ప్రధాన మంత్రి కార్యాలయం
'ముండియల్ డో కీజో డో బ్రెజిల్ 2026'లో భారతీయ జున్ను తయారీదారులు సాధించిన విజయం పట్ల అభినందనలు తెలియజేసిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
22 APR 2026 9:02PM by PIB Hyderabad
జున్ను, పాడి ఉత్పత్తులకు సంబంధించి జరిగే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీ 'ముండియల్ డో కీజో డో బ్రెజిల్ 2026'లో భారతీయ జున్ను తయారీదారులు సాధించిన విజయం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇందులో 1 సూపర్ స్వర్ణం, 2 స్వర్ణం, 1 రజతంతో సహా మొత్తం నాలుగు భారతీయ ఉత్పత్తులు పతకాలను గెలుచుకున్నాయి.
"సూపర్ స్వర్ణాన్ని ఎలెఫ్తేరియా గుల్మార్గ్ (బ్రీ స్టైల్) గెలుచుకోగా.. యాక్ చుర్పి-సాఫ్ట్ (నార్డిక్ ఫార్మ్, లేహ్, లడఖ్), ఎలెఫ్తేరియా బ్రునోస్ట్ (వే చీజ్) స్వర్ణ పతాకాలను సాధించాయి. అలాగే ఎలెఫ్తేరియా కాళీ మిరి (బెల్పార్ నోల్ స్టైల్) రజతాన్ని కైవసం చేసుకుంది" అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
మౌసం నారంగ్, తెన్లే నూర్బుతో సహా అవార్డు విజేతల కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఇటువంటి విజయాలు భారతదేశపు సంప్రదాయ పాడి పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గుర్తింపును ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
"భారతదేశపు జున్ను ప్రపంచవ్యాప్తంగా ముద్ర వేస్తోంది...
జున్ను, పాడి ఉత్పత్తుల విషయంలో జరిగే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీ 'ముండియల్ డో కీజో డో బ్రెజిల్ 2026'లో భారత్ అద్భుతమైన ఆరంగేట్రం చేసింది. ఇందులో 1 సూపర్ స్వర్ణం, 2 స్వర్ణం, 1 రజతంతో సహా మొత్తం నాలుగు భారతీయ ఉత్పత్తులు పతకాలను కైవసం చేసుకున్నాయి.
సూపర్ స్వర్ణాన్ని ఎలెఫ్తేరియా గుల్మార్గ్ (బ్రీ స్టైల్) గెలుచుకోగా.. యాక్ చుర్పి-సాఫ్ట్ (నార్డిక్ ఫార్మ్, లేహ్, లడఖ్), ఎలెఫ్తేరియా బ్రునోస్ట్ (వే చీజ్) స్వర్ణ పతాకాలను సాధించాయి. అలాగే ఎలెఫ్తేరియా కాళీ మిరి (బెల్పార్ నోల్ స్టైల్) రజతాన్ని కైవసం చేసుకుంది.
ఇటువంటి విజయాలు ప్రపంచ వేదికపై భారతదేశపు సంప్రదాయ పాడి పరిశ్రమను బలోపేతం చేస్తాయి."
***
(రిలీజ్ ఐడి: 2254720)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Malayalam