PIB Headquarters
150 సంవత్సరాల వందేమాతరం
ఒక ఉద్యమంగా మారిన గీతం
నాడు పోస్టు చేయడమైనది:
06 NOV 2025 4:25PM by PIB Vijayawada
ముఖ్యాంశాలు
-
1950లో రాజ్యాంగ సభ ద్వారా భారత జాతీయ గీతంగా స్వీకరించబడింది.
-
వందేమాతరం మొదట స్వతంత్రంగా కూర్చబడింది. తరువాత బంకించంద్ర ఛటర్జీ నవల "ఆనందమఠం" (1882లో ప్రచురించబడింది)లో చేర్చబడింది.
-
1896లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారి పాడారు.
-
వందేమాతరం అనే నినాదాన్ని మొదటిసారిగా 1905 ఆగస్టు 7న రాజకీయ నినాదంగా ఉపయోగించారు.
పరిచయం
2025 నవంబర్ 07 నాటికి భారతదేశ జాతీయ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవ పూర్తి చేసుకుంటోంది. వందేమాతరం అంటే "తల్లీ, నేను నీకు నమస్కరిస్తున్నాను". ఈ గీతం అనేక తరాల స్వాతంత్య్ర సమరయోధులు, దేశ నిర్మాతలకు స్ఫూర్తినిచ్చింది, భారతదేశ జాతీయ గుర్తింపు, సామూహిక స్ఫూర్తికి శాశ్వత చిహ్నంగా నిలుస్తుంది. బంకించంద్ర ఛటర్జీ రచించిన 'వందేమాతరం' మొదటిసారిగా 1875 నవంబర్ 7న బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో ప్రచురించారు. తరువాత, బంకించంద్ర ఛటర్జీ ఈ శ్లోకాన్ని 1882లో ప్రముఖ నవల 'ఆనందమఠం'లో చేర్చారు. దీనికి రవీంద్రనాథ్ ఠాగూర్ సంగీతం అందించారు. “వందే మాతరం” భారత దేశ నాగరికత, రాజకీయ, సాంస్కృతిక చైతన్యాల్లో ఒక విడదీయరాని భాగంగా మారింది. ఈ 150వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా మనందరం ఐక్యత, త్యాగం, భక్తి అనే శాశ్వత సందేశాన్ని మరోసారి గుర్తు చేసుకుంటాం — ఇది ప్రతి భారతీయుని హృదయంలో ప్రతిధ్వనించే గీతం.
చారిత్రక నేపథ్యం
“వందే మాతరం” ప్రాధాన్యతను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, దాని చారిత్రక మూలాలను పరిశీలించాలి — అవి సాహిత్యం, జాతీయత, భారత స్వాతంత్ర్య పోరాటం మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని చూపిస్తాయి. ఒక కవితా రచనగా ప్రారంభమైన ఈ గీతం, కాలక్రమేణా భారత జాతీయ గీతంగా మారడం, వలస పాలనకు వ్యతిరేకంగా భారత జనజాగరణకు ప్రతీకగా నిలిచింది.
-
ఈ పాట మొదట 1875లో ప్రచురించారు. 1907 ఏప్రిల్ 16న శ్రీ అరబిందో రాసిన ఆంగ్ల దినపత్రిక “బండేమాతరం” లో రాసిన వ్యాసం. అందులో ఆయన పేర్కొన్నట్లు ముప్పై రెండు సంవత్సరాల క్రితం బంకిం చంద్ర ఛటర్జీ ఈ ప్రసిద్ధ పాటను స్వరపరిచాడు. ఆ సమయంలో కొంతమంది మాత్రమే దానిని గమనించారు. కానీ, తర్వాత ఒక సమయంలో బెంగాల్ ప్రజలు మోసాల నుంచి మేల్కొని సత్యాన్ని వెతుకుతుండగా, ఒక్కసారిగా ఎవరో “బందే మాతరం” అని ఆలపించారు — అదే చరిత్రాత్మక క్షణంగా మారింది.
-
పుస్తక రూపంలో ప్రచురించడానికి ముందు, ఆనంద్ మఠ్ బెంగాలీ మాసపత్రిక బంగదర్శన్‌లో ధారావాహికగా ప్రచురితమైంది, దీనికి బంకిం చంద్ర ఛటర్జీ వ్యవస్థాపక సంపాదకుడు.
-
"వందేమాతరం" పాట 1881 మార్చి-ఏప్రిల్ సంచికలో నవల ధారావాహిక మొదటి భాగంలో కనిపించింది.
-
1907లో, మేడమ్ భికాజీ కామా బెర్లిన్‌లోని స్టట్‌గార్ట్‌లో భారతదేశం వెలుపల మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జెండాపై వందేమాతరం అనే పదాలు రాసి ఉన్నాయి.
ఆనంద మఠం, దేశభక్తి మతం
‘ఆనందమఠం’ నవల యొక్క ప్రధాన కథా వస్తువు “సంతానులు” అని పిలువబడే ఒక సంస్కారవంతమైన సన్యాసుల గుంపు చుట్టూ తిరుగుతుంది. “సంతానులు” అంటే పిల్లలు — వీరు తమ జీవితాన్ని పూర్తిగా తల్లిదేశం సేవకు అంకితం చేసినవారు.
వారు భారతదేశాన్ని తల్లిదేవత రూపంలో ఆరాధిస్తారు. వారి భక్తి, విశ్వాసం అన్నీ తమ జన్మభూమిపైనే కేంద్రీకృతమై ఉంటాయి. "వందేమాతరం" అనేది ఆనంద మఠం సంతానాలు పాడే పాట. ఇది ఆనంద మఠం కేంద్ర ఇతివృత్తమైన "దేశభక్తి మతం" చిహ్నంగా నిలిచింది.
వారి ఆలయంలో,మాతృభూమిని సూచించే తల్లి దేశాన్ని సూచించే మూడు చిత్రాలను ప్రతిష్టించారు. భూతకాలపు తల్లి – ఘనతతో, మహిమాన్వితంగా ఉన్న భారతదేశం.వర్తమాన తల్లి – దారిద్రర్యం, బానిసత్వంలో కూరుకుపోయిన భారత్. భవిష్యత్తు తల్లి – మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందబోయే భారత మాత.
శ్రీ అరబిందో మాటలలో.. “ఆయన దర్శించిన తల్లి, భిక్షపాత్ర పట్టిన బలహీనురాలు కాదు; ఆమె తన డెబ్బై కోట్ల చేతుల్లో ఉక్కు ఖడ్గాలను పట్టుకున్న శక్తివంతురాలు.”
బంకించంద్ర ఛటర్జీ
వందేమాతరం రచయిత బంకించంద్ర ఛటర్జీ (1838–1894) 19వ శతాబ్దపు బెంగాల్‌లోని అత్యంత ప్రముఖ వ్యక్తులలో ఒకరు. పంతొమ్మిదవ శతాబ్దంలో బెంగాల్ మేధో, సాహిత్య చరిత్రలో ఆయన కీలక పాత్ర పోషించారు. నవలా రచయితగా, కవిగా, వ్యాసకర్తగా ఆయన కృషి ఆధునిక బెంగాళీ గద్య భాషా వికాసానికి, భారత జాతీయతా భావం పుట్టుకకు విశేష ప్రభావం చూపింది.
ఆయన రచనలు — ‘ఆనందమఠం’ (1882), ‘దుర్గేశ్‌నందిని’ (1865), ‘కపాలకుందల’ (1866), ‘దేవీ చౌధురాణి’ (1884) — వలస పాలనలో ఉన్న సమాజం ఎదుర్కొన్న సామాజిక, సాంస్కృతిక, నైతిక ప్రశ్నలను ప్రతిబింబిస్తాయి. ఆ కాలపు భారత సమాజం స్వీయ గుర్తింపును వెతుక్కుంటున్నప్పుడు, ఆయన రచనలు ఆ ఆత్మ విమర్శకు దారితీశాయి.
“వందే మాతరం” రచన భారత జాతీయ భావజాల అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా పరిగణించబడుతుంది. ఇది తల్లిదేశం పట్ల భక్తి, ఆధ్యాత్మిక ఆదర్శవాదం అనే రెండింటినీ కలిపిన గీతం. బంకిమ్ చంద్ర చటర్జీ తన రచనల ద్వారా బెంగాళీ సాహిత్యాన్ని మాత్రమే కాకుండా, భారత స్వాతంత్య్రోద్యమానికి బలమైన ఆలోచనా పునాదులు కూడా వేశారు.
“వందే మాతరం”లో ఆయన భారతదేశానికి ఒక దివ్య దృశ్యం ఇచ్చారు — తల్లి దేశం ఒక తల్లిగా రూపాంతరం చెంది, తన సంతానాన్ని మేల్కొలుపుతున్న ఆత్మరూపిణిగా కనిపించేలా.
వందేమాతరం - ప్రతిఘటన గీతం
అక్టోబర్ 1905లో ఉత్తర కలకత్తాలో “బందే మాతరం సంప్రదాయం” (Bande Mataram Sampradaya) అనే సంఘం స్థాపించారు. ఈ సంఘం లక్ష్యం — తల్లిదేశం పట్ల భక్తి, ఆరాధన అనే భావనను ప్రజల్లో నింపడం. ప్రతి ఆదివారం సభ్యులు ప్రభాత ఫేరీల్లో పాల్గొని, “వందే మాతరం” పాడుతూ ప్రజల నుంచి దేశ సేవ కోసం స్వచ్ఛందంగా విరాళాలు స్వీకరించేవారు. ఈ ప్రభాత ఫేరీల్లో కొన్నిసార్లు రబీంద్రనాథ్ టాగోర్ కూడా పాల్గొన్నారు.
1906 మే 20న, నేటి బంగ్లాదేశ్‌లోని బరిసాల్ పట్టణంలో ఒక అభూతపూర్వమైన వందే మాతరం ప్రదర్శన జరిగింది. పది వేలకుపైగా హిందూ, ముస్లిం ప్రజలు కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల్లో వందే మాతరం జెండాలతో ఊరేగింపు నిర్వహించారు.
అదే ఏడాది 1906 ఆగస్టులో బిపిన్ చంద్ర పాల సంపాదకత్వంలో “Bande Mataram” అనే ఆంగ్ల పత్రిక ప్రారంభమైంది. కొద్ది కాలానికే శ్రీ అరవిందుడు కూడా సహ సంపాదకుడిగా చేరారు. ఈ పత్రిక తన తీవ్రమైన సంపాదకీయాల ద్వారా భారతదేశంలో స్వాతంత్య్ర స్ఫూర్తిని వ్యాపింపజేసింది — ఆత్మనిర్భరత, ఐక్యత, రాజకీయ చైతన్యం అనే భావాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లింది.
ఈ పత్రిక భయంలేకుండా జాతీయతవాదాన్ని ప్రచారం చేస్తూ, యువతలో పరాయి పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించే ఉత్సాహాన్ని రగిలించింది. భారత స్వాతంత్ర ఉద్యమానికి ఆ పత్రిక ప్రధాన వేదికగా నిలిచింది.
వందేమాతరం - పాటగా, నినాదంగా మారుతున్న తరుణంలో బ్రిటిష్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ గీతాన్ని, దాని ప్రభావ వ్యాప్తిని అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకుంది. కొత్తగా సృష్టించిన తూర్పు బెంగాల్ ప్రావిన్స్ ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలలో వందేమాతరం పాడటం లేదా నినదించడనాన్ని నిషేధిస్తూ సర్క్యులర్లు జారీ చేసింది. విద్యా సంస్థలను గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. రాజకీయ ఆందోళనల్లో పాల్గొనే విద్యార్థులను ప్రభుత్వ సేవల నుంచి బహిష్కరిస్తామని బెదిరించారు.
1905 నవంబర్‌లో, బెంగాల్‌లోని రంగ్‌పూర్‌లోని ఒక పాఠశాలలో 200 మంది విద్యార్థులు వందేమాతరం పాడినందుకు దోషులుగా తేల్చి, ఒక్కొక్కరికి రూ. 5 జరిమానా విధించారు. రంగ్‌పూర్‌లో, ప్రముఖ విభజన వ్యతిరేక నాయకులు ప్రత్యేక కానిస్టేబుళ్లుగా పనిచేయాలని, వందేమాతరం పాడకుండా నిరోధించాలని ఆదేశించారు. 1906 నవంబర్‌లో, మహారాష్ట్రలోని ధూలియా పట్టణంలో జరిగిన భారీ సమావేశంలో “వందే మాతరం” నినాదాలు ప్రతిధ్వనించాయి.
1908లో, బెలగావి (కర్ణాటక)లో, లోకమాన్య తిలక్ను మండలే (బర్మా)కి తరలిస్తున్న రోజున, పోలీసులు వందే మాతరం నినదించిన యువకులను కొట్టి, అనేక మందిని అరెస్టు చేశారు — ఆ నినాదం నిషేధించిన ప్రభుత్వ ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు.
ఇలా, “వందే మాతరం” కేవలం ఒక గీతం కాదు — అది భారత స్వాతంత్య్ర సమరానికి ప్రేరణనిచ్చిన యుద్ధ గర్జనగా మారింది.
పునరుజ్జీవ జాతీయవాదం కోసం యుద్ధ కేకలు
"వందేమాతరం" పాట భారతదేశ స్వాతంత్య్ర పోరాట చిహ్నంగా మారింది, ఇది స్వపరిపాలన కోసం సమష్టి ఆకాంక్షను, ప్రజలకు,. వారి మాతృభూమికి మధ్య ఉన్న భావోద్వేగ సంబంధాన్ని సంగ్రహించింది. స్వదేశీ, బెంగాళ్ విభజన వ్యతిరేక ఉద్యమాలలో మొదట ప్రజాదరణ పొందింది. ఇది త్వరలోనే ప్రాంతీయ అడ్డంకులను దాటి జాతీయతను మేల్కొలిపే గీతంగా మారింది. బెంగాల్ వీధుల నుంచి బొంబాయి కేంద్రం, పంజాబ్ మైదానాల వరకు "వందే మాతరం" ధ్వని ప్రతిధ్వనించింది. వలోనియల్ పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటన చిహ్నంగా ప్రతిధ్వనించింది. దాని పాడటాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రయత్నాలు దాని దేశభక్తి ప్రాముఖ్యతను మరింత పెంచాయి. ఇది కులం, మతం, భాషలను దాటి వ్యక్తులను ఐక్యం చేసే నైతిక శక్తిగా మారింది. నాయకులు, విద్యార్థులు, విప్లవకారులు దాని పద్యాల నుంచి ప్రేరణ పొందారు. వారు దానిని రాజకీయ సమావేశాలలో, ప్రదర్శనలలో, జైలుకు వెళ్లే ముందు దీనిని ఆలపించారు. ఈ రచన ప్రతిఘటనలను ప్రేరేపించడమే కాకుండా, ఉద్యమానికి సాంస్కృతిక గర్వం, ఆధ్యాత్మిక ఉద్వేగాన్ని అందించింది. భారత స్వాతంత్ర్య పథానికి భావోద్వేగ పునాదిని ఏర్పరిచింది.
"వందే మాతరం" 19వ శతాబ్దం చివరి, 20వ శతాబ్దం మొదట్లో ఉదయిస్తున్న భారతీయ జాతీయవాదానికి సమ్మేళన నినాదంగా మారింది.
1896లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ "వందే మాతరం" పాడారు.
1905లోని కల్లోల దినాల్లో బెంగాల్‌లో బంగాళ్ విభజన వ్యతిరేక, స్వదేశీ ఉద్యమంలో ఈ పాట ఆకర్షణ, "వందే మాతరం" నినాదం అత్యంత శక్తివంతంగా మారాయి.
అదే సంవత్సరం వారణాసిలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో "వందే మాతరం" పాటను అఖిల భారత సందర్భాలకు అనుసరించేలా ఆమోదించారు.
"వందే మాతరం" అనే రాజకీయ నినాదం మొదట 1905 ఆగస్టు 7న వినిపించింది. అప్పుడు అన్ని సముదాయాలను ప్రతినిధీకరించే వేలాది విద్యార్థులు "వందే మాతరం", ఇతర నినాదాలతో ఆకాశాన్ని కంపించుస్తూ కలకత్తా (కోల్‌కతా) టౌన్ హాల్ వైపు ఊరేగింపుగా సాగారు. ఆ ఐతిహాసిక సమావేశంలో విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ ప్రతిజ్ఞ తీర్మానం ఆమోదించారు. ఇది బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమానికి ఆరంభ సంకేతంగా నిలిచింది. బెంగాల్‌లో జరిగిన ఈ సంఘటనలు మొత్తం దేశాన్ని వెలుగులతో నింపాయి.
1906 ఏప్రిల్‌లో, కొత్తగా ఏర్పడిన తూర్పు బెంగాల్ ప్రావిన్స్‌లోని బరిసాల్‌లో జరిగిన బెంగాల్ ప్రావిన్షియల్ కాన్ఫరెన్స్ సమయంలో బ్రిటిష్ అధికారులు “వందే మాతరం” నినాదాన్ని బహిరంగంగా పలకరించడం నిషేధించారు. చివరికి సమావేశాన్ని కూడా రద్దు చేశారు. కానీ ఆదేశాలను ధిక్కరించి ప్రతినిధులు “వందే మాతరం” అంటూ నినదించారు. పోలీసుల తీవ్ర దాడులు ఎదురైనా, వారు వెనక్కి తగ్గలేదు.
1907 మేలో, లాహోర్‌లో ఒక యువకుల గుంపు రావల్పిండి వద్ద స్వదేశీ నాయకుల అరెస్టును ఖండిస్తూ, బ్రిటిష్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ “వందే మాతరం” నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. కాలనీయ ప్రభుత్వ పోలీసులు ఆందోళనను క్రూరంగా అణచివేశారు. అయినప్పటికీ, యువత భయం లేకుండా చేసిన “వందే మాతరం” నినాదాలు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న స్వాతంత్య్ర స్పూర్తికి ప్రతీకగా నిలిచాయి
1908 ఫిబ్రవరి 27న, టుటికోరిన్ (తమిళనాడు)లోని కోరల్ మిల్స్‌కు చెందిన దాదాపు వెయ్యి మంది కార్మికులు స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీకి సంఘీభావంగా, అధికారుల అణచివేత చర్యలకు వ్యతిరేకంగా సమ్మె చేశారు. నిరసన, దేశభక్తికి చిహ్నంగా వందేమాతరం పాడుతూరాత్రి పొద్దుపోయే వరకు వీధుల గుండా కవాతు చేశారు.
1908 జూన్‌లో, లోకమాన్య తిలక్‌పై బాంబే పోలీస్ కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు, వేలాది మంది ప్రజలు బయట గుమికూడి “వందే మాతరం” పాట పాడారు. ఆ సమూహం ఏకస్వరం దేశభక్తి జ్వాలను వెలిగించింది. అనంతరం, 1914 జూన్ 21న తిలక్ జైలు నుంచి విడుదలై పూణేకు చేరుకున్నప్పుడు, ఆయనకు స్వాగతం చెప్పడానికి వచ్చిన వేలాది మంది ప్రజలు “వందే మాతరం” నినాదాలతో నగరాన్ని మార్మోగించారు. ఆయన కూర్చున్న తర్వాత కూడా జనసమూహం నినాదాలతో ప్రాంగణం మారుమ్రోగుతూనే ఉంది.
విదేశాల్లోని భారతీయ విప్లవకారులపై ప్రభావం
-
1907లో, మేడమ్ భికాజీ కామా బెర్లిన్‌లోని స్టట్‌గార్ట్‌లో భారతదేశం వెలుపల మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జెండాపై "వందేమాతరం" అనే పదాలు రాసి ఉన్నాయి.
-
1909 ఆగస్టు 17న, మదన్ లాల్ ధింజారాను ఇంగ్లాండ్‌లో ఉరితీసినప్పుడు, ఉరిశిక్షకు ముందు ఆయన పలికిన చివరి మాటలు "బందేమాతరం".
-
1909లో, పారిస్‌లోని భారతీయ దేశభక్తులు జెనీవా నుంచి బందేమాతరం అనే పత్రిక ప్రచురణను చేపట్టారు.
-
1912 అక్టోబర్‌లో, గోపాల కృష్ణ గోఖలే దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌కు వచ్చినప్పుడు, 'వందేమాతరం' నినాదాలతో కూడిన గొప్ప ఊరేగింపు ఆయనకు స్వాగతం పలికింది.
జాతీయ హోదా
జన గణ మన, వందేమాతరం రెండింటినీ జాతీయ చిహ్నాలుగా స్వీకరించడంపై రాజ్యాంగ సభలో సంపూర్ణ ఏకగ్రీవ అభిప్రాయం వ్యక్తమైంది. ఈ అంశంపై ఎటువంటి చర్చ జరగలేదు. 1950 జనవరి 24న, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభలో ప్రసంగిస్తూ, స్వాతంత్య్ర ఉద్యమంలో దాని ముఖ్యమైన పాత్ర కారణంగా, వందేమాతరం జాతీయ గీతం, జన గణ మనతో సమానమైన హోదాను కలిగి ఉండాలని, దానిని సమానంగా గౌరవించాలని అన్నారు. ఇంకా ఇలా అన్నారు.. చర్చకు పెండింగ్‌లో ఉన్న ఒక విషయం ఉంది. అది జాతీయ గీతం ప్రశ్న. ఒకానొక సమయంలో ఈ విషయాన్ని సభ ముందు తీసుకొచ్చి తీర్మానం ద్వారా నిర్ణయం తీసుకోవచ్చని అనుకున్నాం. కానీ తీర్మానం ద్వారా అధికారిక నిర్ణయం తీసుకోవడం కంటే నేను జాతీయ గీతం గురించి ఒక ప్రకటన చేయడం మంచిదని భావించాం. అందుకే ఈ ప్రకటన చేస్తున్నాను".
జన గణ మన అని పిలువబడే పదాలు, సంగీతంతో కూడిన కూర్పు భారతదేశ జాతీయ గీతం, ప్రభుత్వం సందర్భాన్ని బట్టి పదాలలో మార్పులకు లోబడి ఉంటుంది; భారత స్వాతంత్య్ర పోరాటంలో చారిత్రాత్మక పాత్ర పోషించిన వందేమాతరం పాటను జన గణ మనతో సమానంగా గౌరవిస్తారు. దానితో సమాన హోదాను కలిగి ఉంటారు. ఇది సభ్యులను సంతృప్తిపరుస్తుందని నేను ఆశిస్తున్నాను.
ఆయన ప్రకటనకు ఆమోదం లభించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ జన-గణ-మన ను స్వతంత్ర భారతదేశ జాతీయ గీతంగా స్వీకరించడంతో పాటు, బంకిం వందేమాతరం ను జన-గణ-మనతో సమాన హోదాతో జాతీయ గీతంగా స్వీకరించారు.
వందేమాతరం 150 సంవత్సరాల జ్ఞాపకార్థం
దేశం వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా, భారతదేశం అంతటా దాని శాశ్వత వారసత్వాన్ని ఐక్యత, ప్రతిఘటన, జాతీయ గర్వం కారణమైన పాటగా గౌరవించడానికి స్మారక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ పాట చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను తిరిగి సందర్శించడానికి సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, విద్యా కేంద్రాలు సెమినార్లు, ప్రదర్శనలు, సంగీత ప్రదర్శనలు, బహిరంగ ఆలాపనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
భారత ప్రభుత్వం దీనిని నాలుగు దశల్లో జరుపుకుంటుంది.
కొన్ని కార్యకలాపాలు క్రింద ఇవ్వబడ్డాయి.
07 నవంబర్ 2025
-
దిల్లీలో (ఇందిరా గాంధీ స్టేడియం) జరగనున్న జాతీయ స్థాయి సంస్మరణ కార్యక్రమం.
-
నవంబర్ 7న తహసీల్ స్థాయి వరకు దేశవ్యాప్తంగా విస్తృత ప్రజా భాగస్వామ్యంతో వీఐపీ కార్యక్రమాలు జరుగుతాయి.
-
జాతీయ కార్యక్రమంలో స్మారక స్టాంపు, నాణెం విడుదల చేస్తారు.
-
వందేమాతరం చరిత్రపై ఒక ప్రదర్శన నిర్వహించనున్నారు. ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శిస్తారు.
-
ప్రతి అధికారిక కార్యక్రమంలో స్టాంపు, నాణేల విడుదల చిత్రాలను ప్రదర్శిస్తారు.
-
ఈవెంట్‌ల ఫోటోలు, వీడియోలు ప్రచార వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.
-
జాతీయ స్థాయిలో, ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ గాయకులు వందేమాతరం గీతం విభిన్న అనుసరణలను ప్రదర్శిస్తారు.
సంవత్సరం పొడవునా కార్యకలాపాలు
-
ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, FM రేడియో ప్రచారంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి
-
టైర్ 2, 3 నగరాల్లో వందేమాతరం పై ప్యానెల్ చర్చలు, సంభాషణలను PIB నిర్వహించాలి.
-
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భారతీయ మిషన్లు, పోస్టులలో వందేమాతరం స్ఫూర్తికి అంకితమైన సాంస్కృతిక సాయంత్రం నిర్వహించాలి.
-
వందేమాతరం స్ఫూర్తికి అంకితమైన ప్రపంచ సంగీత ఉత్సవం నిర్వహించాలి.
-
వందేమాతరం: భూమి మాతకు వందనం -చెట్ల పెంపకం డ్రైవ్‌లు నిర్వహించాలి.
-
దేశభక్తి కుడ్యచిత్రాలను రూపొందించి రహదారులపై ప్రదర్శించాలి.
-
ఆడియో సందేశాలు, ప్రత్యేక ప్రకటనలు చేయాలి. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలలో LED డిస్ప్లేలు వందేమాతరం గురించి సమాచారాన్ని ప్రదర్శించాలి.
ప్రత్యేక కార్యకలాపాలు
-
వందేమాతరం వివిధ కోణాలపై, బంకించంద్ర ఛటర్జీ జీవిత కథ, స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం పాత్ర, భారతదేశ చరిత్రను రూపొందించడం, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడంపై ఒక్కొక్క నిమిషం నిడివి గల 25 సినిమాలు.
-
దేశభక్తి శక్తిని ప్రసారం చేయడానికి, వందేమాతరం ప్రచారం, హర్ ఘర్ తిరంగ ప్రచారం ఏకకాలంలో జరుపుకుంటారు.
ఈ కార్యక్రమాలు బంకిం చంద్ర చటోపాధ్యాయ కాలాతీత సృష్టికి నివాళి అర్పించడమే కాకుండా, స్వాతంత్య్ర పోరాటంలో తరాలకు స్ఫూర్తినిచ్చే పాత్రను కూడా హైలైట్ చేస్తాయి. ఈ వేడుకల ద్వారా, వందేమాతరం స్ఫూర్తిని సమకాలీన భారతదేశం కోసం తిరిగి అర్థం చేసుకుంటున్నారు - దేశం గర్వించదగిన గతాన్ని ఐక్యమైన, స్వావలంబన, సాంస్కృతికంగా శక్తివంతమైన భవిష్యత్తు కోసం దాని ఆకాంక్షలతో అనుసంధానిస్తున్నారు.
ముగింపు
వందేమాతరం 150 సంవత్సరాల జ్ఞాపకార్థం భారతదేశ జాతీయ గుర్తింపు పరిణామంలో పాటలోతైన చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటి మేధో, సాహిత్య వాతావరణం నుంచి ఉద్భవించిన వందేమాతరం, దాని సాహిత్య మూలాలను అధిగమించి వలసవాద వ్యతిరేక ప్రతిఘటన, సామూహిక ఆకాంక్షకు శక్తివంతమైన చిహ్నంగా మారింది. ప్రస్తుత ఆచారం బంకిం చంద్ర చటోపాధ్యాయ దార్శనికతకు శాశ్వత ఔచిత్యాన్ని పునరుద్ఘాటించడమే కాకుండా, ఆధునిక భారతదేశంలో జాతీయవాదం, ఐక్యత, సాంస్కృతిక స్వీయ-అవగాహనపై చర్చను రూపొందించడంలో పాట పాత్రపై కొత్త ప్రతిబింబాన్ని కూడా ఆహ్వానిస్తుంది.
ప్రస్తావనలు:
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
https://indianculture.gov.in/digital-district-repository/district-repository/vande-mataram-nationalist-artwork
https://knowindia.india.gov.in/national-identity-elements/national-song.php
https://www.abhilekh-patal.in/Category/Search/QuerySearch?query=vande%20mataram
https://indianculture.gov.in/node/2820573
https://amritkaal.nic.in/vande-mataram
పత్రికా సమాచార కార్యాలయం:
PIB Archives https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2024/nov/doc20241125450301.pdf
https://www.pib.gov.in/newsite/erelcontent.aspx?relid=11804
(రిలీజ్ ఐడి: 2255189)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10