ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు.. పూలే 200వ జయంతి వేడుకల ప్రారంభం


సామాజిక సమానత్వం, సాధికారతకు మార్గదర్శిగా మహాత్మా పూలే పోషించిన పాత్రను ప్రస్తావిస్తూ ఓ వ్యాసం ద్వారా తన భావాలను పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 11 APR 2026 9:14AM by PIB Hyderabad

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. పూలేను ఒక దార్శనిక సామాజిక సంస్కర్తగా అభివర్ణించిన ప్రధాని.. ఆయన తన జీవితాన్ని సమానత్వం, న్యాయం, విద్య వంటి ఉన్నత ఆశయాల కోసమే అంకితం చేశారని కొనియాడారు.

మహిళలు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడటంలో మహాత్మా పూలే  ఒక మార్గదర్శిగా నిలిచారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తన నిరంతర కృషి ద్వారా విద్యను మహిళల సాధికారతకు ఒక శక్తిమంతమైన సాధనంగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ సంవత్సరం ఆ మహానీయ సంస్కర్త  200వ జయంతి వేడుకలు ప్రారంభం కావడం అత్యంత విశేషమని అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి ఒక ప్రత్యేక వ్యాసాన్ని కూడా రాశారు. మహాత్మా పూలే నేటికీ అనేక మందికి మార్గదర్శిగా నిలుస్తున్నారన్నారు.  విద్య, అభ్యసనం, అందరి సంక్షేమం కోసం ఆయన ఇచ్చిన ప్రాధాన్యత నేటి కాలంలో ఎంతగానో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని తెలిపారు. సమాజ ప్రగతికి పూలే ఆలోచనలు మనందరికీ నిరంతరం దిశానిర్దేశం చేయాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా.. సమానత్వం, న్యాయం, విద్య అనే ఆదర్శాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆ దార్శనిక సంఘ సంస్కర్తకు ఘన నివాళులర్పిస్తున్నాను. మహిళలు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణలో ఆయన ఒక మార్గదర్శిగా నిలిచారు. ఆయన చేసిన కృషి ఫలితంగా విద్య సాధికారతకు ఒక శక్తిమంతమైన సాధనంగా రూపుదిద్దుకుంది. ఈ సంవత్సరం ఆయన 200వ జయంతి ఉత్సవాల ప్రారంభాన్ని మనం జరుపుకుంటున్నాం. సామాజిక ప్రగతి దిశగా సాగే ప్రస్థానంలో ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరికీ నిరంతరం దిశానిర్దేశం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.’’

మహాత్మా ఫూలే 200వ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్న ఈ తరుణంలో.. ఆయన ఎందరో వ్యక్తులకు ఏ విధంగా మార్గదర్శిగా నిలుస్తున్నారు, విద్య, అభ్యాసనం, సర్వజన సంక్షేమంపై ఆయన కనబరిచిన ప్రాధాన్యత నేటి యుగానికి ఎంతటి సంబంధం కలిగి ఉన్నాయనే అంశాలపై నా భావాలను వ్యాసంలో రాశాను.’’

గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా ఫూలే 200వ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఆయన తన జీవితమంతా విద్య, జ్ఞానం, ప్రజా సంక్షేమానికి అంకితం చేశారు.  నేటికీ కోట్లాది దేశవాసులకు ఆయన ఎలా స్ఫూర్తిగా నిలిచారనే విషయాలపై నా ఆలోచనలను ఈ వ్యాసంలో పొందుపరిచాను.’’

 

***


(రిలీజ్ ఐడి: 2251108) సందర్శకుల సూచీ సంఖ్య : : 35
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Gujarati , Kannada