ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి.. మహిళా సాధికారత పట్ల నిబద్ధతను స్పష్టం చేసిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 16 APR 2026 9:53AM by PIB Hyderabad

పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఈ రోజు మొదలవుతున్న సందర్భంలో, దేశం మహిళలకు సాధికారత కల్పించే దిశగా చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోనుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. తల్లులనూ, అక్కచెల్లెళ్లనూ గౌరవిస్తే దేశాన్ని గౌరవించినట్లేనని ఆయన తెలిపారు. ఈ భావనతో, ఈ మార్గంలో దేశం దృఢసంకల్పంతో ముందుకు కదులుతోందని ప్రధాని అన్నారు.
సంస్కృత భాషలో ఉన్న ఓ సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి ఇలా పంచుకున్నారు:
‘‘వ్యుచ్ఛన్తీ హి రశ్మీభిర్విశ్వమాభాసి రోచనమ్
తా త్వాముషర్వసూయవో గీర్భి: కణ్వా అహుషత్’’
మహిళ తన జ్ఞ‌ాన కాంతితో అజ్ఞ‌ాన చీకటిని పారదోలి ప్రపంచాన్ని వెలుగులతో నింపుతుంది. ఈ కారణంగా, సమృద్ధిని, సద్గుణాలను అలవరుచుకోవాలని ఆకాంక్షించే వారు మహిళలను సదా గౌరవిస్తారు, వారి పట్ల ఆదరాన్ని కనబరుస్తారని ఈ సంస్కృత సూక్తి మనకు చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ఈ రోజు నుంచి మొదలవుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో మహిళలకు సాధికారతను అందించడానికి మన దేశం చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోబోతోంది. మన తల్లులనూ, అక్కచెల్లెళ్లనూ గౌరవించడం దేశాన్ని గౌరవించుకోవడమే అవుతుంది. ఈ భావనతో, మనం ఈ మార్గంలో దృఢనిశ్చయులమై ముందుకు సాగుతున్నాం.
‘‘వ్యుచ్ఛన్తి హి రశ్మీభిర్విశ్వమాభాసి రోచనమ్
తా త్వాముషర్వసూయవో గీర్భి: కణ్వా అహుషత్’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2252455) సందర్శకుల సూచీ సంఖ్య : : 31