వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ సముద్ర ఆహారోత్పాదనల ఎగుమతులు రూ.72,000 కోట్లు… గరిష్ఠ స్థాయికి చేరిక


భారత రికార్డు స్థాయి సముద్ర ఆహారోత్పాదనల ఎగుమతుల్లో ఘనీభూత ఖాద్య చిన్నరొయ్యల వాటా రూ.47,973 కోట్లు

నాడు పోస్టు చేయడమైనది: 21 APR 2026 8:04PM by PIB Hyderabad

భారత్ సముద్ర సంబంధి ఆహార ఉత్పాదనల ఎగుమతులు (సీఫూడ్ ఎక్స్‌పోర్ట్‌స్) 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.72,325.82 కోట్లకు (8.28 బిలియన్ అమెరికా డాలర్ల)కు చేరి రికార్డును సృష్టించాయని ఎంపీఈడీఏ విడుదల చేసిన తాత్కాలిక సమాచారం వెల్లడించిందిసముద్ర సంబంధి ఆహారోత్పాదనల ఎగుమతులు 19.32 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్నట్లు ఈ డేటా పేర్కొంది.

ఈ వృద్ధిలో ఘనీభూత ఖాద్య చిన్నరొయ్యలు (ఫ్రోజెన్ శ్రింప్ప్రధాన పాత్రను పోషించాయిఇవి రూ.47,973.13 కోట్ల (5.51 బిలియన్ అమెరికా డాలర్లమేరకు ఉండిమొత్తం ఎగుమతుల ఆదాయంలో మూడింట రెండు వంతులకు పైగా లెక్కకు వచ్చాయిచిన్నరొయ్య ఎగుమతులు విలువ పరంగా చూసినప్పుడు 6.35 శాతంపరిమాణం పరంగా చూసినప్పుడు 4.6 శాతం వృద్ధి చెందిభారత సముద్ర సంబంధి ఉత్పాదనల ఎగుమతుల్లో తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాయి.

మరే ఇతర దేశం కన్న అమెరికాకు ఎక్కువగా ఎగుమతులు చోటుచేసుకున్నాయి. అక్కడికి దిగుమతి చేసిన సరకుల విలువ 2.32 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉందిఏమైనాఅమెరికాకు పంపుతున్న సరకులో రాశి పరంగా 19.8 శాతం తగ్గుదలవిలువ పరంగా 14.5 శాతం తగ్గుదల నమోదయ్యాయిఇది రెండు దేశాలూ పరస్పరం అమలు చేస్తున్న సుంకాల ప్రభావాన్ని పట్టి చూపుతోంది.

చైనాయూరోపియన్ యూనియన్ (ఈయూ), ఆగ్నేయ ఆసియా దేశాల వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లలో వృద్ధి బలంగా ఉండడం ఈ క్షీణతను చాలా వరకూ భర్తీ చేసిందిచైనాకు ఎగుమతులు 22.7 శాతం మేర పెరిగిఆ దేశం రెండో అతి పెద్ద ఎగుమతిదారు దేశంగా నిలిచిందిచైనాకు ఎగుమతులు విలువ పరంగా చూసినప్పుడు 22.7 శాతం మేరరాశి పరంగా చూసినప్పుడు 35.2 శాతం మేర పెరిగాయిఈయూ కూడా బలమైన వృద్ధిని చూపిందిఈయూకు ఎగుమతులు 37.9 శాతం మేరరాశి పరంగా 35.2 శాతం మేర పెరిగాయిఆగ్నేయ ఆసియాలో కూడా చెప్పుకోదగిన విస్తరణ చోటు చేసుకుందిఅక్కడ వృద్ధి విలువ పరంగా 36.1 శాతంరాశి పరంగా 28.2 శాతం మేరకు ఉందిజపాన్‌కు ఎగుమతులు విలువ పరంగా చూసినప్పుడు 6.55 శాతం అధికమయ్యాయిపశ్చిమ ఆసియాలో ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నెలకున్న అనిశ్చిత వల్ల ఆ ప్రాంత దేశాలకు ఎగుమతుల్లో 0.55 శాతం నామమాత్ర క్షీణత కనిపించింది.

అనేక మార్కెట్లలో వృద్ధి రెండు అంకెల స్థాయిలో నమోదైందిఇది సాంప్రదాయిక మార్కెట్ల సవాళ్ల నేపథ్యంలో కొత్త మార్కెట్లను చేరుకున్నట్లయింది.

ఉత్పాదనల విషయానికి వస్తే.. ఘనీభూత చేపలుస్క్విడ్కటిల్‌ఫిష్ఎండబెట్టిన ఆహార పదార్థాలుజీవిత ఉత్పాదనల ఎగుమతుల్లో సానుకూల వృద్ధి చోటుచేసుకుందిమరోవైపుచల్లని ఉత్పాదనలు మాత్రం క్షీణించాయిసురిమీచేపల భోజనంచేప నూనెల ఎగుమతులు మెరుగయ్యాయిఆధునిక రవాణా వ్యవస్థ పరంగా గమనించగాఅయిదు అగ్రగామి ఓడరేవులైన.. వైజాగ్జేఎన్‌పీటీకోచికోల్‌కతాచెన్నై నుంచి మొత్తం ఎగుమతుల విలువ దాదాపు 64 శాతంగా ఉందిఇది భారత సముద్ర ఆహారోత్పాదనల ఎగుమతి ప్రధాన సరఫరాల వ్యవస్థలో ఆయా ఓడరేవుల నిరంతర ప్రాధాన్యాన్ని చాటిచెబుతోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2254493) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , Bengali-TR , English , Urdu , हिन्दी , Marathi , Malayalam