ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్‌లో రోడ్డు దుర్ఘటన.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
23 APR 2026 2:34PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్.. మీర్జాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయిన కుటంబాలకు ప్రధాని సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున, గాయపడిన వారికి రూ.50,000 వంతున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘ఉత్తరప్రదేశ్.. మీర్జాపూర్‌లో రోడ్డు దుర్ఘటన కారణంగా ప్రాణనష్టం జరిగిందని తెలిసి, నేను ఎంతో బాధపడ్డాను. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
దుర్ఘటనలో మరణించిన వారి దగ్గరి సంబంధికులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను ఇస్తారు. గాయపడిన వారికి రూ.50,000 అందిస్తారు’’.
***
(రిలీజ్ ఐడి: 2254860)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam