, జిల్లా పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.
అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పత్రికా ప్రకటనలను జారీ చేస్తున్నాయి, సమావేశాలను నిర్వహిస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌లను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా తనిఖీ చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 2,400కు పైగా సోదాలు నిర్వహించారు.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేసి, 309 ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాలకు జరిమానాలు విధించగా, నిన్నటి వరకు 70 ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల లైసెన్సును నిలిపివేశాయి.
ఎల్పీజీ సరఫరా
గృహావసరాల ఎల్‌పీజీ సరఫరా స్థితి...
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
· గృహ వినియోగదారులకు సంబంధించిన ఎల్‌పీజీ సరఫరాకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోంది.
· ఎల్‌పీజీ పంపిణీదారుల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.
· నిన్న పరిశ్రమవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు సుమారు 98 శాతానికి పెరిగాయి.
· సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 94.5 శాతానికి పెంచారు. నమోదు చేసుకున్న ఫోన్ నంబర్‌కు డీఏసీ వస్తుంది.
వాణిజ్య ఎల్పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు
· మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపులు కూడా ఉన్నాయి.
· కేంద్ర ప్రభుత్వం 06.04.2026 నాటి లేఖ ద్వారా వలస కార్మికులకు పంపిణీ చేసే 5 కిలోల ఎఫ్‌టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ) సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని ప్రతి రాష్ట్రంలోనూ రెట్టింపు చేస్తున్నట్లు తెలియజేసింది. 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితిని మించి 2026 మార్చి 2-3 తేదీల్లో వలస కార్మికులకు సరఫరా చేసిన సగటు సిలిండర్ల సంఖ్య ఆధారంగా ఈ పెంపు ఉంటుంది. ఈ 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంటాయి. వీటిని చమురు మార్కెటింగ్ కంపెనీల సహకారంతో కేవలం ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులకు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుంది.
· ఏప్రిల్ 1, 2026 నుంచి 18.63 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లను విక్రయించారు.
· నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు సుమారు 80,000
అమ్ముడయ్యాయి
· ఏప్రిల్ 3 నుంచి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు 8,770 కంటే ఎక్కువ అవగాహన శిబిరాలను నిర్వహించాయి. ఈ శిబిరాల ద్వారా 1,38,000కి పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
· నిన్న 230కి పైగా శిబిరాల ద్వారా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు 5,717 అమ్ముడయ్యాయి.
· వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ... రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.
· ఏప్రిల్ 24, 2026 వరకు మొత్తం 1,55,524 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ అమ్ముడైంది (ఇది దాదాపు 81.85 లక్షల 19 కేజీల సిలిండర్లతో సమానం).
సహజ వాయువు సరఫరా, పీఎన్‌జీ విస్తరణ కార్యక్రమాలు
· ప్రాధాన్యత రంగాలకు గ్యాస్ సరఫరాను ప్రభుత్వం కొనసాగిస్తోంది. దేశీయ గృహ అవసరాల పీఎన్‌జీ, సీఎన్‌జీ రవాణా రంగానికి 100 శాతం సరఫరాను రక్షిత ప్రాతిపదికన అందిస్తోంది.
· ఎరువుల కర్మాగారాలకు ఇచ్చే మొత్తం గ్యాస్ కేటాయింపులను, వాటి గత ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతానికి పెంచారు.
· దీంతో పాటు సీజీడీ వ్యవస్థల ద్వారా అందే సరఫరాలతో సహా, ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.
· వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతపై నెలకొన్నఆందోళనలను తొలగించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లకు పీఎన్‌జీ కనెక్షన్లు ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని సీజీడీ సంస్థలను ఆదేశించారు.
· గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్లను పెంచేందుకు ఐజీఎల్, ఎంజీఎల్, జీఏఐఎల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి కంపెనీలు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.
· సీజీడీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను భారత ప్రభుత్వం కోరింది.
· ఎల్‌పీజీ నుంచి పీఎన్ జీకి దీర్ఘకాలిక మార్పునకు సహకరించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించే వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులో 10 శాతం అదనంగా ఇవ్వనున్నట్లు 18 మార్చి 2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రకటించింది.
· 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును పొందుతున్నాయి.
· కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 24.03.26 తేదీన జారీ చేసిన లేఖ ద్వారా సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన ఆమోద ప్రక్రియను అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యతా పాతిపదికన పరిశీలించడానికి మూడు నెలలపాటు త్వరిత ఆమోద విధానాన్ని తీసుకొచ్చింది.
· నిత్యావసర వస్తువుల చట్టం 1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సదుపాయాల నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వు 2026ను భారత ప్రభుత్వం 24 మార్చి 2026 నాటి గెజిట్ ద్వారా నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్‌లైన్ల నిర్మాణం, విస్తరణ కోసం ఒక సరళీకృత, సమయపాలనతో కూడిన విధానాన్ని అందిస్తుంది. ఇది భూసేకరణ, అనుమతుల్లో ఎదురయ్యే జాప్యాన్ని నివారిస్తూ, నివాస ప్రాంతాలతో సహా అన్ని చోట్లా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల పీఎన్ జీ వ్యవస్థ అభివృద్ధి వేగవంతం అవ్వడమే కాకుండా.. మారుమూల ప్రాంతాలకు కూడా అనుసంధానం పెరుగుతుంది. ఇది స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, భారత ఇంధన భద్రతను, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
· గృహాలకు అందించే పీఎన్‌జీ కనెక్షన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి, సీజీడీ సంస్థలను ఆదేశించింది. పీఎన్‌జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించేందుకు జాతీయ పీఎన్‌జీ కార్యక్రమం 2.0ను 30 జూన్ 2026 వరకు పొడిగించారు.
· పర్యావరణానికి మేలు చేసే, సురక్షితమైన, స్వయం సమృద్ధి కలిగిన ఇంధన వనరులను పెంచడానికి భారత ప్రభుత్వం రాష్ట్రాల కోసం ఒక నమూనా సీబీజీ విధాన ముసాయిదాను తయారు చేసింది. ఈ నమూనా విధానం రాష్ట్రాలు తమ సొంతంగా పెట్టుబడిదారులకు అనుకూలమైన పద్ధతులను రూపొందించుకోవడానికి ఇది ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. ఏ రాష్ట్రాలైతే ఈ విధానాన్ని అమలు చేస్తాయో, వాటికి అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కోటాను కేటాయించడంలో ప్రాధాన్యత ఇస్తారు.
· పర్యావరణ మంత్రిత్వ శాఖ 07.04.2026 నాటి ఉత్తర్వుల ద్వారా సీజీడీ వ్యవస్థ, మౌలిక సదుపాయాల స్థాపనకు లేదా నిర్వహణకు కేవలం 15 రోజుల్లోనే అనుమతి మంజూరు చేయాలని ఎస్‌పీసీబీ, పీసీసీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది.
· మార్చి 2026 నుంచి ఇప్పటివరకు సుమారు 5.36 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా మొదలైంది. అదనంగా మరో 2.61 లక్షల కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాలను సిద్ధం చేశారు. దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 7.97 లక్షలకు చేరింది. అలాగే కొత్త కనెక్షన్ల కోసం సుమారు 6.05 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు.
· 24 ఏప్రిల్ 2026 నాటికి 42,280 మందికి పైగా పీఎన్‌జీ వినియోగదారులు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా తమ ఎల్‌పీజీ కనెక్షన్లను స్వచ్ఛందంగా వదులుకున్నారు.
ముడి చమురు పరిస్థితి, చమురు శుద్ధి కార్యకలాపాలు
· అన్ని చమురు శుద్ధి కేంద్రాలు తగినంత ముడి చమురు నిల్వలతో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా తగిన స్థాయిలో అందుబాటులో ఉన్నాయి.
· దేశీయ వినియోగానికి మద్దతుగా చమురు శుద్ధి కేంద్రాల నుంచి ఉత్పత్తి పెంచారు.
· దేశీయ మార్కెట్ కోసం పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్ సరఫరా ఉండేలా చూసుకునేందుకు వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన ఒక సంయుక్త కార్యనిర్వాహక బృందం (జేడబ్ల్యూజీ) ఏర్పాటైంది. తదనంతరం కేంద్ర ప్రభుత్వం 01.04.2026 నాటి ఉత్తర్వుల ద్వారా సీహెచ్‌టీ (సెంటర్ ఫర్ హై టెక్నాలజీ) నిర్ణయించిన విధంగా కీలక రంగాలకు కనీస పరిమాణంలో అవసరమైన సీ3, సీ4 స్ట్రీమ్‌లను అందుబాటులో ఉంచడానికి పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లతో సహా చమురు శుద్ధి కంపెనీలకు అనుమతి ఇచ్చింది.
· ఫార్మాస్యూటికల్స్ విభాగం, రసాయనాలు- పెట్రోకెమికల్స్ విభాగం (డీసీపీసీ), పరిశ్రమలు- అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) నుంచి అందిన అభ్యర్థనల ఆధారంగా ఫార్మా, రసాయన రంగ సంస్థలకు ఎల్‌పీజీ పూల్ నుంచి రోజుకు 1000 మెట్రిక్ టన్నుల (ఎంటీ) సరఫరాకు అనుమతినిచ్చారు.
· 2026 ఏప్రిల్ 9 నుంచి ముంబయి, కొచ్చి, విశాఖపట్నం, చెన్నై, మథుర రిఫైనరీలు... రసాయన, ఫార్మా పరిశ్రమలకు 7000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ప్రొపిలీన్ విక్రయించాయి.
రిటైల్ ఇంధన లభ్యత, ధరలు
· దేశవ్యాప్తంగా రిటైల్ విక్రయకేంద్రాలు సాధారణంగా పనిచేస్తున్నాయి.
· మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. అయితే వినియోగదారులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 తగ్గించింది.
· దేశీయ మార్కెట్‌లో ఈ ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం 11.04.2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 55.50కి, ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 42కి పెంచింది.
· వదంతుల కారణంగా కొన్ని రిటైల్ విక్రయకేంద్రాల్లో భయాందోళనతో కూడిన కొనుగోళ్లు జరుగుతున్న విషయం దృష్టిలోకి వచ్చింది. దేశంలోని అన్ని పెట్రోల్ పంపుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. పెట్రోల్, డీజిల్ విషయంలో సాధారణ రిటైల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. పీఎస్‌యూ ఓఎంసీ రిటైల్ విక్రయకేంద్రాల్లో ధరలు ఏమాత్రం పెరగలేదు.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
· సాధారణ కేటాయింపులకు అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 48,000 కిలోలీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.
· 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్‌కేఓ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ఎటువంటి అవసరం లేదని తెలియజేశాయి.
సముద్ర భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
ఆ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ నౌకలు, నావికుల భద్రత కోసం ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ అవసరమైన చర్యలను చేపట్టింది. ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ తెలియజేసిన వివరాలు:
· నావికుల సంక్షేమం, సముద్రయాన కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేలా చూసేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతీయ రాయబార కార్యాలయాలు, సముద్రయాన భాగస్వాములతో మంత్రిత్వ శాఖ సమన్వయం చేసుకుంటూనే ఉంది.
· ఆ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారతీయ జెండా కలిగిన నౌకలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదు.
· డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి 7,553 కాల్స్... 16,033 కంటే ఎక్కువ ఈమెయిల్‌లను స్వీకరించింది. గత 24 గంటల్లోనే 150 కాల్స్, 394 ఈమెయిల్‌లు వచ్చాయి.
· డీజీ షిప్పింగ్ సహాయంతో గల్ఫ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 2,729 మందికి పైగా భారతీయ నావికులు సురక్షితంగా స్వదేశానికి వచ్చారు. గత 24 గంటల్లో 49 మంది భారత్‌కు చేరుకున్నారు.
· దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ సమస్యలు లేవు.
ఈ ప్రాంతంలో భారతీయుల భద్రత
గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆ ప్రాంతంలోని భారతీయుల భద్రత, రక్షణ, సంక్షేమాన్ని నిర్ధారించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు:
· భారతీయ మిషన్లు, పోస్ట్‌లు నిరంతరాయంగా 24 గంటలు హెల్ప్‌లైన్‌లను నిర్వహిస్తున్నాయి. ఇవి భారతీయులకు క్రియాశీలకంగా సహాయం చేస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
· స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన- ప్రయాణ పరిస్థితులు, కాన్సులర్ సేవలు, భారతీయ సమాజానికి మద్దతుగా చేపడుతున్న వివిధ సంక్షేమ చర్యలతో కూడిన సమాచారంతో కూడిన తాజా సూచనలను ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు.
· ఆ ప్రాంతంలోని వివిధ సంఘాలు, సంస్థలు, వృత్తిపరమైన సమూహాలు, భారతీయ కంపెనీలు, ఇతర సంబంధిత వర్గాలతో సహా ప్రవాస సమాజంతో భారతీయ మిషన్లు చురుగ్గా పని చేస్తున్నాయి.
· ఆ ప్రాంతంలో భారతీయ నావికుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. అక్కడ నౌకల్లో ఉన్న భారతీయ సిబ్బందికి భారతీయ మిషన్లు అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నాయి. స్థానిక అధికారులు- ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవడం, కాన్సులర్ సహాయాన్ని అందించడంతో పాటు సిబ్బంది దేశానికి తిరిగి రావడానికి చేస్తున్న అభ్యర్థనలపై పనిచేయటం వంటివి అవి చేస్తున్నాయి.
· ఆ ప్రాంతం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు అదనపు విమానాలు నడుస్తుండటంతో విమాన ప్రయాణ పరిస్థితులు మొత్తం మీద మెరుగుపడుతున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి సుమారు 12,65,000 మంది ప్రయాణికులు అక్కడి నుంచి భారత్‌కు ప్రయాణించారు.
· యూఏఈలో ఉన్న భద్రతా పరమైన అంశాలు, కార్యకలాపాలకు సంబంధించిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యూఏఈ, భారత్ మధ్య పరిమిత సంఖ్యలో వాణిజ్య విమానాలు నడుస్తున్నాయి. నేడు యూఏఈ, భారత్ మధ్య సుమారు 110 విమానాలు నడుస్తాయన్న అంచనా ఉంది.
· సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు విమాన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరవటంతో ఖతార్ ఎయిర్‌వేస్ దేశంలోని వివిధ ప్రాంతాలకు విమానాలను నడుపుతోంది.
· కువైట్ గగనతలం తెరిచి ఉంది. జజీరా ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్ త్వరలో కువైట్ నుంచి భారత్‌కు పరిమితంగా విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించాయి. అవి సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రణాళికేతర వాణిజ్య విమానాలను నడపటాన్ని కొనసాగిస్తున్నాయి.
· బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉంది. బహ్రెయిన్ నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు గల్ఫ్ ఎయిర్ విమానాలను నడుపుతోంది.
· ఇరాక్ గగనతలం తెరిచి ఉంది. అయితే ఈ ప్రాంతంలోని ఇతర గమ్యస్థానాలకు పరిమిత విమాన సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా భారతదేశానికి ప్రయాణించే వెసులుబాటు ఉంది.
· కార్గో, చార్టర్డ్ విమానాల విషయంలో ఇరాన్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. భారతీయులు ఇరాన్‌కు ప్రయాణించొద్దని సూచించారు. ఇప్పటికే అక్కడ ఉన్నవారు మన రాయబార కార్యాలయ సహాయంతో భూమార్గం ద్వారా ఇరాన్ నుంచి దేశం బయటకు రావాలని కోరారు. ఇప్పటివరకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం 2,443 మంది భారతీయులను భూమార్గాల ద్వారా ఇరాన్ నుంచి తరలించడంలో సహాయపడింది.
· ఇజ్రాయెల్: ఇజ్రాయెల్ గగనతలం తెరిచి ఉంది. ఈ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమితంగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా భారతదేశానికి ప్రయాణించే వెసులుబాటు ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2255639)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam