ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళనాడు... కరూర్‌లో ఓ రాజకీయ ర్యాలీ సమయంలో జరిగిన దురదృష్టకర ఘటనలో మృతి చెందిన వారికి ప్రధాని సంతాపం
प्रविष्टि तिथि:
27 SEP 2025 10:07PM by PIB Hyderabad
తమిళనాడులోని కరూర్లో ఈ రోజు ఒక రాజకీయ ర్యాలీ సమయంలో జరిగిన దురదృష్టకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు దేశం సంఘీభావంగా నిలుస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. వారికి అవసరమైన చేయూతనూ, సాయాన్నీ ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన వేర్వేరు పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“తమిళనాడులోని కరూర్‌లో రాజకీయ ర్యాలీ సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటన అత్యంత విచారకరం. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్ట సమయంలో వారికి మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నాను. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.”
(रिलीज़ आईडी: 2254483)
आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam