రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 13 APR 2026 7:07PM by PIB Hyderabad

ఏప్రిల్ 14వ తేదీ డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆమె తన సందేశంలో ‘‘భారత రాజ్యాంగ రూపశిల్పి, గొప్ప సంఘ సంస్కర్త... బాబాసాహెబ్ డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను ఆయనకు గౌరవపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.

బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప న్యాయకోవిదుడు, ఆర్థికవేత్త, ఆలోచనాపరుడు, న్యాయ శాస్త్రవేత్త, సమానత్వంతో కూడిన సామాజిక వ్యవస్థ కోసం గట్టిగా వాదించిన వ్యక్తి. ఆయన తన జీవితాన్ని సమాజంలోని అణగారిన, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంకితం చేశారు. వారి పక్షాన చారిత్రక సహకారాన్ని అందించారు. ఆయన కేవలం అసమానతలను తొలగించే మార్గాన్ని చూపడమే కాకుండా, దేశ ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ హక్కులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. మహిళా విద్యకు, వారి హక్కులకు డాక్టర్ అంబేద్కర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఆయన అందించిన బహుముఖ కృషి దేశ సేవ... రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.

 

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శాలను మన జీవితాల్లో ఆచరిస్తూ, ఒక న్యాయబద్ధమైన, సమ్మిళితమైన, ప్రగతిశీలమైన దేశ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2251909) సందర్శకుల సూచీ సంఖ్య : : 92
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati , Kannada