భారత ఎన్నికల సంఘం
సాధారణ, ఉప ఎన్నికలు: తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రూ.865 కోట్లకుపైగా స్వాధీనం
నాడు పోస్టు చేయడమైనది:
17 APR 2026 4:37PM by PIB Hyderabad
· అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసనసభల సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 15న భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ) కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలను ఎన్నికల సంఘం ఆదేశించింది.
· ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి సరిహద్దు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు, ప్రధాన ఎన్నికల అధికారులు, డీజీపీలు, చట్ట అమలు సంస్థల అధిపతులు, ఇతర ఉన్నతాధికారులతో భారత ఎన్నికల సంఘం ఇప్పటికే పలు సమీక్షా సమావేశాలు నిర్వహించింది. హింస, బెదిరింపులు, ప్రలోభాలకు తావులేని విధంగా ఎన్నికలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.
· దీనిని పర్యవేక్షించేందుకు ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోపు స్పందించడానికి పశ్చిమ బెంగాల్ (2,728), తమిళనాడు (2,283) రాష్ట్రాల్లో కలిపి మొత్తం 5,011 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించారు. అలాగే వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి మొత్తం 5,363 (బెంగాల్‌లో 3,142, తమిళనాడులో 2,221) స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు.
· ఎన్నికల జప్తు నిర్వహణ వ్యవస్థ (ఈఎస్ఎంఎస్) ఫిబ్రవరి 26, 2026న ప్రారంభమైనప్పటి నుంచి ఏప్రిల్ 17, 2026 వరకు నమోదైన గణాంకాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
|
క్రమసంఖ్య
|
రాష్ట్రం
|
నగదు (రూ. కోట్లు)
|
మద్యం పరిమాణం (లీటర్లు)
|
మద్యం విలువ (రూ. కోట్లు)
|
డ్రగ్స్ విలువ (రూ. కోట్లు)
|
విలువైన లోహం (రూ. కోట్లు)
|
ఉచితాలు/ ఇతర (రూ. కోట్లు)
|
మొత్తం (రూ. కోట్లు))
|
|
1.
|
పశ్చిమ బెంగాల్
|
21
|
31,94,621
|
81
|
100
|
54
|
172
|
427
|
|
2.
|
తమిళనాడు
|
78
|
97,107
|
3
|
74
|
105
|
178
|
438
|
| |
మొత్తం
|
99
|
32,91,728
|
84
|
174
|
159
|
350
|
865
|
· ఈ ఆదేశాల అమలు కోసం తనిఖీలు, సోదాలు చేస్తున్న సమయంలో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు, వేధింపులు కలగకుండా చూడాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ఈసీ ఆదేశించింది. ఈ విషయంలో పౌరులకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కరించడానికి జిల్లా ఫిర్యాదుల కమిటీలను కూడా ఏర్పాటు చేసింది.
· ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై పౌరులు, రాజకీయ పార్టీలు సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2253188)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10