కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కంపెనీల (నమోదు) నియమాలు - 2014ను సమీక్షించేందుకు, కంపెనీ చట్టం 2013 పరిధిలోని ఫైలింగ్ విధివిధానాలను హేతుబద్ధీకరించేందుకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానించిన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
17 APR 2026 9:05AM by PIB Hyderabad
2026 ఏప్రిల్ 8న విడుదల చేసిన బహిరంగ నోటీసు ద్వారా కంపెనీల (నమోదు) చట్టం - 2014కు సవరణలను ప్రతిపాదిస్తూ.. కంపెనీల (నమోదు) సవరణ నియమాలు-2026 పేరుతో ముసాయిదాను నోటిఫికేషన్ సిద్ధమైంది. ఈ నోటిఫికేషన్‌ను నిపుణులకు సమాచారం, ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం www.mca.gov.in వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) వెబ్‌సైట్లో ఉన్న ఈ-కన్సల్టేషన్ మాడ్యూల్ ద్వారా ప్రతిపాదిత సవరణలపై సంక్షిప్త వివరణతో సహా సూచనలు/అభిప్రాయాలను 2026 మే 9 లోపు సమర్పించవచ్చు.
దీనికి అదనంగా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ) ద్వారా సంప్రదింపుల ప్రక్రియను ఎంసీఏ చేపడుతుంది. దీని ద్వారా కంపెనీల చట్టం 2013 ప్రకారం ఫైలింగ్/అమలు విధానాలను హేతుబద్దీకరించేందుకు నిపుణుల సూచనలను మంత్రిత్వ శాఖ స్వీకరిస్తుంది. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ నోట్‌ను నిపుణులకు సమాచారం, ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం www.mca.gov.in, https://iica.nic.in లో అందుబాటులో ఉంచింది. కార్పొరేట్ జీవన చక్రంలోని ప్రారంభం, కార్యకలాపాలు, నిష్క్రమణ అనే మూడు దశలపై సూచనలు స్వీకరిస్తారు. దీనికి సంబంధించిన అభిప్రాయాలను https://iica.nic.in/mcaeodbform వెబ్ లింక్ ద్వారా సమర్పించవచ్చు. అభిప్రాయాలను సమర్పించడానికి చివరి తేదీ 2026 మే 15.
***
(రిలీజ్ ఐడి: 2252929)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13