ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 14 APR 2026 9:14AM by PIB Hyderabad

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక నివాళి అర్పించారు.

దేశ నిర్మాణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన అసమానమైన సేవలు తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు. న్యాయమైన, సమ్మిళితమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించే దిశగా డాక్టర్ అంబేద్కర్ జీవితం, ఆదర్శాలు పౌరులకు ప్రేరణగా నిలుస్తాయని తెలియజేశారు.

డాక్టర్ అంబేద్కర్ వ్యక్తిత్వం, కృషి దేశాభివృద్ధికి ఎల్లప్పుడూ మార్గదర్శక శక్తిగా ఉంటాయని ప్రధానమంత్రి చెప్పారు.

శ్రీ మోదీ పంచుకున్న సంస్కృత సుభాషితం:

అయం నిజః పరో వేతి గణనా లఘుచేతసామ్

ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకం।।

ఎక్స్ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

 ‘‘డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకం. న్యాయమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించే దిశగా తరతరాలను ఆయన జీవితం, కృషి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.’’

‘‘దేశ నిర్మాణంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వ్యక్తిత్వం, కృషి స్ఫూర్తినందిస్తూనే ఉంటాయి.

అయం నిజః పరో వేతి గణనా లఘుచేతసామ్

ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకం।।’’


(రిలీజ్ ఐడి: 2251901) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Manipuri , Gujarati , Kannada