ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వినియోగదారుల అనుభవాన్ని, డిజిటల్ అందుబాటును మెరుగుపరిచేందుకు ‘మై ఎల్‌ఐసీ’, ‘సూపర్ సేల్స్ సాథీ’ మొబైల్ యాప్‌లను ప్రారంభించిన ఎల్‌ఐసీ


పారదర్శకమైన, పౌర-కేంద్రీకృత సేవలతో సమగ్ర, సాంకేతికతతో కూడిన

బీమా రంగాన్ని నిర్మించాలనే దేశ నిబద్ధతకు నిదర్శనమే ఈ కార్యక్రమం

నాడు పోస్టు చేయడమైనది: 15 APR 2026 7:57PM by PIB Hyderabad

నేడు ముంబయిలో ఎల్‌ఐసీకి చెందిన రెండు కొత్త మొబైల్ యాప్‌లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి శ్రీ ఎం. నాగరాజు ప్రారంభించారు. వినియోగదారుల కోసం ‘మై ఎల్‌ఐసీ’ యాప్‌ను, ఏజెంట్ల కోసం ‘ఎల్‌ఐసీ సూపర్‌ సేల్స్‌ సాథీ’యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ శ్రీ ఆర్ దొరైస్వామి, మేనేజింగ్ డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 26 కోట్లకు పైగా పాలసీలతో దేశంలో అత్యంత విస్తృతమైన వ్యవస్థను కలిగి ఉన్న ఎల్‌ఐసీ.. వేగంగా మారుతున్న బీమా మార్కెట్ లో పోటీ సామర్థ్యాన్ని నిలుపుకోవడానికి, సేవల సామర్థ్యాన్ని పెంచడానికి, వినియోగదారులకు వేగవంతమైన, నాణ్యమైన డిజిటల్ సేవలను అందించడంలో ఈ యాప్ లు కీలకపాత్ర పోషించనున్నాయి.

 

మై ఎల్ఐసీ యాప్ పాలసీ సేవలు, క్లెయిమ్ సాయం, ప్రీమియం చెల్లింపులు, డాక్యుమెంటేషన్‌, వినియోగదారుల భాగస్వామ్యం వంటి అన్ని సౌకర్యాలను ఒకే చోట అందిస్తుంది. వినియోగదారులకు పూర్తి డిజిటల్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది కాగితపు పనిని తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడానికి సహాయపడుతుంది. పాలసీదారులు తమ ఆర్థిక రక్షణ బాధ్యతలను స్వయంగా నిర్వహించుకునేలా చేస్తుంది. ఈ కొత్త డిజిటల్ వేదిక కేవలం వినియోగదారులకే పరిమితం కాదు. సూపర్ సేల్స్ సాథీ యాప్, ఎల్ఐసీ మధ్యవర్తులు, క్షేత్రస్థాయి సిబ్బంది మరింత సమర్థవంతంగా, నమ్మకంగా సేవలు అందించేలా సహాయపడుతుంది. మార్కెటింగ్ సమాచారం, పనితీరును పర్యవేక్షించడం, వినియోగదారుల వివరాలను విశ్లేషించే డిజిటల్ సాధనాల ద్వారా పాలసీదారులకు మొదటి నుంచి చివరి వరకు మరింత నమ్మకంతో, సమర్థవంతంగా సేవలు అందించడానికి ఇది తోడ్పడుతుంది.

 

మై ఎల్ఐసీ యాప్ – పాలసీదారులకు అందించే ముఖ్య సదుపాయాలు

· ఒకే చోట మొత్తం బీమా సమాచారం

· తక్షణ ప్రీమియం చెల్లింపులు

 

· పాలసీ ప్రయోజనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం

· కాగితపు పని లేకుండానే పాలసీపై రుణ సదుపాయం

· ఆన్‌లైన్‌లో పాలసీల అప్‌డేట్

· ఆన్‌లైన్‌లో పాలసీల పునరుద్ధరణ

· ఆన్‌లైన్‌లో కొత్త పాలసీల వివరాలు.. సులభంగా,వేగంగా డిజిటల్ పద్ధతిలో కొనుగోలు

· వేగవంతమైన, సురక్షిత కాగిత రహిత కేవైసీ ప్రక్రియ

సూపర్ సేల్స్ సాథీ.. మార్కెటింగ్ కోసం ముఖ్య సదుపాయాలు:

· విక్రయాలను మెరుగుపరిచే డిజిటల్ సాధనాలు.

· ఎప్పటికప్పుడు పాలసీ స్థితిగతుల పర్యవేక్షణ

· పాలసీదారులతో ఫాలో-అప్‌ల కోసం ఆటోమేటిక్ రిమైండర్లు

· వినియోగదారులతో సమీకృత కమ్యూనికేషన్

· వినియోగదారులకు మెరుగైన సేవలందించడానికి ఏఐ ఆధారిత సూచనలు

· ప్రయాణంలో ఉన్నప్పుడు పాలసీల గురించి తెలిపేందుకు వీలయ్యే డిజిటల్ సమాచార కిట్లు, ప్రజెంటేషన్లు,

· ఏజెంట్లు తమ లక్ష్యాలను, సాధించిన విజయాలను నిరంతరం పర్యవేక్షణ కోసం ప్రత్యేక డ్యాష్‌బోర్డ్.

పైన పేర్కొన్న రెండు మొబైల్ యాప్‌లు ఎల్ఐసీ డీఐవీఈ (డిజిటల్ ఆవిష్కరణలు, సేవా విలువను పెంచడం) డిజిటల్ వేదికగా ద్వారా అందుతాయి. వీటిని వినియోగదారులు, ఏజెంట్లు, ఉద్యోగుల కోసం నిరాటంకమైన, సురక్షితమైన, పూర్తిస్థాయి సమీకృత బీమా అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2252433) సందర్శకుల సూచీ సంఖ్య : : 92
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi