ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రగతిపథంలో మార్గదర్శకత్వం వహించే శుభకర ఆలోచనలను
చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
13 MAR 2026 11:22AM by PIB Hyderabad
ప్రగతిపథాన సాగడానికి మార్గదర్శిగా నిలిచే శుభకర ఆలోచనలను చాటిచెబుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు..:
‘‘ఆ నో భద్రాః క్రతవో యన్తు విశ్వతోదబ్ధాసో అపరీతాస ఉద్భిదః
దేవా నో యథా సదమిద్ వృధే అసన్నప్రాయువో రక్షితారో దివే దివే’’.
శుభప్రద, స్ఫూర్తిప్రదాయక ఆలోచనలు అన్ని వైపుల నుంచి మనను చేరుకోవాలిగాక. అలాంటి ఆలోచనలు మనకు ఉత్సాహాన్నీ, శక్తినీ, ముందడుగు వేసేందుకు బలాన్నీ అందించు గాక. ఆ ఆలోచనలు దృఢమై, అజేయమై, ప్రగతి మార్గాన్ని తెరిచేవిగా ఉండు గాక. దివ్య శక్తులు మన జీవితంలో ప్రతి రోజూ అభివృద్ధినీ, ఉన్నతినీ, సరికొత్త ఉత్సాహాన్నీ సమకూర్చడంతో పాటు, అనుదినమూ మనను రక్షిస్తూ మనం ముందడుగు వేసేటట్లు మనలో స్ఫూర్తిని రగిలించు గాక అని ఈ సుభాషితం చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘ఆ నో భద్రాః క్రతవో యన్తు విశ్వతోదబ్ధాసో అపరీతాస ఉద్భిదః
దేవా నో యథా సదమిద్ వృధే అసన్నప్రాయువో రక్షితారో దివే దివే’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2254408)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam