ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అభివృద్ధి చెందిన భారత్‌కు పునాది దేశ సేవేనని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 21 APR 2026 11:54AM by PIB Hyderabad

దేశానికి సేవ చేయడం ‘అభివృద్ధి చెందిన భారత్’కు పునాది వేయడమే అవుతుందని చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారువ్యవస్థలో ఆఖరి అంచెలో ఉన్న వారిని కూడా అభివృద్ధి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చి సాధికారత కలిగినసమృద్ధదయాపూరిత భారత్ నిర్మాణానికి దోహదపడతాం అనే మన నిబద్ధతను మరోసారి స్పష్టం చేద్దాం.. రండి అంటూ శ్రీ మోదీ.. పౌరసేవల దినోత్సవం సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

‘‘శీలం పరహితాసక్తిః అనుత్సేకః క్షమా ధృతిః

అలోభశ్చేతి విద్యాయాః పరిపాకోంచలం ఫలమ్’’.

సచ్ఛీలంపరోపకార బుద్ధిఅణకువక్షమఓర్పుఅత్యాశకు పోకుండా ఉండడం.. ఇవన్నీ జ్ఞాన పరిపూర్ణతను అందించే మంచి రుచికర ఫలాలు అని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -

‘‘దేశసేవే ‘వికసిత్ భారత్’కు పునాదిసివిల్ సర్వీసెస్ డే... సందర్భంగా ‘‘రండిచివరి వరుసలో నిలబడిన వ్యక్తిని కూడా అభివృద్ధి ప్రధాన స్రవంతితో జోడించి సాధికారత కలిగినసమృద్ధకరుణామయ భరతవర్షాన్ని తీర్చిదిద్దాలన్న మన సంకల్పాన్ని పునరుద్ఘాటిద్దాం’’ అని పిలుపునిచ్చారు.

‘‘శీలం పరహితాసక్తిః అనుత్సేకః క్షమా ధృతిః

అలోభశ్చేతి విద్యాయాః పరిపాకోంచలం ఫలమ్’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2254062) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam