సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మలయాళ చిత్రం అచ్చప్పాస్ ఆల్బమ్‌ను 2026 ఏప్రిల్ 24న దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన ఎన్ఎఫ్‌డీసీ


టైమ్ ట్రావెల్ అనే వినూత్న కథాంశానికి సాధారణ భావోద్వేగాల

మేళవింపుతో తెరకెక్కిన కాల్పనిక కుటుంబ కథా చిత్రం

నాడు పోస్టు చేయడమైనది: 14 APR 2026 2:29PM by PIB Hyderabad

మలయాళ చిత్రం అచ్చప్పాస్ ఆల్బమ్ (గ్రాండ్ పాస్ ఆల్బమ్)ను విడుదల చేసేందుకు సమాచారప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ చలన చిత్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీసిద్ధమవుతోందికాల్పనిక కుటుంబ నేపథ్యంహాస్యంభావోద్వేగాల మేళవింపుతో టైమ్ ట్రావెల్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం 2026 ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రానికి దీప్తి పిళ్లై శివన్ దర్శకత్వం వహించగా సంజీవ్ శివన్అనిర్బన్ భట్టాచార్యఉమేష్ నాయర్ రచనా సహకారం అందించారుగతాన్ని పునర్దర్శించాలని అందరికీ సహజంగా ఉండే ఆసక్తిని ఈ చిత్రం అన్వేషిస్తుందిఅనుకోని పరిస్థితుల్లో విధి ఆడిన వింత నాటకం వల్ల ఒకరి జీవితంలోకి మరొకరు అడుగుపెట్టే తండ్రీకొడుకుల చుట్టూ ఈ కథ తిరుగుతుందిఈ మార్పే.. ఆలోచనల్లోఎంపికల్లో తరాల మధ్య ఉన్న అంతరాన్ని అర్థవంతంగాహాస్యభరితమైన నేపథ్యంలో ఆవిష్కరిస్తుంది.

ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మోహన్ ఆగాషేతో పాటు అంజనా అప్పుకుట్టన్ఆదినాథ్ కొఠారేప్రియాంక నాయర్సిధాంశు సంజీవ్ శివన్ తదితరులు నటించారుసినిమాటోగ్రాఫర్ మనోజ్ పిళ్లైజాతీయ పురస్కార గ్రహీత శ్రీకర్ ప్రసాద్సంగీత దర్శకుడు గుల్రాజ్ సింగ్ లాంటి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేశారు.

 

image.png

సరళంగాఆకట్టుకొనే టైం ట్రావెల్ కథతో లోతైన మానవ సంబంధాలను ఈ చిత్రం అన్వేషిస్తుందిఈ కథను వెండితెరపైకి తీసుకొచ్చేందుకు సహకరించిన ఎన్ఎఫ్‌డీసీకి కృతజ్ఞతలు’’ అని దర్శకురాలు దీప్తి పిళ్లై శివన్ అన్నారు.

విభిన్న చిత్రాలను ప్రోత్సహించడంలో ఎన్ఎఫ్‌డీసీ పాత్రను ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాశ్ మగ్దుం వివరించారు. ‘‘భారతీయ సినిమాలో వైవిధ్యమైన గొంతుకలను ప్రోత్సహించడంలో మా నిబద్ధతను ఈ సినిమా ప్రతిబింబిస్తుందిఊహాత్మక కథాంశాన్ని భావోద్వేగపరమైన లోతుతో మేళవించిన అచ్చప్పాస్ ఆల్బమ్ సినిమా అన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తుంది.‌’’

ఎన్ఎఫ్‌డీసీ సామాజిక మాధ్యమ వేదికల్లో ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ టీజర్ అందుబాటులో ఉంది. అధికారిక ట్రైలర్ త్వరలో విడుదల కానుందిటీజర్‌ను [https://www.youtube.com/watch?v=G6WDgZNA5u8లో వీక్షించవచ్చు.

ఎన్ఎఫ్‌డీసీ గురించి:

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని అపెక్స్ సంస్థ అయిన జాతీయ చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎఫ్‌డీసీ) 1975లో ఏర్పాటయిందిభారతీయ చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు దీనిని ఏర్పాటు చేశారుచిత్ర నిర్మాణంప్రచారం నుంచి వివిధ భారతీయ భాషల చిత్రాలను పరిరక్షించడం వరకు మొత్తం చలన చిత్ర రంగానికి ఈ సంస్థ తోడ్పాటునందిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2252062) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Punjabi , Kannada , Malayalam