ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజ్యసభకు శ్రీ హరివంశ్‌… శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 10 APR 2026 2:20PM by PIB Hyderabad

శ్రీ హరివంశ్‌ ను గౌరవ రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసిన నేపథ్యంలో... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారుఆయన భావి పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదం కావాలని ప్రధాని అభిలషించారు.

పత్రికారచనకూప్రజాజీవనానికీ శ్రీ హరివంశ్ అమూల్యమైన సేవలను అందించారనీగౌరవాన్విత మేధావిగాఆలోచనాపరునిగా గుర్తింపు తెచ్చుకున్నారనీ ప్రధానమంత్రి అన్నారుఆయన ప్రభావవంతమైన ఆలోచనలతో పాటు విస్తృత అవగాహన గత కొన్నేళ్లలో సభా కార్యకలాపాల్ని సుసంపన్నం చేశాయని శ్రీ మోదీ తెలిపారుశ్రీ హరివంశ్‌ను నామినేట్ చేయడంపై ప్రధాని సంతోషాన్ని వ్యక్తం చేశారుశ్రీ హరివంశ్ సభా కార్యకలాపాల్లో నిరంతరం పాలుపంచుకోవడం పార్లమెంట్ కార్యకలాపాలను మరింత ఫలప్రదం చేయనుందని ప్రధాని అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘
హరివంశ్ గారు పత్రికారచనతో పాటు ప్రజాజీవన రంగానికి కూడా అమూల్యమైన సేవలను అందించారుఆయన మేధావి.. ఆలోచనపరుడుఆయన ప్రభావవంతమైన ఆలోచనలూఅవగాహనా గత కొన్నేళ్లలో సభా కార్యకలాపాల్ని సుసంపన్నం చేశాయిరాష్ట్రపతి గారు ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయడం ఎంతో సంతోషదాయకంఆయన పార్లమెంట్ పదవీ కాలం సఫలమవ్వాలని కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2251024) సందర్శకుల సూచీ సంఖ్య : : 12