ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫ్రెంచ్ అధ్యక్షునికి స్వాగతం పలికిన ప్రధానమంత్రి: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రాధాన్యం

నాడు పోస్టు చేయడమైనది: 17 FEB 2026 9:57AM by PIB Hyderabad

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు. ఆయన పర్యటన భారత్-ఫ్రాన్స్ సంబంధాలను నూతన శిఖరాలకు చేరుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ పర్యటనకున్న ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి వివరిస్తూ.. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ముంబయి, ఢిల్లీలో జరిగే చర్చలు కొత్త వేగాన్ని అందిస్తాయన్నారు. ఈ సహకారం రెండు దేశాలకు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుందని తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా రాశారు:
‘‘
భారత్‌కు స్వాగతం!

మీ పర్యటన కోసం, మన ద్వైపాక్షిక సంబంధాలను నూతన శిఖరాలకు చేర్చడం కోసం భారత్ ఎదురు చూస్తోంది. మన చర్చలు వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని, ప్రపంచ వృద్ధికి తోడ్పడతాయని విశ్వసిస్తున్నాను.
మొదట ముంబయిలో, ఆ తర్వాత ఢిల్లీలో కలుద్దాం మిత్రమా @EmmanuelMacron’’


 

"భారతదేశానికి స్వాగతం!

మీ పర్యటనను భారతదేశం మనస్ఫూర్తిగా స్వాగతిస్తోంది. ఈ పర్యటన మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత వేగాన్ని జోడిస్తుంది. మన చర్చలు వివిధ రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని, ప్రపంచ పురోగతికి దోహదపడతాయని విశ్వసిస్తున్నాను.

నా ప్రియ మిత్రమా @EmmanuelMacron, తొలుత ముంబైలో, ఆ తర్వాత ఢిల్లీలో కలుద్దాం."


(రిలీజ్ ఐడి: 2254254) సందర్శకుల సూచీ సంఖ్య : : 41