ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహిళా శక్తి సామర్థ్యాన్ని, తోడ్పాటును చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 17 APR 2026 8:50AM by PIB Hyderabad

బలమైన భారత్‌కు గుర్తింపుగా  మహిళా శక్తి  నిలుస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని తల్లులు, అక్కచెల్లెళ్లు, కుమార్తెలు వారి తిరుగులేని దృఢసంకల్పం, అంకితభావం, సేవాభావనలతో ప్రతి రంగంలో భారత్‌ గౌరవాన్ని పెంపొందిస్తున్నారని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు:
‘‘దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా నిశ్శేషదేవగణశక్తిసమూహమూర్త్యా
తామంబికామఖిలదేవమహర్షిపూజ్యాం భక్త్యా నతా: స్మ విద్‌ధాతు శుభాని సా న:’’
ఈ శ్లోకం అంబికను ప్రార్థిస్తోంది.. ఏ దేవీమాత తన శక్తితో ఈ సంపూర్ణ జగత్తును వ్యాప్తి చెందేటట్లు చేశారో, ఏ దేవీమాత సకల దేవతా శక్తుల సమూహం తాలూకు సాక్షాత్ స్వరూపంగా వెలిశారో.. ఆ సమస్త దేవతలూ, మహర్షులూ పూజిస్తున్న అంబికా మాతకు మనం భక్తిపూర్వక ప్రణామాలను అర్పిద్దాం. ఆ జగదంబ మనను చల్లగా చూడు గాక అనే విన్నపం ఈ స్తుతిలోని భావం.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని  ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘మన నారీ శక్తి సాధికార భారత్‌కు ప్రతీక. దేశంలోని తల్లులూ, అక్కచెల్లెళ్లు, కుమార్తెలు తమ తిరుగులేని సంకల్ప శక్తి, అంకిత భావం, సేవాభావనలతో ప్రస్తుతం ప్రతి ఒక్క రంగంలోనూ భరతవర్షం గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నారు.
‘‘దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా నిశ్శేషదేవగణశక్తిసమూహమూర్త్యా
తామంబికామఖిలదేవమహర్షిపూజ్యాం భక్త్యా నతా: స్మ విద్‌ధాతు శుభాని సా న:’’ అని పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2252936) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Kannada , Malayalam