ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజ్యసభ ఎంపీగా శ్రీ నితీష్ కుమార్ ప్రమాణం.. ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 10 APR 2026 2:07PM by PIB Hyderabad

రాజ్యసభ సభ్యునిగా శ్రీ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు.

దేశంలో అత్యంత అనుభవం ఉన్న నేతలలో శ్రీ నితీష్ కుమార్ ఒకరనీసుపరిపాలన పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతబీహార్ అభివృద్ధికి ఆయన అందించిన సుస్థిర తోడ్పాటు అందరికీ తెలుసుననీ ప్రధానమంత్రి అన్నారుఆయన మళ్లీ పార్లమెంటుకు రావడం సంతోషంగా ఉందనీఒక అనుభవజ్ఞ‌ుడైన చట్టసభ సభ్యుడుగాకేంద్ర మాజీ మంత్రిగా ఆయనకున్న అపార అనుభవం సభ గౌరవాన్ని పెంచుతుందని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,

‘‘నితీష్ కుమార్ గారు దేశంలో అందరి కన్నా ఎక్కువ అనుభవం ఉన్న నేతలలో ఒకరుసుపరిపాలనను అందించడం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత సర్వత్రా ప్రశంసలందుకుందిఆయన బీహార్ అభివృద్ధికి ఎనలేని తోడ్పాటును అందించారుఆయనను మరోసారి పార్లమెంటులో చూసి... ఎంతో సంతోషం కలిగిందిపార్లమెంట్ సభ్యునిగానూకేంద్ర మంత్రిగానూ అనేక సంవత్సరాల పాటు ఆయన సేవలు అందించారుఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పార్లమెంట్ గౌరవం మరింత పెరుగుతుందని నాకు పూర్తి నమ్మకం ఉందిరాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేసిన సందర్భంగా ఆయనకు నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. ఆయన భావి పదవీకాలం ఫలప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2254236) సందర్శకుల సూచీ సంఖ్య : : 4